Tom Holland: రీసెంట్ గానే భారీగా అంచనాల నడుమ విడుదలైన ‘స్పైడర్ మ్యాన్ : బ్రాండ్ న్యూ డే’ చిత్రం గ్లోబల్ వైడ్ గా సృష్టిస్తున్న వసూళ్ల సునామీ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తెలుగు రాష్ట్రాల నుండే ఈ చిత్రం ఇప్పటి వరకు దాదాపుగా 50 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి 100 కోట్ల గ్రాస్ వైపు దూసుకువెళ్తోంది. మొదటి వారం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 420 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు , 321 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 1.5 బిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయట. అంటే ఇండియన్ కరెన్సీ ప్రేరకారం 15000 కోట్ల గ్రాస్ వసూళ్లు అన్నమాట. ఒక్క నార్త్ అమెరికా నుండే ఈ చిత్రానికి 511 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి , 1 బిలియన్ మార్కు వైపు అడుగులు తీస్తుందంటే, ఏ రేంజ్ సెన్సేషన్ అనేది అర్థం చేసుకోవచ్చు.
ఫుల్ రన్ లో 2 బిలియన్ డాలర్స్ అన్ని బాషల నుండి వసూలు చేస్తుందని అనుకుంటే , ఈ వీకెండ్ తోనే ఆ మార్కుని అందుకొని , 3 బిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్ల వైపు పరుగులు తీసేలా కనిపిస్తోంది ఈ చిత్రం. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడం తో ఇందులో హీరో గా నటించిన టామ్ హాలండ్ కి మంచి క్రేజ్ ఏర్పడింది. ఈయనపై సోషల్ మీడియా లో మన తెలుగు యువత గత వారం రోజుల నుండి చేస్తున్న ఫన్నీ మీమ్స్ , మన టాలీవుడ్ హీరోలకు కూడా చెయ్యలేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ‘డ్యూడ్’ చిత్రం లోని కొన్నివేశాలకు టామ్ ఫొటోలతో మార్ఫ్ చేసి ఎలాంటి ఎడిటెడ్ వీడియోస్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి మన కళ్లారా చూస్తూనే ఉన్నాం.
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఎడిట్స్ లో కూడా టామ్ హాలండ్ ని చేర్చారు. ఇక ‘స్పైడర్ మ్యాన్ ‘ మూవీ లో ఐటెం సాంగ్ లేదని ఒక ప్రేక్షకుడు మీడియా ముందుకు వచ్చి చెప్పిన వీడియో ఎంత వైరల్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అందుకు మన తెలుగు యువత AI తో ‘పెద్ది’ లోని ఐటెం సాంగ్ లోకి కూడా టామ్ హాలండ్ ని చేర్చారు. ఇక మన టాలీవుడ్ యువత కి బాగా దగ్గరైన టామ్ హాలండ్ పెళ్లికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఈయన ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించిన ‘జెండియా’ ని పెళ్ళాడి రెండేళ్లు అయ్యిందట. రహస్యం గా కుటుంబ సభ్యుల ఆద్వర్యం లో తమ వివాహం జరిగిందని , ఇంతకు మించి వివరాలు చెప్పలేను అంటూ టామ్ హాలండ్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పొచ్చాడు. ఇది తెలుసుకున్న నెటిజెన్స్ ఇప్పుడు షాక్ కి గురయ్యారు.