Homeఅంతర్జాతీయంVladimir Putin: పుతిన్‌పై భారతీయుల నమ్మకం.. ట్రంప్‌పై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత!

Vladimir Putin: పుతిన్‌పై భారతీయుల నమ్మకం.. ట్రంప్‌పై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత!

Vladimir Putin: డొనాల్డ్‌ ట్రంప్‌.. వ్లాదిమిర్‌ పుతిన్‌.. ఇద్దరు ప్రపంచంలో అగ్ర నాయకులు. భారత్‌కు ఇద్దరూ కావాల్సిన వారే. రష్యాతో భారత్‌కు దశాబ్దాలుగా సత్సంబంధాలు ఉన్నాయి. వాణిజ్య, సైనిక సహకారం కొనసాగుతోంది. ఇక అమెరికాతో మాత్రం సంబంధాలు భిన్నంగా ఉంటున్నాయి. దశాబ్దకాలంగా మెరుగు పడుతున్నాయి. అయితే అధ్యక్షుడిని బట్టి సంబంధాలు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్యూరీ రీసెర్చ్‌ సెంటర్‌ నిర్వహించిన తాజా అంతర్జాతీయ సర్వేలో భారతీయులు ప్రపంచ వ్యవహారాలను నిర్వహించడంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌పై […]

Vladimir Putin: డొనాల్డ్‌ ట్రంప్‌.. వ్లాదిమిర్‌ పుతిన్‌.. ఇద్దరు ప్రపంచంలో అగ్ర నాయకులు. భారత్‌కు ఇద్దరూ కావాల్సిన వారే. రష్యాతో భారత్‌కు దశాబ్దాలుగా సత్సంబంధాలు ఉన్నాయి. వాణిజ్య, సైనిక సహకారం కొనసాగుతోంది. ఇక అమెరికాతో మాత్రం సంబంధాలు భిన్నంగా ఉంటున్నాయి. దశాబ్దకాలంగా మెరుగు పడుతున్నాయి. అయితే అధ్యక్షుడిని బట్టి సంబంధాలు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్యూరీ రీసెర్చ్‌ సెంటర్‌ నిర్వహించిన తాజా అంతర్జాతీయ సర్వేలో భారతీయులు ప్రపంచ వ్యవహారాలను నిర్వహించడంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌పై ఎక్కువ విశ్వాసం చూపించారు. 36 దేశాల్లో 42 వేల మందికి పైగా పాల్గొన్న ఈ అధ్యయనం ప్రకారం, భారతదేశంలో 51 శాతం మంది పుతిన్‌ సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోగలరని విశ్వాసం వ్యక్తం చేశారు. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ఇలాంటి విశ్వాసం 39 శాతం మందికి మాత్రమే ఉంది. గత సంవత్సరం ట్రంప్‌కు భారతదేశంలో 51 శాతం మద్దతు ఉండగా, ఇప్పుడు అది గణనీయంగా తగ్గింది.

ట్రంప్‌ విధానాలపై భిన్నాభిప్రాయాలు..
ట్రంప్‌ గ్రాఫ్‌ పడిపోవడానికి ఆయన తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలే ప్రధాన కారణంగా సర్వే తెలిపింది. అంతర్జాతీయ వాణిజ్య సుంకాలు, వెనిజువెలా, ఇరాన్‌ సంక్షోభాల నిర్వహణపై మెజారిటీ భారతీయులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికా అమలు చేస్తున్న కఠిన వలస విధానాలకు కేవలం 32 శాతం మంది మాత్రమే మద్దతు ఇచ్చారు. యూఎస్‌ఏఐడీ వంటి సహాయక సంస్థల మూసివేత, గాజా, రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధాల పరిష్కార విధానం కూడా భారతీయుల్లో తీవ్ర వ్యతిరేకతను రేకెత్తించాయి.

ప్రపంచవ్యాప్తంగా ట్రంప్‌ రేటింగ్స్‌..
భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని 16 దేశాల్లో ట్రంప్‌ ప్రజాభిప్రాయం భారీగా పడిపోయింది. మొత్తం సర్వేలో పాల్గొన్నవారిలో 76 శాతం మంది ట్రంప్‌ నాయకత్వంపై ఎలాంటి నమ్మకం లేదని స్పష్టం చేశారు. కేవలం 23 శాతం మంది మాత్రమే ఆయనను సమర్థించారు. జర్మనీ, ఫ్రాన్స్‌ వంటి ఐరోపా దేశాలు, ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లో ట్రంప్‌కు అత్యల్ప రేటింగ్స్‌ వచ్చాయి. అయితే ఇజ్రాయెల్‌లో మాత్రం 66 శాతం మంది ట్రంప్‌ నిర్ణయాలను సానుకూలంగా స్వీకరించారు.

ఈ సర్వే ఫలితాలు అంతర్జాతీయ సంబంధాల్లో భారతదేశం స్వతంత్ర స్థానాన్ని సూచిస్తున్నాయి. పుతిన్‌పై ఎక్కువ నమ్మకం వ్యక్తమవడం భారత్‌–రష్యా సంబంధాలను మరింత బలపరచవచ్చు. అదే సమయంలో ట్రంప్‌ విధానాలపై అసంతృప్తి భారత్‌–అమెరికా సంబంధాల్లో కొన్ని సవాళ్లను సృష్టించే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ట్రంప్‌ నాయకత్వంపై నిరాశ బలంగా ఉండటం ఆయన విదేశాంగ విధానాలకు గట్టి సవాలుగా మారింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper