spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Nagababu: పవన్ ఆదేశాలతో రంగంలోకి నాగబాబు

Nagababu: పవన్ ఆదేశాలతో రంగంలోకి నాగబాబు

Nagababu: మెగా బ్రదర్ నాగబాబు( Mega brother Nagababu ) త్వరలో మంత్రి కానున్నారు. ఇప్పటికే ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుంటామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అందులో భాగంగా గత ఏడాది ఆయన ఎమ్మెల్సీ అయ్యారు. అయితే ఆయన అనుకున్న స్థాయిలో వాయిస్ వినిపించడం లేదని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఎదుర్కోలేకపోతున్నారని స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రశ్నించేసరికి నాగబాబు అప్రమత్తమయ్యారు. అప్పటినుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం ప్రారంభించారు. వరుసగా వీడియోలు విడుదల చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గట్టిగానే నిలదీస్తున్నారు. తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. కర్మ చుట్టూ ఆయన కామెంట్స్ కొనసాగాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కర్మ విడిచిపెట్టదు అని ఆయన తేల్చి చెప్పారు.

Also Read: బాలయ్య కూతురు తేజస్విని డైరెక్టర్ గా మారుతుందా.? హీరో ఎవరంటే..?

* ప్రత్యేక వీడియో..
ఇటీవల శాసనమండలిలో నెయ్యి కల్తీ వ్యవహారంపై చర్చ జరిగిన సంగతి తెలిసిందే. అయితే అర్ధాంతరంగా వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ ఆందోళనతో మండలిలో చర్చ ముగిసింది. అందుకే తనకు ఏ అవకాశం రాలేదని.. మాట్లాడలేకపోయానని.. అందుకే ఈ ప్రత్యేక వీడియో విడుదల చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు నాగబాబు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పుల మీద తప్పులు చేసిందని.. నెయ్యి కల్తీ చేశారని.. టికెట్ల జారీలో కూడా అవినీతి జరిగిందని.. వీటన్నింటికీ మూల్యం చెల్లించుకోక తప్పదని.. కర్మ ఎవరిని విడిచి పెట్టదు అని కొన్ని ఆధ్యాత్మిక మాటలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓ రేంజ్ లో వేసుకున్నారు నాగబాబు. అయితే నాగబాబు వీడియో జనసైనికులకు బాగానే తాకింది. ఇకనుంచి టీటీడీ లడ్డు వ్యవహారంలో జనసేన సైతం విరుచుకు పడే పరిస్థితి కనిపిస్తోంది.

* పవన్ హెచ్చరికలు..
మొన్న ఆ మధ్యన పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులను గట్టిగానే హెచ్చరించిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం అంటే ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే కాదు అని.. అందులో జనసేన సైతం ఉందన్న విషయాన్ని గ్రహించుకోవాలని హెచ్చరించిన సంగతి తెలిసిందే. సినిమా పరిశ్రమపై మాట్లాడేవారు సైతం లడ్డు వివాదంపై ఎందుకు మాట్లాడడం లేదని పవన్ ప్రశ్నించినట్లు ఆ మధ్యన కామెంట్స్ వినిపించాయి. పవన్ కళ్యాణ్ ఓ దశలో మెగా బ్రదర్ నాగబాబు పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. అప్పటినుంచి నాగబాబు వీడియోలు విడుదల చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఆగ్రహం బాగానే పనిచేస్తుందన్న కామెంట్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి. మొత్తానికి అయితే మెగా బ్రదర్ నాగబాబు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాను ఆ మూవీ నుంచి కాపీ చేశారా…ఈ సినిమాలో అసలు...

Chennai Love Story: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో ఎన్నో ప్రేమ కథ చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ సూపర్ సక్సెస్ గా నిలిచాయి. ఇక ఇలాంటి...
Mega Family

Mega Family: హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న మరో మెగా ఫ్యామిలీ హీరో…

Mega Family: సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు సినిమాల్లో నటించేటప్పుడు తమ తోటి ఆర్టిస్టులతో చాలా మంచి సాన్నిహిత్యాన్ని మైంటైన్ చేస్తుంటారు. దానివల్ల వాళ్ళకి మరికొన్ని సినిమాల్లో అవకాశాలు...
Balakrishna

Balakrishna: టైర్ వన్ హీరోలు బాలయ్య ను చూసి నేర్చుకోండి….

Balakrishna: నందమూరి నట సింహం బాలయ్య బాబు నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో విషయమైన అంచనాలు క్రియేట్ అవుతాయి. బాలకృష్ణ మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ భారీ రికార్డులను బ్రేక్...
Donald Trump

Donald Trump: మరో బాంబు పేల్చిన ట్రంప్‌..

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా ఫస్ట్‌ నినాదంతో ఆ దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను తరిమి కొట్టే పని మొదలు పెట్టారు. తర్వాత...
Appalaraju Arrest

Appalaraju Arrest: అప్పలరాజును వెనుకేసుకొస్తున్న వైసిపి.. మరి అంత నీచమా?!

Appalaraju Arrest: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టుపై కక్ష సాధింపు అన్నముద్ర వేస్తోంది. రాజకీయ కక్షతోనే అప్పలరాజును...
Oktelugu Epaper