Homeఎంటర్టైన్మెంట్Spider Man Brand New Day: 4 రోజుల్లో 7694 కోట్ల గ్రాస్.. బాక్స్ ఆఫీస్...

Spider Man Brand New Day: 4 రోజుల్లో 7694 కోట్ల గ్రాస్.. బాక్స్ ఆఫీస్ వద్ద ‘స్పైడర్ మ్యాన్ ‘ సునామీ.. తెలుగు రాష్ట్రాల గ్రాస్ ఎంతంటే..

Spider Man Brand New Day: ప్రపంచవ్యాప్తంగా ‘స్పైడర్ మ్యాన్ : బ్రాండ్ న్యూడే’ చిత్రానికి వస్తున్నా గ్రాస్ వసూళ్లను చూసి ట్రేడ్ విశ్లేషకులు కూడా విస్మయానికి గురి అవుతున్నారు. కేవలం విదేశాల్లో మాత్రమే కాదు , ఈ సినిమా మన ఇండియా లో కూడా సంచలన సృష్టిస్తోంది. మొదటి రోజు 61 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు రాగా, రెండవ రోజు 38 కోట్ల 30 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా […]

Spider Man Brand New Day: ప్రపంచవ్యాప్తంగా ‘స్పైడర్ మ్యాన్ : బ్రాండ్ న్యూడే’ చిత్రానికి వస్తున్నా గ్రాస్ వసూళ్లను చూసి ట్రేడ్ విశ్లేషకులు కూడా విస్మయానికి గురి అవుతున్నారు. కేవలం విదేశాల్లో మాత్రమే కాదు , ఈ సినిమా మన ఇండియా లో కూడా సంచలన సృష్టిస్తోంది. మొదటి రోజు 61 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు రాగా, రెండవ రోజు 38 కోట్ల 30 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా మూడవ రోజున 70 కోట్ల 80 లక్షలు , నాల్గవ రోజున 77 కోట్ల 50 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఓవరాల్ గా అన్ని భాషలకు కలిపి ఈ చిత్రానికి మొదటి వీకెండ్ లో 257 కోట్ల 60 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు 309 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట.

రాష్ట్రాల వారీగా ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే , తెలంగాణ రాష్ట్రం నుండి 23 కోట్ల 32 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము నుండి 12 కోట్ల 12 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి 35 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు ఈ చిత్రానికి వచ్చాయట. అదే విధంగా కర్ణాటక నుండి 37 కోట్ల 76 లక్షలు ఎం తమిళనాడు నుండి 27 కోట్లు , కేరళ నుండి 21 కోట్ల 80 లక్షలు వచ్చాయట. ఇక నార్త్ ఇండియా స్టేట్స్ గ్రాస్ విషయానికి వస్తే , ఢిల్లీ నుండి 45 కోట్ల 50 లక్షలు రాగా, ఉత్తర్ ప్రదేశ్ నుండి 17 కోట్లు , పంజాబ్ నుండి 8 కోట్ల 73 లక్షలు , హర్యానా నుండి 3 కోట్ల 24 లక్షలు , ఉత్తర్ ఖండ్ నుండి 3 కోట్ల 45 లక్షలు , మహారాష్ట్ర నుండి 64 కోట్ల 25 లక్షలు వచ్చాయట.

అదే విధంగా గుజరాత్ నుండి 21 కోట్లు , రాజస్థాన్ నుండి 10 కోట్ల 47 లక్షలు, గోవా నుండి 2 కోట్ల 11 లక్షలు వచ్చాయి. ఇక మధ్య ప్రదేశ్ నుండి 8 కోట్ల 81 లక్షలు రాగా, ఛత్తీస్ ఘర్ నుండి 5 కోట్లు , వెస్ట్ బెంగాల్ నుండి 15 కోట్లు , అస్సాం నుండి 4 కోట్ల 61 లక్షలు , ఒడిస్సా నుండి 5 కోట్ల 77 లక్షలు , బీహార్ + జార్ఖండ్ నుండి 7 కోట్ల 92 లక్షలు వచ్చాయి.ఇక ఇతర రాష్ట్రాల నుండి 3 కోట్ల గ్రాస్ రాగా ఓవరాల్ గా 3D గ్లాస్ టికెట్స్ తో కలిపి ఈ చిత్రానికి 347 కోట్ల గ్రాస్ , 288 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయి. ఇక నార్త్ అమెరికా లో ఈ చిత్రానికి 359 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు రాగా, వరల్డ్ వైడ్ గా 927 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అంటే మొదటి వీకెండ్ లో ఈ చిత్రం 7694 కోట్ల రూపాయిల గ్రాస్ రాబట్టింది అన్నమాట. ఇక ఫుల్ రన్ లో ఏ రేంజ్ వసూళ్లను రాబడుతుందో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper