Homeఆంధ్రప్రదేశ్‌Telangana Maharashtra Border House: కిచెన్ తెలంగాణలో.. బెడ్‌రూమ్ మహారాష్ట్రలో.. ఈ వింత గ్రామం గురించి...

Telangana Maharashtra Border House: కిచెన్ తెలంగాణలో.. బెడ్‌రూమ్ మహారాష్ట్రలో.. ఈ వింత గ్రామం గురించి తెలుసా?

Telangana Maharashtra Border House: భారతదేశంలో రాష్ట్రాల సరిహద్దులు గ్రామాలను విడగొట్టడం సాధారణమే. కానీ ఒకే ఇంటిని రెండు రాష్ట్రాల సరిహద్దు చీల్చి వెళ్లడం చాలా అరుదైన విషయం. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని ఓ గ్రామంలో ఓ ఇల్లు సగం ఒక రాష్ట్రంలో.. మరో సగం మరో రాష్ట్రంలో ఉంది. అంతేకాకుండా కిచెన్ ఒక రాష్ట్రంలో ఉంటే.. బెడ్ రూం మరో రాష్ట్రంలో ఉంది.. ఈ అరుదైన ఇల్లు వల్ల ఆ కుటుంబానికి కొన్ని ప్రయోజనాలు ఉండగా.. […]

Telangana Maharashtra Border House: భారతదేశంలో రాష్ట్రాల సరిహద్దులు గ్రామాలను విడగొట్టడం సాధారణమే. కానీ ఒకే ఇంటిని రెండు రాష్ట్రాల సరిహద్దు చీల్చి వెళ్లడం చాలా అరుదైన విషయం. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని ఓ గ్రామంలో ఓ ఇల్లు సగం ఒక రాష్ట్రంలో.. మరో సగం మరో రాష్ట్రంలో ఉంది. అంతేకాకుండా కిచెన్ ఒక రాష్ట్రంలో ఉంటే.. బెడ్ రూం మరో రాష్ట్రంలో ఉంది.. ఈ అరుదైన ఇల్లు వల్ల ఆ కుటుంబానికి కొన్ని ప్రయోజనాలు ఉండగా.. మరికొన్ని సమస్యలు ఉన్నాయి. ఇంతకీ ఆ ఇల్లు ఎవరిది? ఇది ఎక్కడుంది?

మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా మహారాజ్‌గూడ అనే గ్రామం గురించి ఆసక్తిగా చర్చించుకుంటారు. ఈ ఇల్లు సగభాగం తెలంగాణలో.. మరోసగభాగం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఈ ఇంట్లో ఉత్తమ్ పవార్ తన కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. ఉత్తమ్ పవార్‌తో పాటు అతని సోదరుడు చందూ పవార్ కుటుంబం కూడా ఇదే ఇంట్లో నివసిస్తున్నారు. ఈ ఇంట్లో మొత్తం ఎనిమిది గదులు ఉన్నాయి. రెండు కుటుంబాలకు చెందిన 13 మంది సభ్యులు కలిసి ఉంటున్నారు. ఇంటిని ఇద్దరు సోదరులు సమానంగా పంచుకోగా, ఉత్తమ్ పవార్‌కు వచ్చిన నాలుగు గదులు మహారాష్ట్రలో ఉండగా.. చందూ పవార్‌కు చెందిన నాలుగు గదులు తెలంగాణ పరిధిలో ఉన్నాయి.

బెడ్‌రూమ్ ఒక రాష్ట్రంలో.. కిచెన్ మరో రాష్ట్రంలో
ఈ ఇంటి ప్రత్యేకత ఏంటంటే.. ఉత్తమ్ పవార్‌కు చెందిన బెడ్‌రూమ్ మహారాష్ట్రలో ఉండగా.. అతను ఉపయోగించే వంటగది మాత్రం తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉంది. అంటే నిద్రలేచి వంట చేయడానికి ఆయన మరో రాష్ట్రంలోకి రావాలన్న మాట. ఒకే ఇంట్లో రోజువారీ జీవితం రెండు రాష్ట్రాల మధ్య సాగడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

చంద్రాపూర్ జిల్లాలోని జీవతి తహసీల్‌లో ఉన్న 14 సరిహద్దు గ్రామాలకు సంబంధించి చాలా కాలంగా సరిహద్దు వివాదాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో మహారాజ్‌గూడ కూడా ఒకటి. 1969లో రాష్ట్రాల మధ్య సరిహద్దులను ఖరారు చేసే సమయంలో బార్డర్ లైన్ పవార్ కుటుంబానికి చెందిన భూమి మధ్యలో నుంచి వెళ్లింది. దీంతో ఆ భూమిపై నిర్మించిన ఇల్లు కూడా రెండు రాష్ట్రాల్లోకి విభజించబడింది. అప్పటి నుంచి ఈ ఇల్లు ఒక ప్రత్యేక భౌగోళిక విశేషంగా నిలిచిపోయింది.

రెండు రాష్ట్రాల రిజిస్ట్రేషన్లు.. రెండు రాష్ట్రాల పన్నులు
ఈ కుటుంబం రెండు రాష్ట్రాల్లో నివసిస్తున్న విషయం ఆశ్చర్యానికి గురి చేసినా.. వీరికి కొన్ని ఇబ్బందులు.. మరికొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. వీరి ఇంటికి సంబంధించిన ఆస్తి పన్నును కూడా రెండు రాష్ట్రాల్లో చెల్లించాల్సి వస్తోంది. కానీ రెండు రాష్ట్రాల ప్రభుత్వ సేవలు, పథకాల ప్రయోజనాలను పొందుతున్నారు. ఈ కుటుంబానికి చెందిన వాహనాల్లో కొన్ని తెలంగాణ రిజిస్ట్రేషన్ నంబర్లతో ఉండగా, మరికొన్ని మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ నంబర్లతో ఉన్నాయి.

ఈ ఇంటిని సందర్శించే వారికి సులభంగా అర్థమయ్యేలా ఇంటి నేలపై తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు గీతను స్పష్టంగా గుర్తించారు. ఏ భాగం తెలంగాణలోకి వస్తుందో, ఏ భాగం మహారాష్ట్రలోకి వస్తుందో గుర్తించేలా రాష్ట్రాల పేర్లను కూడా రాసి ఉంచారు. దీంతో ఇంటి లోపలే ఒక అడుగు వేస్తే తెలంగాణ, మరో అడుగు వేస్తే మహారాష్ట్రలోకి ప్రవేశించిన అనుభూతి కలుగుతుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper