Homeజాతీయ వార్తలుIndia independence day : ఎర్రకోట నుంచి ఏకకాలంలో చైనా, పాకిస్తాన్, అమెరికా కు ఇచ్చి...

India independence day : ఎర్రకోట నుంచి ఏకకాలంలో చైనా, పాకిస్తాన్, అమెరికా కు ఇచ్చి పడేసిన మోడీ.. ఈ స్పీచ్ వేరే లెవెల్ అంతే..

India independence day : ఢిల్లీలోని ఎర్రకోట.. 150 సంవత్సరాల వందేమాతర గీతం.. వేలాదిమంది యువకులు.. విశిష్ట అతిథులు.. సర్వసత్తాక సైన్యం.. ఇందరి మధ్యలో నరేంద్ర మోడీ.. దగదగ మెరిసిపోతున్న ఎర్రకోట మీద.. మువ్వన్నెల జెండాను ఎగరవేశారు. జాతీయ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. జాతీయ జెండాను ఎగరవేసిన అనంతరం.. అంతకంటే ముందు వందేమాతరం గీతాన్ని ఆలపించడం.. ఈ క్రతువులు ముగిసిన తర్వాత నరేంద్ర మోడీ తన అసలు సిసలైన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ఒక ముక్కలో చెప్పాలంటే […]

India independence day : ఢిల్లీలోని ఎర్రకోట.. 150 సంవత్సరాల వందేమాతర గీతం.. వేలాదిమంది యువకులు.. విశిష్ట అతిథులు.. సర్వసత్తాక సైన్యం.. ఇందరి మధ్యలో నరేంద్ర మోడీ.. దగదగ మెరిసిపోతున్న ఎర్రకోట మీద.. మువ్వన్నెల జెండాను ఎగరవేశారు. జాతీయ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు.

జాతీయ జెండాను ఎగరవేసిన అనంతరం.. అంతకంటే ముందు వందేమాతరం గీతాన్ని ఆలపించడం.. ఈ క్రతువులు ముగిసిన తర్వాత నరేంద్ర మోడీ తన అసలు సిసలైన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ఒక ముక్కలో చెప్పాలంటే ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ ఇంత ఉద్వేగంగా ఎన్నడు మాట్లాడలేదు. దాదాపు ఆయన ప్రసంగం గంట పాటు సాగింది.. స్వాతంత్ర్య సమరయోధులను కొనియాడుతూ.. దేశం సాగించిన అభివృద్ధిని చెబుతూ.. సాధించాల్సిన లక్ష్యాల గురించి వివరిస్తూ.. ఎదురవుతున్న ఇబ్బందుల గురించి ఏ కరువు పెడుతూ.. దూసుకు వస్తున్న వ్యతిరేక శక్తుల గురించి హెచ్చరికలు చేస్తూ.. సాగిపోయింది నరేంద్ర మోడీ ప్రసంగం. అప్పట్లో అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం రోజున నరేంద్ర మోడీ ఏ విధంగానైతే మాట్లాడారో.. స్వాతంత్ర వేడుకల సందర్భంగా అదే స్థాయిలో తన ప్రసంగాన్ని చేశారు ప్రధాని.

ఇటీవల కాలంలో భారతదేశానికి పక్కలో బల్లెం లాగా చైనా.. అమెరికా తయారయ్యాయి. భారత్ తన తయారీ రంగాన్ని విస్తృతం చేస్తున్న నేపథ్యంలో ఆ రెండు దేశాలు ఇబ్బంది పెడుతున్నాయి. దేశంలో అంతర్గత కలహాలను సృష్టించడానికి కుట్రలు చేస్తున్నాయి. ఇటీవల కాలంలో జరిగిన నీట్ ఉద్యమం దీనికి ఒక బలమైన ఉదాహరణ. దీని లోతుల్లోకి వెళ్లిన కేంద్ర దర్యాప్తు బృందాలు.. ప్రభుత్వానికి స్పష్టమైన సూచనలు చేశాయి. అప్పటినుంచి నరేంద్ర మోడీ తన సోషల్ మీడియా ఖాతాలో వీడియోలు చేయడం మొదలుపెట్టారు. జనరేషన్ జెడ్ ను ఆకట్టుకోవడం ప్రారంభించారు. అక్కడితోనే ఆగిపోలేదు.. స్వాతంత్ర్య వేడుకలలో జనరేషన్ జెడ్ కి సింహభాగం కేటాయించారు నరేంద్ర మోడీ.

ఎర్రకోట మీద నుంచి ఏకకాలంలో నరేంద్ర మోడీ చైనాకు.. పాకిస్తాన్ కు.. అమెరికాకు గట్టిగా హెచ్చరికలు పంపించారు.. 20047 నాటికి వికసిత్ భారత సాధ్యమవుతుందని ప్రకటించారు. భవిష్యత్తు కాలంలో పూర్తిస్థాయిలో సెమీ కండక్టర్ల ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని ఎదిగే విధంగా చేస్తామని అన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారుల మార్కెట్గా భారత్ ఉందని.. అది మన దేశానికి అత్యంత గర్వకారణం అని నరేంద్ర మోడీ ప్రకటించారు. అందువల్లే ప్రపంచం మొత్తం ఇండియా వైపు చూస్తోందని అన్నారు. తయారీ రంగాన్ని బలోపేతం చేసిన నేపథ్యంలో భారతదేశం ఇకపై ఏ దేశాల మీద ఆధారపడకూడదని.. ఆధారపడే అవకాశం లేదని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు.

ఎందరో వీరుల త్యాగాల ఫలితమే స్వాతంత్ర్యమని.. ప్రతి హృదయం జాతీయ గేయం ఆలపించడంతో మారుమోగుతోందని.. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురుతోందని.. దేశం సరికొత్త సంకల్పంతో ముందుకు వెళుతుందని.. మన సంకల్పం.. మన కలలు సాకారం అవుతున్నాయని పేర్కొన్నారు. వికసిత్ భారత లక్ష్యాన్ని చేరుకోవడానికి కార్యాచరణ సిద్ధం చేశామని.. భారతదేశం దాన్ని కచ్చితంగా అందుకుంటుందని నరేంద్ర మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. కొన్ని శక్తులు భారతదేశన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నాయని.. అయినప్పటికీ వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని ముందుకు సాగుతామని నరేంద్ర మోడీ ప్రకటించారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper