Pakistan Army: రెండు పాములు సమవుజ్జీలు అయినప్పుడు.. వాటి మధ్య పోరాటం జరిగినప్పుడు.. ఏదో ఒకటి చావాలి. అది జరగాలంటే ఒక పాము ఏదో ఒక కుట్రకు పాల్పడాలి.
పై ఉపోద్ఘాతం పాకిస్తాన్ సైనికులకు నూటికి నూరు శాతం కాదు అంతకుమించి సరిపోతుంది. పాకిస్తాన్ దేశంలో ఉగ్రవాదుల కదలికలు నిత్యం ఉంటూనే ఉంటాయి. అక్కడి సైన్యాన్ని.. ప్రభుత్వాన్ని.. ప్రజలను ఉగ్రవాదులు ప్రభావితం చేస్తూ ఉంటారు. ఒకరకంగా చెప్పాలంటే ఉగ్రవాదులు మాత్రమే అక్కడి వ్యవస్థలను కొనసాగిస్తూ ఉంటారు. ఇదేమీ కొత్తది కాదు. కాకపోతే ఇటీవల కాలంలో అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు విపరీతంగా పెరిగిపోయాయి. అవి ఎక్కడదాకా వెళ్లాయంటే.. ఏకంగా అక్కడి సైన్యాన్నే ఉగ్రవాదులు హతమార్చే దాకా వెళ్ళిపోయాయి.
ఇటీవల కాలంలో పాకిస్థాన్లో ఉగ్రవాదులు దారుణమైన ఘోరాలకు పాల్పడుతున్నారు. డబుల్ ట్యాప్ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ జవాన్లను లక్ష్యంగా చేసుకొని రెట్టింపు మారణ హోమం సృష్టిస్తున్నారు. ముందుగా ఒక పోలీసు లేదా ఆర్మీ స్థావరం మీద దాడి చేస్తారు. ఆ తర్వాత అదనపు బలగాలు వచ్చేవరకు చూస్తారు. ఆ తర్వాత మరోసారి దాడికి దిగుతారు. గడిచిన నెల 29వ తేదీన ఇదే తరహాలో దాడి జరిగింది. అప్పుడు ఏకంగా తొమ్మిది మంది జవాన్లు చనిపోయారు. గడిచిన మూడు సంవత్సరాల కాలంలో 16 మంది జవాన్లు ఇలా కన్నుమూశారు. డబుల్ ట్యాప్ వ్యూహానికి ఇలా 16 మంది జవాన్లు చనిపోయారు.
ఎవరు తీసిన గోతిలో వారు పడతారు. పాకిస్తాన్ దేశానికి సంబంధించి కూడా ఈ సూత్రం సరిపోతుంది. ఎందుకంటే ఉగ్రవాదులతో మన దేశాన్ని ఇబ్బంది పెట్టాలని.. మారణ హోమాన్ని సృష్టించాలని చూసింది. ఇందులో కొంత విజయవంతమైనది కూడా. చివరికి పాకిస్తాన్ తాను చేసిన పాపానికి తానే బలైపోయింది. ఉగ్రవాదులు ఇక్కడితోనే ఆగుతారా.. అంతకుమించి నాశనాన్ని పాకిస్తాన్ దేశానికి కళ్ళ ముందు చూపిస్తారా.. ఈ ప్రశ్నకు సమాధానం ఏమో గాని.. ఇప్పటికైతే పాకిస్తాన్ పరిస్థితి బాగోలేదు. ముఖ్యంగా సైన్యం విషయంలో ఆ దేశం అనుసరిస్తున్న విధానం ఏమాత్రం గొప్పగా లేదు.
ఇప్పటికే పాకిస్తాన్లో వరుసగా దాడులు జరుగుతున్నాయి. ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారు. ఉగ్రవాదులను అక్కడి ప్రభుత్వం కట్టడి చేయలేకపోతోంది. అనేక ప్రాంతాలలో ఉగ్రవాదులు స్థావరాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆ మధ్య భారత్ చేసిన దాడుల ద్వారా ఇది తేటతెల్లమైంది. పైగా ఉగ్రవాదుల స్థావరాలను తిరిగి నిర్మించడానికి పాకిస్తాన్ ఆర్థిక సహాయం కూడా చేసింది. ఇక పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించలేకపోతోంది. దీనివల్ల పాకిస్తాన్ పరపతి రోజురోజుకు తగ్గిపోతుంది. ఇలా అయితే పాకిస్తాన్ పరిస్థితి మరింత దారుణంగా మారిపోయే రోజు ఎంతో దూరంలో లేదు.