DC Full Movie Review: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు డిఫరెంట్ సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకుంటున్నారు. అరుణ్ మాదేశ్వరన్ సైతం గతంలో ధనుష్ తో ‘కెప్టెన్ మిల్లర్’ అనే సినిమా చేసి టాలెంటెడ్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఇప్పుడు ప్రముఖ దర్శకుడు అయిన లోకేష్ కనకరాజు ని హీరోగా పెట్టి ఆయన చేసిన ‘డిసి’ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
దేవదాస్ (లోకేష్ కనకరాజు) అనే వ్యక్తి తన గ్యాంగ్ తో కలిసి పోలీసుల వాడే గన్స్ ను దొంగలిస్తారు. లోకల్ లో ఎవరైకైనా అన్యాయం జరిగితే దానికోసం పోరాటం చేస్తుంటారు. ఇక అదే సమయంలో ఒక రైతు తన కొడుకును బాగా చదివించడానికి తన పొలాన్ని అమ్మేసి 7 లక్షల రూపాయలను తన దగ్గర పెట్టుకుంటాడు. ఆ డబ్బులను లోకల్ ఎస్సై తీసుకొని అతన్ని చంపేస్తాడు. దాంతో ఆ రైతు భార్య కి న్యాయం కావాలని దేవదాస్ అండ్ గ్యాంగ్ దగ్గరికి వెళ్తుంది. దేవ దాస్ ఆ ఎస్సై ని చంపేస్తాడు. అక్కడి నుంచి దేవ దాస్ గ్యాంగ్ ను పట్టుకోవడానికి పోలీసులు తిరుగుతుంటారు. ఇక ఈ క్రమంలోనే దేవదాస్ కి పార్వతీ తో ప్రేమలో పడుతాడు.
కానీ ఆ పార్వతిని పోలీసులు చంపేస్తారు. దాంతో దేవదాస్ పోలీసుల మీద రివెంజ్ తీర్చుకోవడానికి ట్రై చేస్తాడు. ఆ ప్రాసెస్ లో చంద్ర అనే ఒక వేశ్య ను సేవ్ చేస్తాడు. అప్పటి నుంచి ఆమె కూడా దేవ దాస్ గ్యాంగ్ లో చేరిపోతుంది. ఫైనల్ గా పోలీసులు దేవ దాస్ అండ్ గ్యాంగ్ ను పట్టుకున్నారా? పార్వతిని చంపినందుకు దేవ దాస్ వాళ్ల మీద రివెంజ్ తీర్చుకున్నాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
నిజానికి ఇది పెద్ద కథ కాకపోయినా కూడా దర్శకుడు స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన విధానం బాగుంది. ఇక లోకేష్ కనకరాజ్ అండ్ గ్యాంగ్ ను చూపించిన విధానం పెర్ఫెక్ట్ గా సెట్ అయింది. వాళ్ళు పెర్ఫెక్ట్ గ్యాంగ్ స్టర్స్ లాగా ఉన్నారు. ఇక మొదటి 20 నిముషాలు చాలా స్లో గా ఉన్నప్పటికీ ఆ తర్వాత సినిమా కథలోకి ఎంటర్ అవుతుంది. దర్శకుడు సినిమా చూసే ప్రేక్షకుడిని కంప్లీట్ గా ఆ కథలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు.
