Viswanath And Sons: తమిళ హీరో సూర్య నటించిన ‘విశ్వనాధ్ & సన్స్’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో అందరికీ తెలిసిందే. ‘కరుప్పు’ వంటి మాస్ హిట్ తర్వాత , సూర్య ఒక కూల్ అర్బన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రావడమే పెద్ద సాహసం , అలాంటిది అన్ని వర్గాల ఆడియన్స్ ని ఈ చిత్రం తో మెప్పించడం అనేది సాధారమైన విషయం కాదు. మూడు రోజుల్లోనే 100 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా , ఫుల్ రన్ లో ఎంత వరకు చేరుతుందో చూడాలి. ఇకపోతే ఈ సినిమాలో సూర్య కి కొడుకుగా నటించిన క్యూట్ లిటిల్ చాంప్ ఎవరు అనేది మీ అందరికీ అనిపించి ఉండొచ్చు. కచ్చితంగా సినీ ఇండస్ట్రీ కి చెందిన తల్లిదండ్రుల బిడ్డనే అని మీరంతా అనుకోవచ్చు.
కానీ ఆ బిడ్డకు సినీ ఇండస్ట్రీ తో ఎలాంటి సంబంధం లేదట. ఈ బుడ్డోడి పేరు అభయ్. కానీ నిజ జీవితం లో ఇతని పేరు చార్విక్. ఈ సినిమా ఆడిషన్స్ లో 6 నెలల నుండి ఏడాది వయసున్న పిల్లలు కావాలని మేకర్స్ పిలుపు ఇవ్వడంతో తమ కుమారుడిని తీసుకెళ్లామని ఆ బుడ్డోడి తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు. వాళ్ళు మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ బుడ్డోడి తండ్రి కూడా ఒక చిన్న ఆర్టిస్ట్ అట. ‘లక్కీ భాస్కర్’ మూవీ లో ఒక చిన్న క్యారెక్టర్ కూడా చేసాడట. ఆ సినిమాల్ని అసిస్టెంట్ డైరెక్టర్స్ తో పాటు , క్యాస్టింగ్ డైరెక్టర్ కూడా నాకు బాగా పరిచయం అవ్వడం తో, వాళ్ళని సంప్రదించి మా అబ్బాయిని ఇచ్చాము అంటూ చెప్పుకొచ్చాడు. అయితే చార్విక్ తండ్రి ని చూస్తుంటే హీరో లాగా ఉన్నాడు, సినిమాల్లో ఇతన్ని త్వరలో హీరో గా కూడా చూడొచ్చేమో అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు.
దోగాడే వయస్సు లోనే చార్విక్ తన తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చాడని సోషల్ మీడియా లో అంటున్నారు నెటిజెన్స్. అయితే ఆడిషన్స్ సమయం లో చోటు చేసుకున్న ఒక అరుదైన సంఘటన గురించి చార్విక్ తండ్రి చెప్పుకొచ్చాడు . అక్కడికి వచ్చిన పిల్లలందరూ ఏడుస్తుంటే , చార్విక్ మాత్రం నవ్వుతూనే ఉన్నాడని , అది చూసి వెంటనే సెలెక్ట్ చేసారని చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా డైరెక్టర్ వెంకీ అట్లూరి , హీరో సూర్య తమ్ సొంత కొడుకులాగా చార్విక్ ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు అంటూ చార్విక్ తండ్రి చెప్పుకొచ్చాడు.