Botsa Satyanarayana: విజయనగరం జిల్లాలో మాజీమంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబానికి తిరుగులేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి విపరీతంగా సపోర్ట్ చేయడంతో బొత్స తన పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ విపరీతంగా విస్తరించుకున్నారు. ఆ తర్వాత జగన్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా కూడా పని చేశారు. కూటమి 2024 ఎన్నికల్లో దూకుడు కొనసాగించడంతో బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లాలో కాస్త వెనుకడుగు వేయాల్సి వచ్చింది. రాజకీయంగా తిరుగులేని స్థాయిని అనుభవించిన నేపథ్యంలో.. స్థాయిని తగ్గించుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. పైగా మేనల్లుడు మజ్జి శ్రీను స్థానిక ఎన్నికలకు ముందు టిడిపి కండువా కప్పుకున్నారు. ఆ సమయంలో సత్యనారాయణ కన్నీరు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లాలో పట్టు నిలుపుకోవడానికి ప్రయత్నాలు చేశారు.. జెడ్పి చైర్మన్ పదవి సొంతం చేసుకోవడానికి బొండపల్లి బొత్స అనూషను పోటీలో దించారు.
ఆమె ఎన్నికల ప్రచారంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు . తండ్రికి తగ్గ కూతురు అనిపించుకున్నారు. అయితే ఓటర్లు మాత్రం ఆమెకు ఘోర పరాజయాన్ని మిగిలించారు. తీవ్ర ఉత్కంఠ మధ్య ఓట్ల లెక్కింపు జరిగింది. టిడిపి అభ్యర్థి పాఠశాల నీరజ 5136 ఓట్ల తేడాతో విజయం సాధించింది . దశాబ్దాలుగా విజయనగరం జిల్లా రాజకీయాలను సత్యనారాయణ కుటుంబం శాసిస్తోంది. దీనికి తోడు సొంత కుమార్తెను పోటీలోకి దించినప్పటికీ ప్రజలు దిమ్మతిరిగే ఫలితం ఇచ్చారు..
సత్యనారాయణ కుటుంబం బొండపల్లి జడ్పీ స్థానాన్ని తమ కంచుకోటగా నిర్మించుకుంది. జడ్పీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా సత్యనారాయణ తీసుకున్నారు. స్వయంగా ఆయన రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని భారీగా మోహరించారు. తన కుమార్తె గెలుపు కోసం తీవ్రస్థాయిలో కష్టపడ్డారు. ఆమెను గెలిపించి జెడ్పి పీట మీద కూర్చోబెట్టాలని రకరకాల ప్రయత్నాలు చేశారు. కానీ ఓటర్లు నీరజ వైపు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికీ వైసీపీ మీద ప్రజల్లో ఆగ్రహం తగ్గలేదని తాజా ఫలితాల ద్వారా తెలుస్తోంది. ఈ సమరంలో సత్యనారాయణ కుటుంబానికి దారుణమైన ఓటమి ఎదురైంది. దీనికి తోడు ఆయన మేడల్లుడు శ్రీనివాసరావు కుమార్తె సిరి సహస్ర అద్భుతమైన విజయాన్ని సాధించారు. సత్యనారాయణ కుటుంబంతో విభేదాలు రావడంతో ఆయన నీడ నుంచి శ్రీను బయటికి వచ్చారు. వైసిపికి నమస్కారం పెట్టి.. టిడిపిలోకి వచ్చేసారు. ఆ తర్వాత ఆయన కూటమి తరఫున తన కుమార్తెను పోటీలో దింపారు. ఓటర్లు బలమైన సపోర్ట్ ఇవ్వడంతో ఆమె అద్భుతమైన విజయాన్ని దక్కించుకున్నారు. తండ్రి సపోర్ట్ చేయడంతో క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమయ్యారు. సిరి సహస్ర విజయం నేపథ్యంలో విజయనగరం జిల్లాలో ప్రజాబలం ఎవరికి ఉందో సత్యనారాయణకు శ్రీను అర్థమయ్యేలా వివరించారు.
ఇక ఈ ఫలితాలు విజయనగరం జిల్లా రాజకీయాలలో సత్యనారాయణ శకానికి ముగింపు పలుకుతున్నట్టు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో చీపురుపల్లిలో స్వయంగా సత్యనారాయణ.. మిగతా అన్ని స్థానంలో వైసిపి అభ్యర్థులు ఓడిపోయారు. కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చూపించారని వైసీపీ నేతలు అనుకున్నారు. చివరికి తమ కుటుంబానికి కంచుకోట లాంటి మండలంలో కుమార్తెను ఓ సాధారణ జడ్పిటిసిగా గెలిపించుకునే స్థాయికి సత్యనారాయణ దిగజారి పోయారు. దీనిని బట్టి ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఆయన పట్టు ఏ స్థాయిలో తగ్గిపోయిందో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు ఆయన కిందిస్థాయి నాయకత్వాన్ని పట్టించుకోలేదు. కేవలం కుటుంబానికి.. కుటుంబ సభ్యులకి పదవులు ఇప్పించుకున్నారు. ఆయన స్వార్థ రాజకీయాల వల్లే జిల్లాలో పార్టీ ఇలా తుడిచిపెట్టుకుపోయిందని స్వయంగా వైసిపి కార్యకర్తలు ఆరోపిస్తుండడం విశేషం..