ప్రతి సీన్ లో ఏదో ఒక ఫ్రెష్ నెస్ కనిపిస్తుంది. ఇంటర్వెల్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ చాలా బాగుంది. పెర్ఫెక్ట్ గా డీల్ చేశారు. సెకండాఫ్ లో చంద్రగా చేసిన నటీమణి తన ఇంటెన్స్ పర్ఫామెన్స్ ను చూపించింది. క్లైమాక్స్ సైతం చాలా ఎఫెక్టివ్ గా ఉంది. ఎమోషనల్ సన్నివేశాలు కూడా చాలా పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయ్యాయి… నిజానికి అనిరుధ్ ఇచ్చిన బిజీఎం సైతం సీన్స్ ను ఎలివేట్ చేశాయి… మొత్తానికైతే ఈ సినిమాలో దర్శకుడు ఏదైతే చూపించాలి అనుకున్నాడో దాన్ని పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేశాడు. అందుకే ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడికి విపరీతంగా కనెక్ట్ అవుతుంది…
ఈ సినిమా మొత్తం అక్కడక్కడే తిరుగుతూ ఉండటం వల్ల మనకు ఎక్కువ క్యారెక్టర్లు అయితే కనిపించవు. దానివల్ల ప్రేక్షకులకు కొంతవరకు బోర్ కొట్టే అవకాశం ఉంది. కానీ దర్శకుడు ఎప్పటికప్పుడు సీన్స్ లోని ఇంటెన్స్ ను పెంచుతూ ప్రేక్షకుడిలో క్యూరియాసిటి ని రేకెత్తించడంలో సక్సెస్ అయ్యాడు. దానివల్ల సినిమాను ప్రేక్షకుడికి ఎక్కడ బోర్ కొట్టించకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
లోకేష్ కనకరాజు మొదటిసారి హీరోగా చేసినప్పటికి ఇంటెన్స్ పర్ఫామెన్స్ ని ఇచ్చాడు. యాక్షన్ ఎపిసోడ్స్ లో ఆయన అనుసరించిన విధానం బాగుంది. ముఖ్యంగా ఆయన నుంచి ఎమోషనల్ సన్నివేశాల్లో పెద్దగా యాక్టింగ్ చేయకపోయిన స్క్రీన్ ప్రెజెన్స్ అయితే బాగుంది. కొన్ని సన్నివేశాల్లో తన ఓన్ స్టైల్ లో కనిపించి ప్రేక్షకుడిని బాగా ఆకట్టుకున్నాడు. ఆ లుక్కు కూడా పర్ఫెక్ట్ ఒక గ్యాంగ్ స్టర్ లానే ఉంది. కథ మొత్తం కత్తులతో పొడుచుకోవడం గన్స్ తో కాల్చుకోవడం లాంటివి ఉండడంతో ఆయన సైతం రాగడ్ గా కనిపించి మెప్పించాడు. మొత్తానికైతే లోకేష్ కనకరాజు నటుడిగా కూడా తన సత్తా చాటాడు. కాబట్టి తను రాబోయే సినిమాల్లో కూడా హీరోగా చేయవచ్చు…
పార్వతి క్యారెక్టర్ లో నటించిన అమ్మాయి స్క్రీన్ టైమ్ చాలా తక్కువగా ఉన్నప్పటికి ఆమె చాలా డీసెంట్ పర్ఫామెన్స్ ఇచ్చింది. చంద్ర క్యారెక్టర్ లో నటించిన అమ్మాయి తన క్యారెక్టర్ ని పర్ఫెక్ట్ గా పోట్రే చేసింది. ఆ తర్వాత గన్ను పట్టుకుని గ్యాంగ్ స్టర్ గా మారి తను కూడా విభత్సాన్ని సృష్టించింది. మొత్తానికైతే ఆమె పర్ఫామెన్స్ కూడా సినిమాకి చాలా వరకు హెల్ప్ అయింది. ఇక మిగతా ఆర్టిస్టులందరు కూడా వాళ్ళ పర్ఫామెన్స్ తో సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు. ఓవరాల్ గా సినిమాకి వాళ్ళు చాలా బాగా హెల్ప్ అయ్యారనే చెప్పాలి…
టెక్నికల్ అంశాలు
ఈ సినిమాలో బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే అద్భుతంగా ఉంది. ముఖ్యంగా అనిరుద్ ఈ సినిమా కోసం చాలా మంచి బిజియం అందించాడు. ఇంటర్వెల్ సీన్లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ కి బిజియం బాగా సెట్ అయింది. అలాగే మధ్యలో వచ్చే కొన్ని సీక్వెన్స్ లకు రాప్ సాంగ్స్ ని ఆడ్ చేసిన విధానం కూడా బాగుంది… ఎడిటర్ సైతం చాలా పర్ఫెక్ట్ గా ఎడిట్ చేశాడు. ఎక్కడ కూడా లాగ్ అయ్యే సన్నివేశాలని ఎక్కువ సేపు ఉంచకుండా చాలా ట్రిమ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో తను కూడా సక్సెస్ అయ్యాడు… ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఉన్నంతలో బాగున్నాయి…
ప్లస్ పాయింట్స్
డైరెక్షన్
ఇంటర్వెల్ యక్ష ఎపిసోడ్
లోకేష్ కనకరాజ్
బిజియం
మైనస్ పాయింట్స్
రొటీన్ కథ
ఫస్టాఫ్ కొంచెం బోర్ కొడుతుంది…
రేటింగ్ : 2.75/5