ఒక సినిమాకు వెళ్ళినప్పుడు ఆడియన్స్ సంపూర్ణమైన థియేట్రికల్ అనుభూతిని పొందేందుకే ఇష్టం చూపిస్తారు. అలా కాకుండా స్టోరీ మొత్తం తెల్సుకొని , అందులో సన్నివేశాలను తెలుసుకొని చూడాలని ఏ ప్రేక్షకుడు కూడా కోరుకోడు . అలా చూస్తే థియేటర్ కి రావడం ఎందుకు?, ఇంట్లోనే కూర్చొని ఓటీటీ లో చూసుకోవచ్చు కదా అనేది సగటు ప్రేక్షకుడి అభిప్రాయం. అయితే రీసెంట్ గా ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ‘స్పైడర్ మ్యాన్ : బ్రాండ్ న్యూ డే’ థియేటర్ లో ఒక ప్రేక్షకుడు తన స్నేహితుడితో సినిమాలో వచ్చే సన్నివేశాలను మొత్తం వివరిస్తూ చెప్తున్నాడు. స్టోరీ మొత్తం ముందే చెప్తుండడం తో థ్రిల్ మిస్ అయిన ప్రేక్షకుడు , స్టోరీ ని వివరిస్తున్న మరో ప్రేక్షకుడిపై విరుచుకుపడ్డాడు. అంతటి ఆగకుండా అతన్ని చితకబాదాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
థియేటర్ లో జరిగిన ఈ భారీ కొట్లాటకు కాసేపు థియేటర్ యాజమాన్యం సినిమాని నిలిపివేయాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితి ఈమధ్య కాలం లో ఈ చిత్రానికే ఎదురైంది. కానీ నెటిజెన్స్ మాత్రం , అలా కొట్టి మంచి పని చేసారంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. సినిమా థియేటర్ కి వచ్చినప్పుడు ఇలాంటివి చేయడం తప్పని , ఆడియన్స్ కి నిజమైన థ్రిల్ ఫీల్ పోతుందని అంటున్నారు. అయితే మాటలతో కూడా రిక్వెస్ట్ చేసి చెప్పొచ్చు , ఇలా కొట్టాల్సిన అవసరం లేదు అనేది మరికొందరి వాదన. ఏది ఏమైనా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో పెద్ద చర్చకే దారి తీసింది. ఇకపోతే రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 927 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు సమాచారం. అంటే దాదాపుగా 8000 వేల డాలర్లు అన్నమాట.
కేవలం వీకెండ్ లోనే ఈ రేంజ్ గ్రాస్ వచ్చిందంటే , ఇక ఫుల్ రన్ లో ఏ రేంజ్ గ్రాస్ వస్తుందో అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద కూడా ఈ చిత్రానికి సెన్సేషనల్ వసూళ్లు నమోదు అవుతున్నాయి. కేవలం వీకెండ్ లోనే 309 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి , ఫుల్ రన్ లో కచ్చితంగా 500 కోట్ల గ్రాస్ వసూళ్లు వస్తాయని అంటున్నారు. ఒక హాలీవుడ్ చిత్రానికి ఈ రేంజ్ గ్రాస్ మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద రావడం అనేది సాధారణమైన విషయం కాదు.
MURDER AT SPIDER MAN: BRAND NEW DAY 2026 ON PREMIERE DAY!
Group of friends went to the cinema excited to watch the newly released Spider-Man: Brand New Day.
A guy sitting next to them had already seen the movie and was watching it again with his female friend. Throughout the… https://t.co/bV1hHC7hJR pic.twitter.com/TBcTSeJ0vI
— Miraqle (@0xMiraqle) August 2, 2026