Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan: పవన్ మాటిస్తే అలా ఉంటది.. ఏకంగా వందల లీటర్లతో పాలాభిషేకం!

Pawan Kalyan: పవన్ మాటిస్తే అలా ఉంటది.. ఏకంగా వందల లీటర్లతో పాలాభిషేకం!

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారంటే అంతే. ఇట్టే పని జరగాల్సిందే. మూడేళ్ల కిందట ఇచ్చిన మాటను తాజాగా ఆయన నిలబెట్టుకున్నారు. దీంతో విద్యార్థులు చెట్లు కింద చదువులకు గుడ్ బై చెప్పేసారు. పవన్ కళ్యాణ్ సర్వతో ఏలూరు డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనాలు మంజూరయ్యాయి. ఏకంగా ప్రభుత్వం రూ.12.60 కోట్లు మంజూరు చేసింది. గతంలో జనవాణి, వారాహి యాత్రల సమయంలో పవన్ కళ్యాణ్ అక్కడ విద్యార్థులు పడుతున్న బాధలను చూశారు. […]

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారంటే అంతే. ఇట్టే పని జరగాల్సిందే. మూడేళ్ల కిందట ఇచ్చిన మాటను తాజాగా ఆయన నిలబెట్టుకున్నారు. దీంతో విద్యార్థులు చెట్లు కింద చదువులకు గుడ్ బై చెప్పేసారు. పవన్ కళ్యాణ్ సర్వతో ఏలూరు డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనాలు మంజూరయ్యాయి. ఏకంగా ప్రభుత్వం రూ.12.60 కోట్లు మంజూరు చేసింది. గతంలో జనవాణి, వారాహి యాత్రల సమయంలో పవన్ కళ్యాణ్ అక్కడ విద్యార్థులు పడుతున్న బాధలను చూశారు. చెట్ల కింద జరుగుతున్న తరగతులను చూసి ఆవేదన చెందారు. అప్పట్లోనే హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు భారీగా నిధులు మంజూరు చేయించారు. దీంతో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ చిత్రపటానికి వందలాది లీటర్ల పాలతో పాలాభిషేకం చేసేసారు.

* అప్పట్లోనే సమస్యను గుర్తించి..
జనసేన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనవాణి అనే కార్యక్రమం నిర్వహించింది. అప్పట్లో ప్రజా సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించేది. ఈ క్రమంలో ఏలూరు డిగ్రీ కాలేజీలో వసతి సమస్యపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. సోషల్ మీడియాలో సైతం అక్కడ విద్యార్థులు పడుతున్న బాధలు విపరీతంగా వైరల్ అయ్యాయి. వారాహి యాత్ర సమయంలో సైతం పవన్ అక్కడి పరిస్థితిని చూసి చలించి పోయారు. 300 మంది చదువుతున్న ఈ కాలేజీకి బట్టన్ నొక్కి బిల్డింగ్ కట్టించు జగన్ అంటూ సోషల్ మీడియాలో పవన్ చేసిన ట్వీట్ అప్పట్లో వైరల్ అయింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యను పరిష్కరిస్తామని చెప్పుకొచ్చారు పవన్.

* ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న వైనం..
అయితే పవన్ నాడు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం డిగ్రీ కాలేజీ శాశ్వత భవనాల నిర్మాణానికి రూ.12.60 కోట్లు మంజూరు చేయించారు. దీంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు.

* పాలాభిషేకం చేసిన ప్రజలు..
అయితే హామీని నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్ కు పాలాభిషేకం చేశారు ఏలూరు ప్రజలు. పవన్ చిత్రపటానికి విద్యార్థి సంఘాల నాయకులు, డిగ్రీ కాలేజీ విద్యార్థులు, జనసేన నాయకులు పాలాభిషేకం చేశారు. ఏలూరుకు సుదీర్ఘకాలంగా డిగ్రీ కాలేజీ రాకుండా చాలా కార్పొరేట్ సంస్థలు అప్పట్లో అడ్డుకున్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో అప్పట్లో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. కానీ పవన్ కళ్యాణ్ పట్టు పట్టి మరి శాశ్వత భవనాలకు నిధులు మంజూరు చేయించారు. అయితే ఒకటి కాదు రెండు కాదు వందల లీటర్ల పాలతో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకాలు నిర్వహించడం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలిచింది.

 

View this post on Instagram

 

A post shared by νєикαт (@pawankalyan_4ever)

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper