Komatireddy Rajagopal Reddy vs RK : అసలే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వ్యవహారాలు టీ కప్పులో తుఫాన్ మాదిరిగా సాగుతున్నాయి. నాయకులు ఎవరికి వారి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. చివరికి ముఖ్యమంత్రిని కూడా లెక్కచేయకుండా మంత్రుల పిల్లలు విమర్శలు చేస్తున్నారు. స్థాయికి మించి ఆరోపణలు చేస్తూ.. ముఖ్యమంత్రిని చులకన చేస్తున్నారు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్రమశిక్షణ రాహిత్యాన్ని బయటపెడుతున్నాయి.
ఇటీవల కొండా సురేఖ కుమార్తె సుస్మిత ముఖ్యమంత్రి మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆమె కంటే ముందు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ముఖ్యమంత్రి పై పరోక్షంగా విమర్శలు చేశారు. తనకు మంత్రి పదవి దక్కకపోవడాన్ని ఆయన తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి మీద ఏబీఎన్ ఛానల్ లో వ్యతిరేక కథనాలు ప్రసారమైనట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా.. ఆయన మాట్లాడుతున్న మాటలను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆ కథనాన్ని ప్రసారం చేసినట్టు సమాచారం. ఈ కథనం ప్రసరమైన విషయం రాజగోపాల్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించక తప్పలేదు.
బుధవారం ఆయన వివిధ రకాల బిల్లుల కోసం.. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క దగ్గరికి వెళ్లారు.. ప్రజాభవన్ లో చాలాసేపు ఆయనతో మాట్లాడారు. ఇద్దరి మధ్య సుదీర్ఘ బేటీ జరిగింది. ఆ తర్వాత బయటికి వచ్చిన రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న వ్యవహారాలను ప్రస్తావించకుండా.. ఏబీఎన్ ఛానల్ గురించి.. ఆంధ్రజ్యోతి పత్రిక గురించి.. ఆ సంస్థల యజమాని రాధాకృష్ణ గురించి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు..”వేమూరి రాధాకృష్ణ కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. మర్యాదగా ఉండాలి. ఏబీఎన్ లాంటి 100 ఛానళ్లు పెట్టే శక్తి నాకుంది. ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు వంద నిర్వహించే సత్తా నాకుంది. ఏబీఎన్ రాధాకృష్ణ మా గురించి రాసేటప్పుడు చూసుకొని రాయి. బాగుండదు.. హెచ్చరిస్తున్న.. మీడియా ముసుగులో అసలైన తెలంగాణ నాయకులను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్న ఆంధ్ర మీడియా ఛానళ్లకు నేను గట్టి వార్నింగ్ ఇస్తున్న. ఇప్పుడు ఏబీఎన్ ఛానల్ ఎవరికి వత్తాసు పలుకుతోంది.. మా గురించి రాస్తున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయి రాధాకృష్ణ.. మీడియా అంటే గౌరవం ఉంది. పాత్రికేయులు అంటే కూడా నాకు గౌరవం ఉందని” రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడినప్పుడు ఏబీఎన్ ఛానల్.. ముఖ్యమంత్రికి అనుకూలంగా స్టాండ్ తీసుకుంటుందని వార్తలు వస్తున్నాయి. మిగతా ఎమ్మెల్యే కోణంలో కాకుండా.. కేవలం ముఖ్యమంత్రి కి అనుకూలమైన ధోరణిలోనే ఆంధ్రజ్యోతి పత్రిక.. ఏబీఎన్ ఛానల్ వ్యవహరిస్తోందని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి విషయంలో రాధాకృష్ణ ఇటీవల రాసిన కొత్త పలుకులో.. తన ఏబీఎన్ ఛానల్ లో వ్యతిరేకమైన కథనాలు ప్రసారం చేసినట్టు తెలుస్తోంది. అందువల్లే రాజగోపాల్ రెడ్డి నేరుగా వేమూరి రాధాకృష్ణకు వార్నింగ్ ఇచ్చారు. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. ఇటీవల ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన జగదీష్ రెడ్డి కూడా వేమూరి రాధాకృష్ణ మీద తీవ్రస్థాయిలో విమర్శ చేశారు. మరగుజ్జు నాయకుడని వేమూరి రాధాకృష్ణ ఆరోపిస్తే.. కిరసనాయిల్ అమ్మి మీడియా సంస్థలు ఎలా ఏర్పాటు చేశారని జగదీశ్ రెడ్డి విమర్శించారు. వీరిద్దరి మధ్య వివాదం మర్చిపోకముందే.. మళ్లీ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి వేమూరి రాధాకృష్ణను విమర్శించారు గట్టిగా హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరి దీనిపై రాధాకృష్ణ ఏ విధంగా స్పందిస్తారు.. తన పత్రికలో.. చానల్లో ఎలాంటి వార్తలను ప్రసారం చేస్తారో చూడాల్సి ఉంది. అన్నట్టు రాజగోపాల్ రెడ్డి వేమూరి రాధాకృష్ణ వత్తాసు పలుకుతున్నది.. రేవంత్ రెడ్డి కేనా.. అందుకేనా పరోక్షంగా విమర్శించింది.. ఏమో ఇటీవల రాజగోపాల్ రెడ్డి నేరుగా కాకుండా పరోక్షంగానే విమర్శలు చేస్తున్నారు. అవి కాస్త తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారుతున్నాయి.
బ్రేకింగ్ న్యూస్
ABN రాధాకృష్ణకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వార్నింగ్
కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదగా ఉంటే మంచిది
ABN లాంటి 100 ఛానళ్లు పెట్టే శక్తి మాకు ఉంది
ABN రాధాకృష్ణ మా గురించి రాసే ముందు చూసుకొని రాయి, బాగుండదు హెచ్చరిస్తున్నా
మీడియా ముసుగులో అసలైన తెలంగాణ… pic.twitter.com/5l6TH7zdMQ
— Telugu Feed (@Telugufeedsite) August 26, 2026