Homeఅంతర్జాతీయంNepal Floods: చైనా ముందుకు రాలేదు.. అమెరికా ఆదుకోలేదు.. ఇప్పటికైనా ఇండియా గొప్పతనాన్ని నేపాల్ గుర్తిస్తుందా

Nepal Floods: చైనా ముందుకు రాలేదు.. అమెరికా ఆదుకోలేదు.. ఇప్పటికైనా ఇండియా గొప్పతనాన్ని నేపాల్ గుర్తిస్తుందా

Nepal Floods: నేపాల్.. మన సరిహద్దుల్లో ఉన్న దేశం.. నేపాల్ దేశానికి మనం అనేక సందర్భాలలో అండగా నిలిచాం. ప్రకృతి విపత్తుల చోటు చేసుకున్నప్పుడు మానవత దృక్పథంతో సహాయం చేశాం. ఆహార పొట్లాలు అందించాం. ఆహార ధాన్యాలు పంపించాం.. ఔషధాలు వితరణగా ఇచ్చాం.. దుస్తులు.. ఇతర విలువైన పదార్థాలు కూడా అందించాం. పాముకు పాలు పోస్తే తిరిగి కాటు వేస్తుంది అన్నట్టుగా.. అన్ని రకాలుగా భారత్ సహాయం చేసినప్పటికీ మన మీద నిప్పులు కుమ్మరిస్తూనే ఉంటుంది నేపాల్. […]

Nepal Floods: నేపాల్.. మన సరిహద్దుల్లో ఉన్న దేశం.. నేపాల్ దేశానికి మనం అనేక సందర్భాలలో అండగా నిలిచాం. ప్రకృతి విపత్తుల చోటు చేసుకున్నప్పుడు మానవత దృక్పథంతో సహాయం చేశాం. ఆహార పొట్లాలు అందించాం. ఆహార ధాన్యాలు పంపించాం.. ఔషధాలు వితరణగా ఇచ్చాం.. దుస్తులు.. ఇతర విలువైన పదార్థాలు కూడా అందించాం.

పాముకు పాలు పోస్తే తిరిగి కాటు వేస్తుంది అన్నట్టుగా.. అన్ని రకాలుగా భారత్ సహాయం చేసినప్పటికీ మన మీద నిప్పులు కుమ్మరిస్తూనే ఉంటుంది నేపాల్. ఇటీవలి ప్రభుత్వాలు భారతదేశం మీద తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. చైనా దేశంతో అంట కాగుతున్నాయి. చివరికి మనకు బద్ధ వ్యతిరేకంగా ఉన్న దేశాలతో నేపాల్ స్నేహాలు కొనసాగిస్తున్నాయి. దీనివల్ల నేపాల్ దేశం మీద మనవాళ్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అసలు నేపాల్ దేశానికి ఎటువంటి సహాయ సహకారాలు అందించకూడదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

తాజాగా నేపాల్ దేశంలో ప్రకృతి విపత్తు చోటుచేసుకుంది. టిబెట్ దేశం నుంచి వచ్చిన వరదనీరు నేపాల్ దేశాన్ని ముంచెత్తింది. అక్కడి నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహించడంతో నేపాల్ సర్వనాశనమైంది. ప్రధాన నగరాలు నీట మునిగిపోయాయి. నదీ పరివాహక ప్రాంతాలు జలవిలయంగా మారిపోయాయి. పెద్ద పెద్ద భవనాలు కూలిపోయాయి. వందనాలు కొట్టుకుపోయాయి. వందల కొద్ది ప్రజలు చనిపోయారు. దాదాపు కోట్లలో నష్టం వాటిల్లింది. ఇప్పటికీ అక్కడి జనజీవనం సాధారణ స్థితికి రాలేదు. రోడ్లు మొత్తం ధ్వంసం అయ్యాయి.

నేపాల్ దుస్థితిని చూసి భారత్ కన్నీరు పెట్టుకుంది. నేపాల్ దేశం లో తీవ్రంగా వరదలు వచ్చిన నేపథ్యంలో మన సైన్యాన్ని అక్కడికి పంపించింది. సహాయ కార్యక్రమాలు చేపడుతోంది. వరదలతో అతలాకుతలమైన నేపాల్ దేశానికి అండగా నిలిచింది. మానవత దృక్పథంతో ఇప్పటికే 10 టన్నుల అత్యవసర సామాగ్రిని.. మందులను పంపించింది. వరద బాధితులకు సంఘీభావం ప్రకటించింది. నేపాల్ దేశ ప్రజలకు అండగా ఉంటామని భారత్ పేర్కొంది. అవసరమైతే మరింత సహాయం చేస్తామని కూడా చెప్పింది. ఇప్పటికైనా నేపాల్ భారతదేశం గొప్పతనాన్ని గుర్తిస్తుందా.. ఈ కష్టకాలంలో చైనా అండగా నిలవలేదు. అమెరికా తోడ్పాటు అందించలేదు. విషం చిమ్ముతున్న సరే నేపాల్ దేశానికి భారత్ తోడ్పాటు అందించింది. ఇప్పటికైనా నేపాల్ భారత్ గొప్పతనాన్ని గుర్తించాలని మన దేశ వాసులు సోషల్ మీడియాలో నేపాల్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper