Pakistan : టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది. రోజు రోజుకు ఎన్నో మార్పులు వస్తున్నాయి. ల్యాండ్ ఫోన్ నుండి మొబైల్ ఫోన్ వరకు.. మర పడవల నుంచి మోటార్లతో నడిచే ఓడల వరకు.. డీజిల్ ట్రైన్ల నుంచి ఎలక్ట్రికల్ ట్రైన్ల వరకు.. ఇలా టెక్నాలజీ ద్వారా మనం అభివృద్ధి చెందుతూనే ఉన్నాం. టెక్నాలజీతో చాలా పనులు ఎంతో సులభంగా అయిపోతున్నాయి. ఇదివరకు రోజుల్లో ఎంతో కష్టపడితే కానీ పూర్తికానివి ఇప్పుడు సాంకేతికతతో సులభంగా చేసేస్తున్నాం. ఎన్నో కొత్త కొత్త పరికరాలు రోజు రోజుకీ వస్తున్నాయి. ఇక స్మార్ట్ ఫోన్‌తో ప్రతిదీ ఈజీ అయిపోయింది. చిన్న చిన్న దేశాలు కూడా టెక్నాలజీ సాయంతో అడ్వాన్స్‌డ్‌గా ఉంటే… మన దాయాది దేశం పాకిస్థాన్ మాత్రం రైళ్లకు ఇంకా డీజిల్ ఇంజన్లనే ఉపయోగిస్తోంది. ప్రపంచ దేశాల్లో ఎలక్ట్రిక్, మాగ్నటిక్ రైళ్లు బుల్లెట్‌లా దూసుకుపోతుంటే పాకిస్థాన్ మాత్రం డీజిల్ ఇంజిన్ రైళ్లతోనే నెట్టుకొస్తోంది. అలా ఎందుకు చేస్తుందో తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు.
Pakistan : పాకిస్థాన్‌లో ఇంకా డీజిల్ ఇంజిన్ రైళ్లే.. కరెంటు ఇంజిన్ కానరాదు.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..!
దొంగల భయంతోనే..
పాకిస్థాన్‌లో ఎలక్ట్రిక్ రైలింజన్‌ను ఉపయోగించరు. కనీసం ఒక్క ఎలక్ట్రిక్ ఇంజిన్ కూడా పాకిస్థాన్‌లో లేదు. అయితే ఎందుకు టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నా.. పాకిస్థాన్‌లో ఒక్క ఎలక్ట్రిక్ ఇంజిన్ కూడా వాడడం లేదు. ఇప్పటికీ డీజిల్ ఇంజన్లు మాత్రమే ఉపయోగిస్తున్నారు. నిజానికి 1966లో పాకిస్తాన్‌లో ఎలక్ట్రిక్ ఇంజన్లని వాడడం మొదలుపెట్టారు. లాహోర్ నుంచి ఈ ట్రైన్ నడిచేది. కానీ అప్పట్లో ఈ ఎలక్ట్రిక్ ట్రైన్‌లో ఉండే కాపర్ వైర్లను దొంగలించడం మొదలుపెట్టారు. దీంతో ఆ ఇంజిన్లకే పాకిస్థాన్ బ్రేక్ వేసింది.
2011 నుంచి పూర్తిగా నిలిపివేత..
దొంగతనాలను నియంత్రించడంలో పాకిస్థాన్ ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఎన్ని చర్యలు తీసుకున్నా చోరీలు ఆగడం లేద. మరోవైపు ఎలక్ట్రిక్ ఇంజిన్ల మరమ్మతుకు అయ్యే ఖర్చు ప్రభుత్వానికి భారంగా మారుతోంది. దీంతో క్రమంగా ఎలక్ట్రిక్ ఇంజిన్ల వాడకం తగ్గిస్తూ వచ్చింది. 2011లో ఈ సర్వీసులను పూర్తిగా నిలిపివేసింది. పాకిస్థాన్‌లో రైళ్లు అన్నీ కూడా డీజిల్ ఇంజన్స్‌తోనే నడుస్తున్నాయి. ఇలాంటి వింతైన సంఘటనలు ఎక్కువగా పాకిస్థాన్‌లోనే ఎక్కువగా కనబడతాయి.
అందుకే బోగిలపై ప్రయాణం..
రైల్వే లైన్ల ఎలక్ట్రిఫికేషన్ లేకపోవడంతో అక్కడి ప్రయాణికులు కూడా బోగీలపై ఎక్కి మరీ ప్రయాణం చేస్తున్న దృశ్యాలు కనిపిస్తాయి. సరిపడా రైళ్లు లేకపోవడం, ఉన్న రైళ్లు చాలకపోవడంతో పాకిస్థాన్‌లో వివిధ ప్రాంతాలకు వెళ్లేవారు.. రైలు బోగీలపై ఎక్కుతారు. మరో విషయం ఏమిటంటే ఆ దేశంలో రైలు ప్రయాణికుల్లో టికెట్ తీసుకునేవారు కూడా 60 శాతమేనట. మిగతా 40 శాతం మంది ఉచితంగా ప్రయాణిస్తారని సమాచారం. టీసీకి దొరకకుండా ఉండేందుకు కూడా చాలా మంది బోగీలపైకి ఎక్కి కూర్చుంటారట.
Most Popular
google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...
google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !
bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..
parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..
special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..
temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...






