Sunrisers Hyderabad: ఐపీఎల్ 2027 సీజన్ కు సంబంధించి హైదరాబాద్ జట్టు కీలకమైన అప్డేట్ ఇచ్చింది. మిగతా జట్లు రకరకాల సమస్యలతో బాధపడుతుంటే.. హైదరాబాద్ మాత్రం రెట్టించిన ఉత్సాహంతో కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ జట్టుకు సారధిగా కమిన్స్ వ్యవహరిస్తున్నాడు. ఇటీవలి సీజన్లో అనారోగ్య సమస్యల వల్ల ఏకంగా ఏడు మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత అతడు అందుబాటులోకి వచ్చాడు. ఏడు మ్యాచ్లకు ఇషాన్ కిషన్ నాయకత్వం వహించాడు. జట్టను సమర్ధవంతంగా ముందుకు నడిపించాడు. వాస్తవానికి కిషన్ ను పూర్తిస్థాయిలో నాయకుడిగా నియమించాలని డిమాండ్లు వచ్చినప్పటికీ హైదరాబాద్ యాజమాన్యం.. వాటిని పట్టించుకోలేదు. ఆస్ట్రేలియా మాజీ సారధిపతి మాత్రమే మొగ్గు చూపించింది. అయితే కమిన్స్ తన స్థాయి ఆట తీరు ప్రదర్శించలేకపోయాడు. బౌలింగ్లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు.
2027 సంవత్సరంలో వన్డే వరల్డ్ కప్ జరుగుతుంది. ఆ తర్వాత యాషెస్ సిరీస్ కూడా జరుగుతుంది. ఈ రెండు ఆస్ట్రేలియా జట్టుకు అత్యంత కీలకమైనవి. అందువల్లే హైదరాబాద్ జట్టుకు దూరంగా ఉండాలని.. సారధ్య బాధ్యతలు కిషన్ కు అప్పగించాలని కమిన్స్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై మేనేజ్మెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకుందో తెలియాల్సి ఉంది. మరోవైపు కావ్య కూడా కిషన్ నాయకత్వం మీద ఆసక్తిగా ఉంది. అతని నాయకత్వం గురించి గతంలో ఆమె అనేక సందర్భాలలో గొప్పగా చెప్పింది. ఈ ప్రకారం చూసుకుంటే కిషన్ కు ప్రమోషన్ లభించినట్టే.
తాత్కాలిక సారధిగా కాకుండా శాశ్వత నాయకుడిగా కిషన్ ను నియమిస్తే హైదరాబాద్ జట్టుకు మరింత బలం చేకూరుతుందని అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ జట్టులో అద్భుతమైన ప్లేయర్లు ఉన్నారు. ఇటీవలీ ఐపీఎల్ లో కావ్య పాప జట్టు సమర్థవంతంగా ఆడినప్పటికీ.. ముఖ్యమైన దశలో ప్లేయర్లు అంతగా ఆకట్టుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో ఈసారి అలా కాకుండా ఉండాలని మేనేజ్మెంట్ భావిస్తుంది. అందువల్లే టోర్నీ ప్రారంభం నుంచే సారధి విషయంలో పకడ్బందీ ప్రణాళిక కొనసాగించాలని.. కిషన్ ద్వారానే ఆ లోటును భర్తీ చేయాలని మేనేజ్మెంట్ దృఢ సంకల్పంతో ఉంది. ఒకవేళ కిషన్ కనుక హైదరాబాద్ జట్టుకు శాశ్వత నాయకుడు అయిపోతే ఆ తర్వాత అతని ఆట తీరు వేరే విధంగా మారిపోతుందని అభిమానులు భావిస్తున్నారు. కిషన్ దూకుడుగా ఆడతాడు . కొన్ని సందర్భాలలో ఒంటరి పోరాటం కూడా చేస్తాడు . అలాంటి వ్యక్తికి సమర్థవంతమైన స్థానం లభిస్తే మాత్రం ఆట తీరు పూర్తిగా మారిపోతుంది . ఇందులో ఏమాత్రం సందేహం లేదని విశ్లేషకులు చెబుతున్నారు.