Homeఅంతర్జాతీయంIndus Waters Treaty: సిందూ జలాల కోసం రంగంలోకి పాక్‌ ఆర్మీ.. భారత్‌ చూస్తూ ఊరుకుంటుందా?

Indus Waters Treaty: సిందూ జలాల కోసం రంగంలోకి పాక్‌ ఆర్మీ.. భారత్‌ చూస్తూ ఊరుకుంటుందా?

Indus Waters Treaty: 2025 ఏప్రిల్‌ 22న కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి చంపేశారు. హిందువులు అని నిర్ధారించి మరీ కాల్పులు జరిపారు. ముస్లింలను వదిలేశారు. ఈ ఘటనలో 26 మంది చనిపోయారు. లష్కర్‌–ఎ–తయ్యబా ప్రాక్సీ సంస్థ అయిన రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ ఈ దాడికి బాధ్యత తీసుకుంది. భారత్‌ దీన్ని పాకిస్తాన్‌ మద్దతు ఉన్న ఉగ్రవాదంగా ఖండించింది.

దాడి తర్వాత భారత్‌ చర్యలు..
ఉగ్రదాడి తర్వాత రోజు (ఏప్రిల్‌ 23, 2025) భారత్‌ 1969లో జరిగిన సిందూ జలాల ఒప్పందాన్ని హోల్డ్‌లో పెట్టింది. రక్తం నీరు కలిసి పారవని, పాకిస్తాన్‌ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం నిలిపివేసేవరకు సిందూ నుంచి చుక్క నీరు కూడా పాకిస్తాన్‌ అవసరాలకు ఇవ్వమని స్పష్టం చేసింది. అటారీ–వాఘా సరిహద్దు మూసివేత, పాకిస్థాన్‌ దౌత్యవేత్తలను బహిష్కరణ, దౌత్య సంబంధాలు తగ్గింపు వంటి చర్యలు కూడా తీసుకుంది.

సిందూ ఒప్పందం ఏమిటి..
1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం తూర్పు నదులు (రవి, బియాస్, సట్లెజ్‌) భారత్‌కు, పశ్చిమ నదులు (ఇండస్, జీలం, చీనాబ్‌) పాకిస్థాన్‌కు ప్రాధాన్యత ఇచ్చాయి. ఉగ్రదాడి తర్వాత భారత్‌ డేటా షేరింగ్‌ ఆపేసింది. పశ్చిమ నదులపై డ్యాములు, హైడ్రో ప్రాజెక్టులు వేగంగా నిర్మించడానికి అవకాశం కల్పించింది. ఇది పాకిస్థాన్‌కు నీటి ప్రవాహంపై భారత్‌ నియంత్రణను పెంచుతుంది.

పాకిస్తాన్‌పై తీవ్ర ప్రభావం..
ఈ నదులపై పాకిస్తాన్‌ వ్యవసాయంలో 80–90 శాతం ఆధారపడి ఉంది. హైడ్రోపవర్‌ ఉత్పత్తికి కూడా కీలకం. ఒప్పందం నిలిపివేత వల్ల ఖరీఫ్‌ పంటలకు నీటి కొరత ఏర్పడింది. కొన్ని నివేదికల ప్రకారం 13 శాతం వరకు నీటి లోటు నమోదైంది. వాతావరణ మార్పులతో పాటు ఈ పరిస్థితి ఆర్థికంగా ఇబ్బంది కలిగిస్తోంది.

రంగంలోకి సాకిస్తాన్‌ సైన్యం..
2026 జూలైలో జనరల్‌ ఆసిమ్‌ మునీర్‌ అధ్యక్షతన జరిగిన 276వ కార్ప్‌స్‌ కమాండర్ల సమావేశంలో సిందూ జలాలపై చర్చ జరిగింది. ప్రభుత్వ ఆదేశాలు, ప్రజల ఆకాంక్షల మేరకు ఒప్పందం ప్రకారం తమ వాటా నీటిని సాధించడానికి అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. 2025 ఏప్రిల్‌ 24న జాతీయ భద్రతా కమిటీ ఇచ్చిన మార్గదర్శకాలను పునరుద్ఘాటించింది. నీటిని ఆపడాన్ని యుద్ధ చర్యగా భావిస్తామని, ఇది జాతీయ భద్రతకు కీలకమని తెలిపింది. అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్‌ నియంత్రిత ప్రాంతాల నుంచి ఉగ్రవాద బెదిరింపులపై కూడా ఆందోళన వ్యక్తం చేసింది.

చుక్క కూడా వదలమన్న భారత్‌..
జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ ఇటీవల ‘‘భారత్‌ వాటాకు చెందిన ఒక్క చుక్క నీరు కూడా పాకిస్థాన్‌కు వెళ్లకుండా చూస్తాం’’ అని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు పని చేస్తున్నామని, 1.5 నుంచి 2 సంవత్సరాల్లో పూర్తి వినియోగం సాధ్యమవుతుందని, 2028 జూన్‌ నాటికి పూర్తి నిలిపివేత సాధించవచ్చని వ్యాఖ్యానించారు. ఈ చర్యను అక్రమం, యుద్ధ సమానమైనదిగా ఖండించింది. నీటిని ఆయుధంగా వాడకూడదని, ఇది ప్రాంతీయ శాంతికి ముప్పు అని హెచ్చరికలు చేసింది. కొందరు మంత్రులు యుద్ధం వరకు వెళ్లవచ్చని బెదిరింపులు చేశారు. సైన్యం నీటిని ‘‘రెడ్‌ లైన్‌’’గా ప్రకటించి, 24 కోట్ల మంది ప్రజల జీవనోపాధికి ఇది కీలకమని నొక్కి చెప్పింది.

తాజా పరిణామాలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచాయి. భారత్‌ ఉగ్రవాద మద్దతు విరమణను ప్రధాన షరతుగా పెట్టగా, పాకిస్తాన్‌ నీటి హక్కును రక్షించడానికి అన్ని విధాలా సిద్ధంగా ఉందని స్పష్టం చేస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Weight Loss

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...
HYDRA Ranganath

HYDRA Ranganath: హైడ్రా రంగనాథ్ కు రాం రాం.. తెలంగాణ హైకోర్టు సంచలనం

HYDRA Ranganath: హైడ్రా.. తెలంగాణలో 2023లో కొలువుదీరిన రేవంత్‌రెడ్డి సర్కార్‌ హైదరాబాద్‌లోని ప్రభుత్వ భూముల పరిరక్షణ, చెరువులు, కుంటల ఆక్రమణల తొలగింపు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు సహాయ సహకారాలు అదించేందుకు ఏర్పాటు...
Kerala Innovation

Kerala Innovation: అమ్మ కష్టం చూడలేక.. ఈ కొడుకు చేసిన పని.. ఏకంగా సీఎం చప్పట్లు కొట్టాడు..

Kerala Innovation: ఉదయం లేవగానే ఇల్లు ఊడ్చి.. కల్లాపి చల్లాలి. ముగ్గు పెట్టాలి. బట్టలు ఉతకాలి. టీ దగ్గర నుంచి మొదలు పెడితే కూర వరకు వండాలి. ఇంటిని శుభ్రం చేయాలి. ఇన్ని...
Arunachalam Moksha Margam

Arunachalam Moksha Margam: అరుణాచలం మోక్షమార్గం.. తెలుగు భక్తులకే ఎందుకీ కష్టాలు..

Arunachalam Moksha Margam: అప్పుడెప్పుడో ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు అరుణాచలంలో ప్రదక్షిణలు చేయాలని.. మోక్ష మార్గం నుంచి బయటికి రావాలని పిలుపునిచ్చారు. ఆయన చెప్పడమే ఆలస్యం తెలుగు భక్తులు అప్పటినుంచి...
Suryakumar Yadav

Suryakumar Yadav: సూర్య కుమార్ యాదవ్.. నీ కష్టం పగ వాడికి కూడా రావద్దు బ్రో

Suryakumar Yadav:  అతడి నాయకత్వంలో టీమిండియా టి20 లలో ఒక్క ట్రోఫీ కూడా కోల్పోలేదు.. చివరికి టి20 వరల్డ్ కప్ కూడా సాధించింది. 2024లో రోహిత్ నాయకత్వంలో టీమిండియా అద్భుతం చేస్తే.. 2026లో...
Oktelugu Epaper