Meghana reveals: ఏపీ రాజకీయాలలో జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ వివాహ వ్యవహారం ఇప్పటికీ సంచలనం సృష్టిస్తూనే ఉంది. జోగి రాజీవ్ వ్యవహార శైలి మీద అతడి భార్య మేఘన సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పైగా ఆమె విజయవాడలోని ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్లో కేసు కూడా పెట్టింది.
తెలంగాణ రాష్ట్రంలోని కోదాడ పట్టణానికి చెందిన మేఘనకు.. రాజీవ్ కు వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వివాహం జరిగింది. నాడు ఈ వివాహానికి ముఖ్యమంత్రి హోదాలో వైయస్ జగన్ హాజరయ్యారు. అయితే మేఘన వ్యవహారంలో రాజీవ్ మూర్ఖంగా ప్రవర్తించేవాడని అభియోగాలు ఉన్నాయి. ఆమెను దగ్గరికి తీసుకునేవాడు కాదని.. చివరికి ఆమెతో సరిగా మాట్లాడేవాడు కూడా కాదని మీడియాలో వార్తలు వస్తున్నాయి. తన వైవాహిక జీవితానికి సంబంధించి మేఘన ఇచ్చిన ఫిర్యాదులు అనేక సంచలన విషయాలు ఉన్నాయి. ఆ విషయాలను పోలీసులు మీడియాకు చెప్పడంతో.. జోగి రమేష్ ఇంట్లో ఏదో జరుగుతోంది అనే గుసగుసలు వినిపించాయి.
జోగి రమేష్ కుమారుడిని పెళ్లి చేసుకుంటున్నప్పుడు మేఘన తల్లిదండ్రులు భారీగానే కట్నం ఇచ్చారు. బంగారం.. ఇతర ఖరీదైన వస్తువులను కానుకలుగా ఇచ్చారు. అయితే హిందూ కుటుంబానికి చెందిన వారం అని చెప్పిన జోగి రమేష్ కుటుంబ సభ్యులు.. ఆ తర్వాత ఒక మతానికి సంబంధించిన కార్యకలాపాలు సాగించేవారు. మేఘనను కనీసం పూజలు కూడా చేయనిచ్చేవారు కాదు. దీంతో మేఘన తట్టుకోలేక ఈ విషయాలను బయటపెట్టింది. అయితే ఇప్పుడు జోగి రాజీవ్ కి సంబంధించిన మరో విషయం వెలుగులోకి వచ్చింది. మేఘనను అదనపు కట్నం తీసుకురావాలని జోగి రమేష్ భార్య శకుంతల వేధించారు. మేఘనకు వివాహం జరిగిన నెలకే ఆషాడం మాసం వచ్చింది. పుట్టింటి నుంచి కట్నం తీసుకొస్తే రాజుకు ఫీలింగ్స్ వస్తాయని శకుంతల చెప్పినట్టు మేఘన ఆరోపించింది.
ఒక మతాన్ని తాము ఆచరిస్తామని పెళ్లి చేశారని.. చివరికి వారు మరో మతాన్ని ఆచరించడం మొదలు పెట్టారని మేఘన ఆరోపించింది. నాడు న్యాయం కోసం వసంత కృష్ణ ప్రసాద్.. సజ్జల రామకృష్ణారెడ్డి వద్దకు వెళ్లినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. చివరికి జగన్ ను కలిసేందుకు ప్రయత్నించినా ఆ అవకాశం లభించలేదని మేఘన ఆరోపించింది. దీంతో జోగి రాజీవ్ వ్యవహారం మరో మలుపు తీసుకుంది. మేఘన సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. జోగి రమేష్ కుటుంబం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.