Homeఅంతర్జాతీయంPakistan: బలోచ్ దాడులు తట్టుకోలేక పరువు తీసుకుంటున్న పాకిస్తాన్

Pakistan: బలోచ్ దాడులు తట్టుకోలేక పరువు తీసుకుంటున్న పాకిస్తాన్

Pakistan: పాకిస్తాన్‌కు పరువు తీసుకోవడం అలవాటైంది. సొంత ప్రయోజనాల కోసం సాగిలా పడడం, తప్పుడు కథనాలు ప్రసారం చేయడం.. తర్వాత నాలుక కరుచుకోవడం పాకిస్తాన్‌కు వెన్నెతో పెట్టిన విద్యే. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాకిస్తాన్‌ 5 రఫాల్‌ విమానాలు కూల్చామని ప్రకటించింది. ఆస్ట్రేలియన్‌ జర్నలిస్ట్‌ ఇషాక్‌ ధర్‌ను ప్రశ్నించగా, ‘సోషల్‌ మీడియా పోస్టులే ఆధారం‘ అని చెప్పడంతో పరువు పోయింది. ప్రభుత్వ మంత్రి ఇలా మాట్లాడటం యుద్ధ ప్రకటనల్లో నమ్మకతను దెబ్బతీసింది.

బలూచిస్తాన్‌ దాడులు..
జనవరి 30 నుంచి ’ఘెరాఫ్‌’ పేరుతో 1000 మంది బీఎల్‌ఏ మిలిటెంట్లు సైనిక కంటోన్మెంట్లు, ప్రభుత్వ ఆస్తులపై ధాడులు చేస్తున్నారు. ఆత్మాహుతి దాడులు, వరుస పేలుళ్లతో వందలాది మరణించారు. భారీగా పాకిస్తాన్‌ దెబ్బతింటోంది. సైనికులు బలూచిస్తాన్‌ బదిలీలకు రాజీనామాలు చేస్తున్నారు. దీంతో పాక్‌ సైన్యం బలహీనత బహిర్గతమైంది.

భారత్‌పై తప్పుడు ఆరోపణలు
బలూచ్‌ దాడుల నుంచి దృష్టి మళ్లించేందుకు పాకిస్తాన్‌ భారత్‌పై ఆరోపణలు చేస్తోంది. ఇస్లామాబాద్‌ షియా మసీదు పేలుడుకు కూడా భారత ఏజెంట్లు బాధ్యత అని చెబుతోంది. కానీ ఆధారాలు లేవు. ఆధారాలు ఇవీ అని చూపించలేని పరిస్థితి.

దురంధర్‌ జపం..
పాక్‌ ప్రజలు ’దురంధర్‌’ సినిమా గురించి చర్చిస్తున్నారు. భారత గూఢచారి కథతో పోల్చుకుని, దురంధర్‌ భారత్‌ బలూచ్‌ తిరుగుబాటును ప్రేరేపిస్తోందని భయపడుతున్నారు. ఇది పాక్‌ ప్రచారంలో వాడుతున్నారు. వాస్తవ సమస్యల నుంచి దూరం చేయడానికి సినిమా నేపథ్యాన్ని వాడుకుంటున్నారు.

మొత్తానికి దురంధర్‌ పాకిస్తాన్‌ను కుదిపేస్తోంది. వైఫల్యాలు, బలూచ్‌ దాడుల నుంచి తప్పించుకోవడానికి నెపాన్ని పాకిస్తాన్‌ దురంధర్‌పై తోసేస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper