Homeఆంధ్రప్రదేశ్‌Duvvada Srinivas selfie video: ‘దువ్వాడ’ బాధ అంతా ఇంతా కాదు..

Duvvada Srinivas selfie video: ‘దువ్వాడ’ బాధ అంతా ఇంతా కాదు..

Duvvada Srinivas selfie video: ఏపీలో ప్రస్తుతం రాజకీయం వేడెక్కింది. టీటీడీ లడ్డుకు సంబంధించి నెయ్యి కల్తీ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. సిబిఐ ఇచ్చిన రిపోర్టులో ఎటువంటి జంతు కొవ్వు లేదని తేలిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చెబుతుండగా.. పామాయిల్ తో కూడిన రసాయనాలను కలిపి, పాల నుంచి తీసిన నెయ్యి కాకుండా వాడారు అన్నది టిడిపి కూటమి ప్రభుత్వం చెబుతోంది. కచ్చితంగా కల్తీ జరిగిందని.. జంతు కొవ్వు వాడారని ఆరోపిస్తోంది. దీంతో అధికార […]

Duvvada Srinivas selfie video: ఏపీలో ప్రస్తుతం రాజకీయం వేడెక్కింది. టీటీడీ లడ్డుకు సంబంధించి నెయ్యి కల్తీ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. సిబిఐ ఇచ్చిన రిపోర్టులో ఎటువంటి జంతు కొవ్వు లేదని తేలిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చెబుతుండగా.. పామాయిల్ తో కూడిన రసాయనాలను కలిపి, పాల నుంచి తీసిన నెయ్యి కాకుండా వాడారు అన్నది టిడిపి కూటమి ప్రభుత్వం చెబుతోంది. కచ్చితంగా కల్తీ జరిగిందని.. జంతు కొవ్వు వాడారని ఆరోపిస్తోంది. దీంతో అధికార విపక్షం మధ్య గట్టిగానే ఫైట్ నడుస్తోంది. ఇటువంటి సమయంలో వైసీపీ నుంచి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రంగంలోకి దిగారు. ఈ కల్తీ నెయ్యి వ్యవహారంపై స్పందించారు.

చాలా యాక్టివ్..
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు దువ్వాడ శ్రీనివాస్. ఈ క్రమంలో ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు. నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చెబుతున్నారని… జంతు కొవ్వు కలవలేదని వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారని గుర్తు చేశారు దువ్వాడ శ్రీనివాస్. కానీ ఏది నిజమో తెలియక కోట్లాదిమంది భక్తులు ఆవేదనకు గురవుతున్నారని చెప్పారు. దీనిపై ఫుల్ క్లారిటీ రావాలని.. అసలు వాస్తవాలు ఏంటో చెప్పాలంటూ డిమాండ్ చేశారు దువ్వాడ శ్రీనివాస్. అయితే ఆయన మాటలు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికీ ఆయన జగన్మోహన్ రెడ్డిని అభిమానిస్తూనే ఉన్నారు. తన ఈ పరిస్థితికి శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్లు కారణమని ఆరోపిస్తున్నారు.

వివాదాలతో సస్పెన్షన్ వేటు..
కుటుంబ వ్యక్తిగత వివాదాల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్కు గురయ్యారు దువ్వాడ శ్రీనివాస్. ప్రస్తుతం ఆయన వ్యాపార రంగంలో బిజీగా ఉన్నారు. మధ్య మధ్యలో సమకాలీన రాజకీయ అంశాలపై సోషల్ మీడియాలో మాట్లాడుతుంటారు. మధ్యలో యూట్యూబ్ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తుంటారు. అయితే తాజాగా ఈ కల్తీ వ్యవహారానికి సంబంధించి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఇదే అంశంపై మున్ముందు దువ్వాడ శ్రీనివాస్ మరిన్ని వీడియోలు విడుదల చేసి అవకాశం ఉంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper