Spider Man Brand New Day Box Office Collection: ప్రపంచవ్యాప్తంగా ‘స్పైడర్ మ్యాన్’ సిరీస్ కి ఉన్నటువంటి క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మార్వెల్ బుక్ నుండి ఇప్పటి వరకు వెండితెర పైకి వచ్చిన అన్ని సూపర్ హీరోల సినిమాలకంటే , స్పైడర్ మ్యాన్ సిరీస్ కే ఎక్కువ క్రేజ్ ఉంటుంది. ఈ సిరీస్ నుండి లేటెస్ట్ గా తెరకెక్కిన చిత్రం ‘స్పైడర్ మ్యాన్ : బ్రాండ్ న్యూ డే’. నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 270 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అంటే ఇండియన్ కరెన్సీ లెక్కల ప్రకారం 2500 కోట్ల రూపాయలకు పైమాటే. డొమెస్టిక్ మార్కెట్ అనగా నార్త్ అమెరికా నుండే ఈ చిత్రానికి ప్రివ్యూ షోస్ ద్వారా 70 నుండి 75 మిలియన్ డాలర్ల గ్రాస్ నమోదు అయ్యినట్టు తెలుస్తోంది.
వీకెండ్ కి కచ్చితంగా ఈ చిత్రం నార్త్ అమెరికా నుండే 325 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద కూడా ఈ సినిమా సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే , ఈ చిత్రానికి మొదటి రోజున 79 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 67 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. కేవలం మన తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన గ్రాస్ ని ఒకసారి పరిశీలిస్తే ఆంధ్ర ప్రదేశ్ నుండి 3 కోట్ల 70 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, తెలంగాణ ప్రాంతం నుండి 5 కోట్ల 90 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 9 కోట్ల 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
డబుల్ డిజిట్ ఓపెనింగ్ వస్తుందని అంతా అనుకున్నారు కానీ , KDM సమస్యల కారణంగా అనేక ప్రాంతాల్లో షోస్ రద్దు అయ్యాయి. లేదంటే ఇంకా ఎక్కువ ఓపెనింగ్ వచ్చేదని అంటున్నారు. ఇక ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన గ్రాస్ ని ఒకసారి లెక్కేస్తే మహారాష్ట్ర నుండి 13 కోట్ల 20 లక్షలు , ఢిల్లీ నుండి 9 కోట్ల 50 లక్షలు, కర్ణాటక నుండి 8 కోట్ల 25 లక్షలు , తమిళనాడు నుండి 6 కోట్ల 30 లక్షలు , కేరళ నుండి 5 కోట్ల 30 లక్షలు , గుజరాత్ 4 కోట్ల 75 లక్షలు , ఉత్తర్ ప్రదేశ్ నుండి 4 కోట్ల 30 లక్షలు , వెస్ట్ బెంగాల్ నుండి 3 కోట్ల 40 లక్షలు , రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 14 కోట్ల 65 లక్షలు వచ్చాయి.