Homeఅంతర్జాతీయంModi Malaysia Visit: మోదీ మలేషియా టూర్ వెనక పెద్ద కథ

Modi Malaysia Visit: మోదీ మలేషియా టూర్ వెనక పెద్ద కథ

Modi Malaysia Visit: భారత ప్రధాని నరేంద్రమోదీ 2026లో తన తొలి విదేశీ పర్యటన ఆగ్నేయాసియాలోని ముస్లిం దేశం అయిన మలేషియాకు వెళ్లారు. ఫిబ్రవరి 7, 8 తేదీల్లో మోదీ ఆదేశంలో పర్యటించారు. ఇక మోదీ 12 ఏళ్ల పదవీకాలంలో మలేషియా వెళ్లడం ఇది మూడోసారి. తాజాగా మోదీ మలేషియా పర్యటన భారత్‌–మలేషియాకు కీలకంగా మారింది. బ్రిక్స్‌ చైర్మన్‌ పదవి చేబట్టబోతున్న తరుణంలో ముస్లిం దేశంలో పర్యటించడం కీలకంగా మారింది. గతంలో కశ్మీర్‌ వివాదం సంబంధాలను దెబ్బతీసినా, 2024లో అన్వర్‌ ఇబ్రహీం ప్రధాని అయిన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మోదీ మలేషియా వెళ్లారు. మరోవిషయం 2025లో మలేషియా–భారత్‌ మధ్య విస్తృత వ్యూహాత్మక ఒప్పందం జరిగింది.

భారత్‌కు భౌగోళిక ప్రాధాన్యం..
మలేషియా మలక్కా స్ట్రెయిట్‌ ద్వారా ప్రపంచ వాణిజ్యంలో 40% ట్రాఫిక్‌ నియంత్రిస్తుంది. అండమాన్‌ నికోబార్‌కు సమీపంలో ఉండటం భారత్‌కు సముద్ర భద్రతలో ఆధారం. సింగపూర్, మలేషియా, ఇండోనేషియా మనకు ముఖ్యమైనవి. అండమాన్‌ నికోబార్‌ కూడా మలక్కాకు దగ్గరగా ఉన్నాయి. దీంతో మలక్కా జలసంధిని నియంత్రించే అవకాశం మనకు ఉంటుంది. ఇక మలేషియాలో పెట్టుబడులకు చైనా, పాకిస్తాన్‌ పోటీ పడుతున్నాయి. ఆ ఇరు దేశాలు నచ్చకుంటే మలేషియా భారత్‌తో ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంటుంది.

ఆర్థిక, రక్షణ భాగస్వామ్యం
2023లో భారత్‌–మలేషియా మధ్య 17 బిలియన్‌ డాలర్ల వ్యాపారం జరిగింది. 2025 నాటికి దానిని 24 బిలియన్‌ డాలర్లకు పెంచాయి. 2024 ఆగస్టు సమగ్ర వ్యూహాత్మక ఒప్పందం రక్షణ, సముద్ర భద్రత, సమాచార భాగస్వామ్యాన్ని బలోపేతం చేసింది. పామ్‌ ఆయిల్‌ దిగుమతి పునరుద్ధరణ గత వివాదాల తర్వాత విశ్వాసాన్ని పునరుద్ధరించింది.

భారత మూలాలున్నవారితో సమావేవం..
మలేషియాలో 29 లక్షల మంది భారతీయ మూలాల వారు (6 జనరేషన్లు) కీలకం. మోదీ పర్యటనలో 15 వేల మందితో ’వెల్‌కమ్‌ మోదీ’ కార్యక్రమం ఓసీఐ కార్డుల పంపిణీ జరిగింది. ఇది ఇరుదేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుంది. ఇక త్వరలో మలేషియాలో Üుబ్రమణ్య స్వామి పండుగ జరుగనుంది. ఈ సమయంలో పర్యటన హిందూ సమాజంతో సంబంధాలను పెంచింది.

జాకీర్‌ నాయక్, ఎన్నికల ప్రభావం
మలేషియాలో జకీర్‌ నాయక్‌ (మనీ లాండరింగ్‌ కేసు)పై భారత ఒత్తిడి పెరుగుతోంది. మలేషియా ప్రభుత్వం ఆయన కార్యకలాపాలను నియంత్రిస్తోంది. త్వరా జరిగే మలేషియా ఎన్నికల్లో భారతీయ ఓటర్ల పాత్ర కీలకం. భారత మద్దతు దానికి దోహదపడుతుంది. నేతాజీ సహచరులతో సమావేశం చారిత్రక బంధాన్ని గుర్తు చేసింది.

వాణిజ్య ఫోరం, ఒప్పందాలు రెండు దేశాల సహకారాన్ని బలపరిచాయి. గత వివాదాలు మరచి, భవిష్యత్‌ సంబంధాలు బలపడ్డాయి. బ్రిక్స్‌ చైర్మన్‌షిప్‌కు మలేషియా మద్దతు భారత వ్యూహంలో కీలకం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular