Homeఎంటర్టైన్మెంట్Varanasi IMAX : 26 స్క్రీన్స్ కోసం 1400 కోట్ల ఖర్చు.. రాజమౌళి విజన్ కి...

Varanasi IMAX : 26 స్క్రీన్స్ కోసం 1400 కోట్ల ఖర్చు.. రాజమౌళి విజన్ కి దండం పెట్టాల్సిందే..

Varanasi IMAX : అందరూ ఆలోచించే విధంగా రాజమౌళి ఆలోచించడు , ఆయన ఆలోచన విధానం తన తోటి డైరెక్టర్స్ తో పోలిస్తే వంద అడుగులు ముందు ఉంటుంది. ఇప్పటి వరకు ఆయన చేసిన ప్రతీ సినిమా మన తెలుగు సినిమా స్థాయిని మరో లెవెల్ కి తీసుకెళ్లే విధంగానే ఉండేది. #RRR తో గ్లోబల్ మార్కెట్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చేసాడు. ఇప్పుడు ‘వారణాసి’ తో ఏకంగా హాలీవుడ్ రికార్డ్స్ పైన కన్నేశాడు రాజమౌళి. ఈమధ్య […]

Varanasi IMAX : అందరూ ఆలోచించే విధంగా రాజమౌళి ఆలోచించడు , ఆయన ఆలోచన విధానం తన తోటి డైరెక్టర్స్ తో పోలిస్తే వంద అడుగులు ముందు ఉంటుంది. ఇప్పటి వరకు ఆయన చేసిన ప్రతీ సినిమా మన తెలుగు సినిమా స్థాయిని మరో లెవెల్ కి తీసుకెళ్లే విధంగానే ఉండేది. #RRR తో గ్లోబల్ మార్కెట్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చేసాడు. ఇప్పుడు ‘వారణాసి’ తో ఏకంగా హాలీవుడ్ రికార్డ్స్ పైన కన్నేశాడు రాజమౌళి. ఈమధ్య కాలం లో ప్రతీ డైరెక్టర్ ‘ఐమాక్స్ కోసం ఈ చిత్రాన్ని తెరకెక్కించాము’ అని ప్రచారం చేసుకోవడం సర్వసాధారణం అయిపోయింది. కానీ అది కేవలం పబ్లిసిటీ కోసమే అని ఆ సినిమాలను థియేటర్స్ లో చూసే ఆడియన్స్ కి స్పష్టంగా అర్థమైంది. కానీ రాజమౌళి ‘వారణాసి’ చిత్రాన్ని ఐమాక్స్ కోసమే చిత్రీకరిస్తున్నాడు. ఈ విషయం లో ఆయన ప్రేక్షకులను ఏ మాత్రం మోసం చేయడం లేదు.

ఆయన ఈ సినిమా మొత్తాన్ని ఐమాక్స్ కెమేరాతోనే చిత్రీకరిస్తున్నాడు. ప్రపంచం మొత్తం మీద ఐమాక్స్ కెమెరాలు కేవలం 8 మాత్రమే ఉన్నాయి. రీసెంట్ గానే ‘ది ఒడిస్సీ’ చిత్రాన్ని మీరంతా చూసే ఉంటారు , ఈ సినిమాని ఐమాక్స్ కెమెరా తోనే చిత్రీకరించారు. ఈ సినిమా ఐమాక్స్ అనుభూతి కోసం ప్రేక్షకులు ఏ రేంజ్ లో ఎగబడ్డారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మన ఇండియా లో కూడా ఐమాక్స్ స్క్రీన్స్ నుండే ఈ చిత్రానికి అత్యధిక గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు ‘వారణాసి’ ని కూడా అదే తరహాలో తెరకెక్కిస్తున్నారు. అయితే ఇండియా మొత్తం మీద కేవలం 26 ఐమాక్స్ స్క్రీన్స్ మాత్రమే ఉన్నాయి. ఇంత తక్కువ స్క్రీన్స్ కోసం రాజమౌళి 1400 కోట్లు ఖర్చు చేసి ‘వారణాసి’ ని తియ్యడం ఎందుకు అని మీరు అనుకోవచ్చు.

కానీ రాజమౌళి టార్గెట్ ఇండియన్ మార్కెట్ కాదు , ఓవర్సీస్ మార్కెట్. ఈ చిత్రాన్ని ఇండియన్ భాషల్లోనే కాకుండా , ఇంగ్లీష్ , చైనీస్ , జపనీస్ మరియు ఇతర ఫారిన్ భాషల్లో కూడా విడుదల చేయబోతున్నారు. ఈ దేశాల్లో ఐమాక్స్ స్క్రీన్స్ వందల్లో , వేళల్లో ఉంటాయి, ఆ స్క్రీన్స్ ని టార్గెట్ చేసుకొని ‘వారణాసి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట. అంటే రాజమౌళి టార్గెట్ ఈ సినిమాతో వెయ్యి కోట్లు కొట్టడమో , లేదా 2 వేల కోట్లు కొట్టడమో కాదు , ఏకంగా 1 బిలియన్ డాలర్లు, అనగా 10 వేల కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టడమే లక్ష్యం అన్నమాట. మరి ఈ లక్ష్యాన్ని ఆయన అందుకుంటాడా లేదా అనేది చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper