Homeఆంధ్రప్రదేశ్‌RK Kotha Paluku: ఆంధ్రజ్యోతి ఆర్కే సార్ ఏమైంది మీకు.. ఎందుకీ మౌనం

RK Kotha Paluku: ఆంధ్రజ్యోతి ఆర్కే సార్ ఏమైంది మీకు.. ఎందుకీ మౌనం

RK Kotha Paluku: అమరావతిలో వైసిపి గొడవ.. సాయి కృష్ణ కేసు.. ఆ మధ్య జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ ప్రారంభం.. ఆంధ్ర బ్రాండ్ పేరుతో గోల్డ్ బిస్కెట్లు కూడా బయటకు వచ్చాయి.. ఇక తెలంగాణలో ప్రభుత్వానికి ఎస్బిఐ కి మధ్య వివాదం.. చివరికి మెత్తబడిన ఎస్బిఐ.. జాతీయస్థాయిలో పేరు తెచ్చుకుంటున్న రేవంత్ రెడ్డి.. దేశంలో పేరుపొందిన రాజకీయ నాయకులను కలుస్తున్న తీరు.. ఇటీవల రక్షణ శాఖ తెలంగాణ ప్రభుత్వానికి భూములు ఇచ్చింది.. దీని వెనక రేవంత్ రెడ్డి […]

RK Kotha Paluku: అమరావతిలో వైసిపి గొడవ.. సాయి కృష్ణ కేసు.. ఆ మధ్య జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ ప్రారంభం.. ఆంధ్ర బ్రాండ్ పేరుతో గోల్డ్ బిస్కెట్లు కూడా బయటకు వచ్చాయి.. ఇక తెలంగాణలో ప్రభుత్వానికి ఎస్బిఐ కి మధ్య వివాదం.. చివరికి మెత్తబడిన ఎస్బిఐ.. జాతీయస్థాయిలో పేరు తెచ్చుకుంటున్న రేవంత్ రెడ్డి.. దేశంలో పేరుపొందిన రాజకీయ నాయకులను కలుస్తున్న తీరు.. ఇటీవల రక్షణ శాఖ తెలంగాణ ప్రభుత్వానికి భూములు ఇచ్చింది.. దీని వెనక రేవంత్ రెడ్డి మంత్రాంగం ఉంది.. ఇవే కాదు.. భారత రాష్ట్ర సమితి కీలక నాయకులు హరీష్ రావు.. కేటీఆర్ తెలంగాణ వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. కెసిఆర్ బస్సు యాత్ర చేస్తారని.. కేటీఆర్ పాదయాత్ర చేస్తారని వార్తలు వస్తున్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ విధంగా పరిణామాలు జరుగుతున్నాయి.. ఇక దేశంలో అయోధ్య రామాలయంలో దొంగలు పడ్డారు. భక్తులు సమర్పించిన కానుకలను ఖతం చేశారు.. ఉజ్జయిని ప్రాంతంలో కూడా భూ కుంభకోణాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా బిజెపికి వ్యతిరేకంగా ఉన్నాయి. అలాగని కాంగ్రెస్ కూటమి కూడా గొప్పగా లేదు. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో లుకలుకలు బయట పడుతున్నాయి. ఇన్ని జరుగుతుంటే.. తెలుగు రాష్ట్రాల్లో.. దేశ రాజకీయాల్లో సమూలంగా మార్పులు చోటు చేసుకుంటుంటే.. ఒక జర్నలిస్టుగా మీరు సైలెంట్ గా ఎలా ఉన్నారు ఆంధ్రజ్యోతి ఆర్కే సార్ అలియాస్ వేమూరి రాధాకృష్ణ సార్..

ప్రతి ఆదివారం మీ కొత్త పలుకు లో రాతలు చూడాలని.. అందులో లోపాలను వెతికి పట్టుకోవాలని.. మిమ్మల్ని విమర్శించాలని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్లందర్నీ ఈ వారం మీరు డిసప్పాయింట్ చేశారు. మిగతా పత్రికలు చూడకుండా ఉంటారేమోగాని.. ఆదివారం నాడు మీ కొత్త పలుకు చూడకుండా… చదవకుండా ఉండలేరు. ముఖ్యంగా వైసిపి వాళ్లకు.. భారత రాష్ట్ర సమితి వాళ్లకు అదే పని.. ఎందుకంటే మీరు రాసే రాతలు వారికి ఒక రకమైన హింట్ లాంటివి. వాటి ఆధారంగా వారు ఏమైనా చేస్తారు. పొలిటికల్ గా స్టెప్పులు వేస్తారు. మీ రాతలు ఇంతమందికి ఉపయోగ కలిగిస్తుంటే.. మీరెందుకు సైలెంట్ గా ఉన్నారు.. ఏమైంది ఆర్కే సార్.. నిప్పు కణిక లాంటి మీ అక్షరాలు ఎక్కడ.. విస్పోటనంలాంటి మీ ఉపోద్ఘాతం ఎక్కడ.. దమ్ము అనే పదానికి పర్యాయపదంగా ఉండే మీ శీర్షికలు ఎక్కడ.. మరోసారి మమ్మల్ని డిసప్పాయింట్ చేయకండి ఆర్కే సార్.. చాలా ఇబ్బందిగా ఉంది..

కొత్త పలుకు కు బ్రేక్ ఇవ్వడం ఇదే తొలిసారి కాకపోవచ్చు గాని.. ఇటీవల కాలంలో ఎన్నడు మీరు బ్రేక్ ఇవ్వలేదు. దూకుడుగా రాతలు రాశారు. బీభత్సంగా కొత్త విషయాలను బయటపెట్టారు. ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా అన్ని పార్టీలను వదలకుండా వాయించేశారు. కొన్ని సందర్భాలలో స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు.. స్వీట్ కోటెడ్ రాతలు కూడా రాశారు. ఇవన్నీ చూసి.. చదివి.. నవ్వుకొని.. ఆగ్రహం వ్యక్తం చేసి.. ఇంకా అనేక రకాల హావ భావాలు ప్రదర్శించిన మాకు.. మీరు ఎంటర్టైన్మెంట్ మిస్ చేస్తే ఎలా సార్.. దీన్ని ఎలా జీర్ణించుకోవాలి.. ఎలా అర్థం చేసుకోవాలి.. ‘ఏంటి గ్యాప్ ఇచ్చావ్’? అంటే ‘‘ఇవ్వలా వచ్చింది’’ అనకండి.. ప్లీజ్ ఆర్కే సార్..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper