Jogi Family Controversy : జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ వ్యవహారం ఇప్పట్లో సర్దుమనిగే విధంగా కనిపించడం లేదు. నిన్న మీడియా ముందుకు వచ్చి జోగి రమేష్ పెద్దపెద్ద కబుర్లు చెప్పినప్పటికీ.. అది కేవలం సాక్షి మీడియాకు మాత్రమే పనికి వచ్చింది. మిగతా మీడియా సంస్థలు జోగి రమేష్ చెప్పిన మాటలను పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే ఆయన చెప్పిన మాటల్లో నిజం లేదు. పస అంతకంటే లేదు.
మేఘన ఎన్నో ఆశలతో జోగి రాజీవ్ ను వివాహం చేసుకుంది. ఎన్నో కలలతో అత్తింటి వారి ఇంట్లోకి అడుగు పెట్టింది. సహజంగా ఏ అమ్మాయి అయినా సరే.. కొత్తగా పెళ్లి చేసుకున్నప్పుడు కచ్చితంగా తనకంటూ కొన్ని అంచనాలు ఉంటాయి. భర్తతో సమయం గడపాలని.. అతడి సాంగత్యంలో సేద తీరాలని.. అతడి ఒడిలో ఓలలాడిపోవాలని.. చాలా కోరుకుంటుంది. కానీ వీటిని మేఘనకు అందించడంలో రాజీవ్ విఫలమయ్యాడు. అర్ధరాత్రి దాకా బాత్రూంలలో ఉండడం.. మేఘనకు దూరంగా ఉండడం.. నిత్యం ఫోన్లోనే సంభాషణలు జరపడం.. ఆమెకు ప్రైవసీ లేకుండా రూమ్ లోనే బంధించడం వంటివి చేసేవాడు. కొద్దిరోజుల పాటు వీటిని మౌనంగా భరించింది. చివరికి మేఘనను అంతం చేయడానికి రమేష్ ఫ్యామిలీ ప్రయత్నించింది. ఆ సమయంలో ఆమె తీవ్రంగా ఇబ్బంది పడింది. ఆ తర్వాత వారిని బతిమిలాడడంతో వదిలిపెట్టారు. అనంతరం ఆమె ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత జోగి రాజీవ్ వ్యవహారం మలుపు తిరిగింది. ఈ నేపథ్యంలో జోగి రాజీవ్ తో తన వివాహం.. ఆ తదుపరి పరిణామాలను మేఘన పూసగుచ్చినట్టు వివరించింది. ఆ తర్వాత జోగి రమేష్ మీడియా ముందుకు వచ్చారు. అనేక విషయాలను బయటపెట్టారు. తానే బాధిత పక్షం అన్నట్టుగా మాట్లాడారు. కానీ మేఘన అసలు విషయం చెప్పడంతో జోగి రమేష్ కు మాట్లాడే అవకాశం లేకుండా పోయింది..
“జోగి రమేష్ దంపతులు నాకు పెట్టింది గోరుముద్దలు కాదు.. అవి పూర్తిగా విషంతో నిండిన ముద్దలు. వారు గనక నా మీద ప్రేమ చూపిస్తే ఈ దుస్థితి వచ్చేది కాదు. ఎక్కువ కట్నం తీసుకొస్తేనే నువ్వు బాగుంటావ్ అని మా అత్త అనేది. నా పుట్టింటి వారికి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేదు. వారిదంతా కూడా బిజినెస్.. పెళ్లికి ముందు హిందువులం అని చెప్పారు. కానీ ఆ తర్వాత వారి అసలు స్వరూపం బయటపడింది. నేను పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రతి అంశం మీద నేను ఆధారాలు ఇవ్వగలను. నా దగ్గర పూర్తి ఎవిడెన్స్ ఉంది. నేను మాట్లాడింది కేవలం మామూలు వీడియో మాత్రమే. ఇంకా చాలా వీడియోలు నా దగ్గర ఉన్నాయి.. నాకు న్యాయం జరిపించాలని అప్పట్లో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వద్దకు వెళ్లాను. అప్పట్లో నా సమస్యకు పరిష్కారం చూపిస్తానని జోగి రమేష్ అన్నారు. కానీ కాలయాపన మాత్రమే చేశారు. రాజీవ్ తో వివాహం జరిగిన రెండు నెలలకే నా మీద నల్ అండ్ వైడ్ కేసు వేశారు.. అంతేకాదు పెళ్లి జరిగిన రెండు నెలలకే రాజీవ్ ఎందుకు విడాకులు తీసుకోవాలి అనుకున్నాడు. అయితే నాడు రాజీవ్ వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టి వేసింది. రాజీవ్ కు చికిత్స అందిస్తామని.. నువ్వు పుట్టింటికి వెళ్లాలని రెండు నెలలపాటు పంపించారు.. ఇందులో మా తప్పులేదు. ఆయనప్పటికీ ఏడాదిన్నరగా నరకం చూస్తున్నాం. మాకు న్యాయం జరగాలని” మేఘన వ్యాఖ్యానించింది.
మేఘన చెప్పినట్టుగా ఇంకా ఏం వీడియోలు ఉన్నాయి.. ఆ వీడియోలలో ఎటువంటి విషయాలు ఉన్నాయి.. జోగి రమేష్ కుటుంబం అంతటి ఆకృత్యాలకు పాల్పడిందా.. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఇటువంటి దారుణాలు చేశాడా.. చివరికి అదనపు కట్నం కోసం అతడి భార్య వేధించిందా.. ఇంత జరుగుతుంటే రాజీవ్ ఏం చేశాడు.. పోనీ అతనిలో లోపం ఉంటే ఎందుకు దానిని బయట పెట్టుకోలేదు.. ఒక ఆడపిల్ల జీవితాన్ని ఏం చేద్దాం అనుకున్నారు.. ఇలా రకరకాల చర్చలు ఏపి రాజకీయాలలో సాగుతున్నాయి. చూడబోతే మేఘన జోగి రమేష్ ను అంత ఈజీగా వదిలిపెట్టే విధంగా కనిపించడం లేదు.