HomeతెలంగాణRakhi Festival: రాఖీ పండుగకు స్వీట్లు కొంటున్నారా.. ఓసారి ఈ వీడియో చూడండి..

Rakhi Festival: రాఖీ పండుగకు స్వీట్లు కొంటున్నారా.. ఓసారి ఈ వీడియో చూడండి..

Rakhi Festival: రాఖీ పండుగకు తమ అన్న తమ్ముళ్లకు సోదరీమణులు రాఖీలు కట్టడం సర్వసాధారణం. పైగా రాఖీ పండుగ రోజు తమ సోదరులు సుఖ సంతోషాలతో ఉండాలని సోదరీమణులు కోరుకుంటారు.. సోదరులకు రాఖీలు కట్టి.. మిఠాయిలు తినిపిస్తారు. సోదరీమణులకు సోదరులు వారి స్తోమతకు తగ్గట్టుగా కానుకలు అందిస్తూ ఉంటారు. రాఖీ పండుగ సందర్భంగా సోదరులకు అందమైన మిఠాయిలు తినిపించాలని సోదరిమణులు అనుకుంటారు. అందుకోసం ముందుగానే ప్రిపేర్ చేసుకుంటారు. కాకపోతే ఇప్పటి స్పీడ్ యుగంలో చాలామందికి మిఠాయిలు ఇంట్లో […]

Rakhi Festival: రాఖీ పండుగకు తమ అన్న తమ్ముళ్లకు సోదరీమణులు రాఖీలు కట్టడం సర్వసాధారణం. పైగా రాఖీ పండుగ రోజు తమ సోదరులు సుఖ సంతోషాలతో ఉండాలని సోదరీమణులు కోరుకుంటారు.. సోదరులకు రాఖీలు కట్టి.. మిఠాయిలు తినిపిస్తారు.

సోదరీమణులకు సోదరులు వారి స్తోమతకు తగ్గట్టుగా కానుకలు అందిస్తూ ఉంటారు. రాఖీ పండుగ సందర్భంగా సోదరులకు అందమైన మిఠాయిలు తినిపించాలని సోదరిమణులు అనుకుంటారు. అందుకోసం ముందుగానే ప్రిపేర్ చేసుకుంటారు. కాకపోతే ఇప్పటి స్పీడ్ యుగంలో చాలామందికి మిఠాయిలు ఇంట్లో తయారు చేసుకునే వెసలుబాటు లేదు కాబట్టి బయట కొనుగోలు చేస్తున్నారు. అయితే బయట కొనుగోలు చేస్తున్న మిఠాయిలలో నాణ్యత ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో మిఠాయిల దుకాణాల్లో దారుణమైన పదార్థాలు ఉపయోగించి తయారు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

హైదరాబాద్ నగరంలో లెక్కకు మిక్కిలి మిఠాయి దుకాణాలు ఉన్నాయి. ఇందులో పెద్ద పెద్ద సంస్థలు కూడా ఉన్నాయి. అయితే పెద్ద సంస్థల నుంచి మొదలు పెడితే చిన్న దుకాణాల వరకు తయారు చేసే మిఠాయిలలో అత్యంత ప్రమాదకరమైన పదార్థాలు ఉపయోగిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. తాజాగా మేడ్చల్ జిల్లాలోని పోచారం ఐటీ కారిడార్ పరిధిలో మిఠాయి దుకాణాలపై ఎస్ఓటి పోలీసులు దాడులు చేశారు. పోచారం పరిధిలో ఉన్న బాలాజీ స్వీట్ హౌస్ లో ఆరోగ్యానికి హాని కలిగించే సింథటిక్ రంగులు ఉపయోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ స్వీట్ షాప్ నిర్వాహకుడు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన కమల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆ దుకాణంలో తయారుచేసిన మిఠాయిలలో అధిక శాతం సింథటిక్ రంగులు ఉపయోగించాలని పోలీసులు చెబుతున్నారు. స్వీట్ తయారు చేసే ప్రాంతం మొత్తం అపరిశుభ్రంగా ఉందని.. ఎలుకలు.. ఇతర పురుగులు అక్కడ సంచరిస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు.

సింథటిక్ రంగుల వల్ల క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సింథటిక్ రంగులను కేవలం రసాయనాల తయారీలో మాత్రమే ఉపయోగిస్తారని.. అసలు మనుషులు కాదు కదా.. ఎవరికి జంతువులు కూడా సింథటిక్ పదార్థాల తీవ్రతను తట్టుకోలేవని.. అసలు వాటిని వాడకూడదని.. వాడితే ప్రాణాలకు ముప్పని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సాధ్యమైనంతవరకు అటువంటి పదార్థాలతో తయారైన వస్తువులను తినకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అలా కొనుగోలు చేస్తేరోగాలను తెచ్చుకున్నట్టే అని చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper