Homeవింతలు-విశేషాలుVenezuela Earthquake: ఎనిమిది రోజులుగా నీరు, ఆహారం లేదు. ఐనా బతికాడు..

Venezuela Earthquake: ఎనిమిది రోజులుగా నీరు, ఆహారం లేదు. ఐనా బతికాడు..

Venezuela Earthquake: భూమ్మీద నూకలు ఉంటే.. యముడి పాశం నుంచి కూడా తప్పించుకోవచ్చు అంటారు. ఇతడు కూడా అలాంటి వాడే. చావు చివరి అంచుదాకా వెళ్లి వచ్చాడు. చివరికి అందరూ ఆశ్చర్యపోయే విధంగా కనిపించాడు. ఈ అద్భుతం వెనిజులా ప్రాంతంలో చోటుచేసుకుంది. సరిగ్గా ఎనిమిది రోజుల క్రితం వెనిజులా ప్రాంతంలో భారీ భూకంపం వచ్చింది. ఈ ప్రమాదంలో చాలామంది చనిపోయారు. పెద్ద పెద్ద భవనాలు కూలిపోయాయి. ఆ భవనాల శిధిలాల కింద చాలామంది పడి చనిపోయారు. ఈ […]

Venezuela Earthquake: భూమ్మీద నూకలు ఉంటే.. యముడి పాశం నుంచి కూడా తప్పించుకోవచ్చు అంటారు. ఇతడు కూడా అలాంటి వాడే. చావు చివరి అంచుదాకా వెళ్లి వచ్చాడు. చివరికి అందరూ ఆశ్చర్యపోయే విధంగా కనిపించాడు. ఈ అద్భుతం వెనిజులా ప్రాంతంలో చోటుచేసుకుంది.

సరిగ్గా ఎనిమిది రోజుల క్రితం వెనిజులా ప్రాంతంలో భారీ భూకంపం వచ్చింది. ఈ ప్రమాదంలో చాలామంది చనిపోయారు. పెద్ద పెద్ద భవనాలు కూలిపోయాయి. ఆ భవనాల శిధిలాల కింద చాలామంది పడి చనిపోయారు. ఈ శిధిలాల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ శిధిలాల కింద చాలావరకు మృతదేహాలను వెలికితీస్తున్నారు.

శిధిలాల కింద నుంచి మృత దేహాలను బయటకు తీస్తుండగా ఒక వ్యక్తి సజీవంగా ఉన్నాడు. వాస్తవానికి ఎనిమిది రోజులు ఆహారం.. తాగునీరు లేకపోయినప్పటికీ అతడు బ్రహ్మాండంగా వున్నాడు. పైగా అతడి శరీరం మీద టన్నులకొద్ది శిధిలాలు ఉన్నప్పటికీ అతడు జీవించ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆ స్థాయిలో శిధిలాల కింద పడిపోయినప్పటికీ అతడు జీవించి ఉండడం అక్కడి అధికారులకు మిరాకిల్ మాదిరిగా ఉంది. ఆ వ్యక్తి ఒక షాపింగ్ మాల్ లో సెక్యూరిటీ గార్డ్ గా పని చేసేవాడు. భూకంపం వల్ల శిధిలాలలో కూరుకుపోయాడు. దాదాపు 100 గంటల పాటు 140 టన్నుల శిథిలాలను తొలగించిన తర్వాత అతడిని బయటికి తీశారు.

శిధిలాల కింద ఇంకా మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు వెనిజులా ప్రాంతంలో చోటు చేసుకున్న భూకంపం లో చనిపోయిన వారి సంఖ్య ఏకంగా 2595 కి చేరుకుంది. ఇంకా శిధిలాల తొలగింపు జరుగుతూనే ఉంది. మృతదేహాల వెలికితీత సాగుతూనే ఉంది.. భూకంపం వల్ల వెనుజులా ప్రాంతంలో తీవ్రంగా నష్టం వాటిల్లింది. ప్రపంచ దేశాలు ఆహారం.. ఔషధాలు.. దుస్తులు.. ఇతర సామాగ్రిని పంపిస్తూ ఔదార్యాన్ని చాటుకుంటున్నాయి. ఇప్పటికీ భారత్ కూడా విడతలవారీగా వెనిజులా దేశానికి ఔషధాలు పంపించి తన సేవా తత్పరతను చాటుకుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper