Suriya Latest News : తమిళ హీరో సూర్య నటించిన ‘విశ్వనాధ్ & సన్స్’ మూవీ రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై , మొదటి ఆట నుండే మంచి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కేవలం రెండు రోజుల్లోనే 80 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ ఈవెంట్ ని నిన్న హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. హీరో సూర్య తో పాటు మూవీ టీం మొత్తం ఈ ఈవెంట్ లో పాల్గొనగా, ప్రముఖ డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథి గా విచ్చేసారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడిన మాటలు , ఆ తర్వాత సూర్య మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఇదంతా పక్కన పెడితే , ఈవెంట్ జరిగే ముందు కొన్ని క్యూట్ సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీనికి సోషల్ మీడియా లో నెటిజెన్స్ మీడియా ని ఎలా మోసం చెయ్యాలి అనేది , సూర్య కి తెలిసినంతగా బహుశా ఎవరికీ తెలీదేమో అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. ఒక హోటల్ లో ఈ ఈవెంట్ జరిగింది. మీడియా మొత్తం సూర్య లిఫ్ట్ లో వస్తాడని , అందరూ ఆయనతో సంభాషించడానికి లిఫ్ట్ వద్ద ఎదురు చూస్తున్నారు. ఇటు వస్తే మీడియా కి దొరికేస్తామనే ఉద్దేశ్యం తో మెట్లు దిగి వేరే మార్గం లో వచ్చేశారు. సూర్య ఆ మార్గం లో వస్తారని మీడియా ఎవ్వరికీ తెలియదు. అనంతరం మీడియా మొత్తం షాక్ అయ్యింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. కావాలనే అలా చేశా అంటూ సూర్య మీడియా కి సైగలు చేయడం కూడా హైలైట్ గా నిల్చింది.
ఇక ఈ ఈవెంట్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ‘ఇండియా లో కేవలం ఇద్దరికీ మాత్రమే వయస్సు వెనక్కి వెళ్తూ ఉంటుంది. ఒకరు మహేష్ బాబు అయితే, మరొకరు సూర్య. సూర్య గారితో సినిమా చెయ్యమని నా వైఫ్ రిక్వెస్ట్ కాదు , డిమాండ్ చేస్తూ ఉంటుంది, కానీ దురదృష్టం కొద్దీ ఆయనకు నచ్చే కథలను నేను చెప్పలేకపోయాను , కానీ భవిష్యత్తులో కచ్చితంగా మా ఇద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా ఉంటుంది. ఈ సినిమాకు కనీసం ఒక నిర్మాతగా వ్యవహరించినందుకు సంతోషం గా ఉంది. కానీ పూర్తి స్థాయి సంతోషం , సూర్య సినిమాలో డైరెక్టర్ గా నా పేరు పడినప్పుడే’ అంటూ చెప్పుకొచ్చాడు త్రివిక్రమ్ శ్రీనివాస్.
View this post on Instagram