Homeఎంటర్టైన్మెంట్Vivek Oberoi: అక్షరాలా 10 వేల ఇళ్ల నిర్మాణాలు..చరిత్ర సృష్టించిన 'స్పిరిట్' విలన్..

Vivek Oberoi: అక్షరాలా 10 వేల ఇళ్ల నిర్మాణాలు..చరిత్ర సృష్టించిన ‘స్పిరిట్’ విలన్..

Vivek Oberoi: ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ మన టాలీవుడ్ ఆడియన్స్ కి సుపరిచితమే. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘రక్త చరిత్ర’ సిరీస్ తో ఆయన మన టాలీవుడ్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఆయన సూపర్ విలన్ క్యారెక్టర్ లో కనిపించిన ‘క్రిష్ 2’ ని కూడా మన తెలుగు ఆడియన్స్ ఎగబడి చూశారు. అదే విధంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ’ […]

Vivek Oberoi: ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ మన టాలీవుడ్ ఆడియన్స్ కి సుపరిచితమే. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘రక్త చరిత్ర’ సిరీస్ తో ఆయన మన టాలీవుడ్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఆయన సూపర్ విలన్ క్యారెక్టర్ లో కనిపించిన ‘క్రిష్ 2’ ని కూడా మన తెలుగు ఆడియన్స్ ఎగబడి చూశారు. అదే విధంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ’ చిత్రం లో వివేక్ ఒబెరాయ్ విలన్ క్యారెక్టర్ పోషించి మన తెలుగు ఆడియన్స్ కి ఇంకా బాగా దగ్గరయ్యాడు. ప్రస్తుతం ఆయన రెబల్ స్టార్ ప్రభాస్ , సందీప్ వంగ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ మూవీ లో విలన్ గా నటిస్తున్నారు. సినీ నటుడిగా వివేక్ ఒబెరాయ్ గురించి మన తెలుగు ఆడియన్స్ కి తెలిసింది ఇదే.

కానీ ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే, వివేక్ ఒబెరాయ్ ఒక దిగ్గజ రియల్ ఎస్టేట్ కంపెనీ కి మ్యానేజింగ్ డైరెక్టర్ అనే విషయం. ప్రముఖ పారిశ్రామిక వేత్త అంకుర్ అగర్వాల్ స్థాపించిన BNW డెవలప్మెంట్స్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ ని స్థాపించాడు. దీని మూలాలు UAE లో ఉంటాయి. ఈ సంస్థ ఇప్పుడు భారత్ మార్కెటింగ్ పై ప్రత్యేకమైన ద్రుష్టి సారించింది. దుబాయ్ , రాస్ అల్ ఖైమా లలో ప్రతిష్టాత్మకంగా ఈ సంస్థ చేపడుతున్న ప్రాజెక్టులలో భారతీయ కొనుగోలుదారులను ఆకర్షించేందుకు దేశవ్యాప్తంగా తన ఛానల్ పార్టనర్ నెట్వర్క్ ని విస్తరించే ప్రయత్నం లో ఉంది. ఇందుకోసం రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్లు , బ్రోకర్లతో భాగస్వాములను పెంచుకుంటోంది. వచ్చే నాలుగేళ్లలో UAE లో సుమారుగా 10 వేల ఇళ్లను అబ్బీవుద్ది చేయడమే ఈ సంస్థ టార్గెట్. ఈ సంస్థకు వివేక్ ఒబెరాయ్ మ్యానేజింగ్ డైరెక్టర్ గా మాత్రమే కాకుండా, సహా వ్యవస్థాపకుడిగా వ్యవహరిస్తున్నాడు.

ఈ 10 వేల ఇళ్ల అభివృద్ధి టార్గెట్ ని స్వయంగా వివేక్ ఒబెరాయ్ దగ్గరుండి పరిశీలిస్తున్నారు. ప్రపంచం లోనే టాప్ మోస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ లో ఇంతటి భాగస్వామ్యం ఉన్నటువంటి వివేక్ ఒబెరాయ్ నెల సంపాదన ఏ రేంజ్ లో ఉంటుందో మీరే ఊహించుకోండి. ఆయనకు సినిమాలు చెయ్యాల్సిన అవసరమే లేదు. కానీ నటన మీద మక్కువ తో చేస్తున్నాడంటే. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రమే కాదు , వివేక్ ఒబెరాయ్ కి దేశవ్యాప్తంగా , ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper