Homeఆంధ్రప్రదేశ్‌Jogi Ramesh And YS Jagan: జోగి రమేష్ పై జగన్ అసహనం!

Jogi Ramesh And YS Jagan: జోగి రమేష్ పై జగన్ అసహనం!

Jogi Ramesh And YS Jagan: వ్యక్తిగత వ్యవహారాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చిక్కుకోవడంతో పార్టీ హైకమాండ్ కు చికాకుగా మారుతోంది. జోగి రమేష్ కుటుంబ వ్యవహారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేస్తోంది. ఆ పార్టీ శ్రేణుల్లో కూడా ఆందోళన కలిగిస్తోంది. కుటుంబ కలహాలను రాజకీయాలపైకి తేవడం.. ఆపై సీఎం చంద్రబాబు తో పాటు మంత్రి లోకేష్ హస్తము ఉందని జోగి రమేష్ ఆరోపించడాన్ని ఎక్కువమంది తప్పు పడుతున్నారు. దీంతో ఆయన కోడలితో పాటు […]

Jogi Ramesh And YS Jagan: వ్యక్తిగత వ్యవహారాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చిక్కుకోవడంతో పార్టీ హైకమాండ్ కు చికాకుగా మారుతోంది. జోగి రమేష్ కుటుంబ వ్యవహారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేస్తోంది. ఆ పార్టీ శ్రేణుల్లో కూడా ఆందోళన కలిగిస్తోంది. కుటుంబ కలహాలను రాజకీయాలపైకి తేవడం.. ఆపై సీఎం చంద్రబాబు తో పాటు మంత్రి లోకేష్ హస్తము ఉందని జోగి రమేష్ ఆరోపించడాన్ని ఎక్కువమంది తప్పు పడుతున్నారు. దీంతో ఆయన కోడలితో పాటు వియ్యంకుడు మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు వెళ్తే ఆయన ఆసక్తి చూపలేదని.. సజ్జల రామకృష్ణారెడ్డి రాజీ కుట్ర చేశారని ఆరోపణలు చేశారు. జోగి రమేష్ ఆరోపణలు ప్రజల్లోకి వెళ్లే కంటే ఇప్పుడు బాధితులుగా ఉన్న ఆయన కోడలు, వియ్యంకుడి మాటలు ఎక్కువగా వెళుతున్నాయి. పార్టీకి నష్టపరుస్తున్నాయి. పైగా హిందూ వ్యతిరేక వైఖరి బయటపడింది ఈ ఘటనతో. ఇది కూడా పార్టీకి డామేజ్ చేసే విషయమే.

* రాజకీయ రంగుపై..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ జోగి రమేష్ పై ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. కుటుంబ కలహాలను, వైవాహిక సమస్యలను నేరుగా పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ ద్వారా బయటపెట్టి.. దానికి రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేయడంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ తప్పు పడుతున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత తప్పులను, కుటుంబ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు పార్టీ ప్లాట్ఫాములను వాడుకోవడం తో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరింత డ్యామేజ్ చేసింది. జోగి రమేష్ మాట్లాడిన తర్వాత మాత్రమే ఆయన కోడలితో పాటు వియ్యంకుడు మీడియా ముందుకు వచ్చారు. దీంతో ఈ వ్యవహారం మరింత సున్నితంగా మారింది.

* పార్టీకి డ్యామేజ్..
సాధారణంగా ఇటువంటి కుటుంబ వ్యవహారాల్లో మహిళల వైపే ఎక్కువమంది మాట్లాడతారు. వారిపైనే సానుకూలత వ్యక్తం చేస్తారు. న్యాయం కోసం సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసిన ఫలితం లేకపోయిందని.. జగన్మోహన్ రెడ్డిని కలిసి ఎందుకు ప్రయత్నం చేసిన అవకాశం దక్కలేదని ఆమె బహిరంగంగా వెల్లడించడం మాత్రం పార్టీకి మింగుడు పడని విషయం. ప్రస్తుతం మేఘన వచ్చి వైసీపీ నేతల పేర్లు ప్రస్తావించడం.. మరోవైపు మతపరమైన అంశాలు ప్రజల్లోకి వెళ్లడం పార్టీ సాంప్రదాయ ఓటు బ్యాంకు పై ప్రతికూల ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం అవుతోంది. అందుకే జోగి రమేష్ పై జగన్ అసహనంతో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.

* చక్కదిద్దుకోవాలని సూచన..
అయితే తన కుమారుడి జీవితంలో నెలకొన్న వివాదాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని జోగి రమేష్ కు హై కమాండ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కుటుంబ సంక్షోభాలకు పార్టీతో ముడి పెట్టవద్దని.. ఇకనుంచి పార్టీ పేరును ఈ వ్యవహారంలో లాగవద్దని.. అనవసరంగా ప్రత్యర్థులను దూషించవద్దని కరాకండిగా తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు తో పాటు మంత్రి నారా లోకేష్ పేర్లను ప్రస్తావించి దీనిని రాజకీయ అంశంగా మార్చేశారు జోగి రమేష్. తన కోడలికి, వియ్యంకుడికి టిడిపి గైడ్ చేస్తుందని అర్థం వచ్చేలా మాట్లాడిన జోగి రమేష్.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కూడా ఇందులో జత చేసేసరికి పరిస్థితి మరింత జఠిలంగా మారింది. అందుకే వీలైనంత త్వరగా ఈ వివాదం పరిష్కరించుకొని రావాలని జోగి రమేష్ పై పార్టీ హై కమాండ్ ఒత్తిడి పెంచినట్లు తెలుస్తోంది. మరి ఎంత నిజం ఉందో తెలియాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper