Meta: అమెరికాలో ఏం జరిగినా సరే ప్రపంచంలో సరికొత్త చర్చ మొదలవుతుంది. ఎందుకంటే అమెరికా అనేది అగ్రరాజ్యం. అమెరికాలో ఎటువంటి సంఘటన చోటుచేసుకున్నా.. ఎటువంటి మార్పు సంభవించినా ఆ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉంటుంది. అందువల్లే ఇప్పుడు అమెరికాలో ఒక కొత్త పోరాటం మొదలైంది. అది కాస్త ప్రపంచ సోషల్ మీడియా దిగ్గజం మెటాకు కష్ట కాలాన్ని తీసుకొచ్చింది.
అమెరికాలో కొద్దిరోజులుగా సోషల్ మీడియా బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాటం మొదలైంది. అమెరికాలో దీనిని ఇప్పుడు రెండవ బిగ్ టొబాకో మూమెంట్ అని పిలుస్తున్నారు. ఈ ఉద్యమం వల్ల ప్రపంచం సోషల్ మీడియా దిగ్గజం మెటా కు ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడిందని తెలుస్తోంది. అమెరికాలోని 29 రాష్ట్రాలు ఈ వ్యవహారం మీద స్పందించాయి. ఈ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారు సంయుక్తంగా వోక్ ల్యాండ్ ఫెడరల్ కోర్టులో మెటా కంపెనీ మీద సంయుక్తంగా ఫిర్యాదు చేశారు. మెటా కంపెనీ రూపొందించిన సోషల్ మీడియా యాప్స్ వల్ల తమ పిల్లలు బానిసలుగా మారిపోయారని మెజారిటీ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.. అత్యధిక సమయాన్ని యూజర్లు మెటా కంపెనీ రూపొందించిన యాప్స్ లో వెచ్చించే విధంగా రూపొందించారని.. వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం.. నిజాలను దాచడం.. వంటి వ్యాపారాన్ని మెటా కంపెనీ చేస్తోందని అమెరికాలోని 29 రాష్ట్రాల
లో ఉన్న పలువురు పిల్లల చెబుతున్నారు.
ఇప్పటికే కాలిఫోర్నియా అటార్నీ జనరల్ మేగన్ మెటా కంపెనీ మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. తల్లిదండ్రుల అనుమతులు లేకుండా పిల్లల సమాచారాన్ని మెటా కంపెనీ సేకరిస్తుందని.. వారిని ఆకర్షించే విధంగా కమర్షియల్ యాడ్స్ రూపొందిస్తోందని.. ఇవి అమెరికన్ చట్టాలను కించపరచడమేనని ఆయన అంటున్నారు. ఇన్ స్టా గ్రామ్ లో పనిచేసే ఉద్యోగులు దానిని ఒక మాదకద్రవ్యంతో పోల్చి చూపించారని మేగన్ పేర్కొన్నారు.. చిన్న వయసులో ఈ యాప్ ఉపయోగించడం మొదలుపెడితే.. విపరీతంగా సంపాదించవచ్చని మెటా ముందుగానే ప్రచారం చేసిందని మేగన్ విమర్శించారు. అయితే ఈ ఆరోపణలపై మెటా కంపెనీ స్పందించింది. అటార్నీ జనరల్ అక్రమ వసూళ్ల కోసమే మా కంపెనీ మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మెటా ఆరోపించింది. అయితే ఈ విచారణ దాదాపు ఆరువారాల పాటు సాగే అవకాశముంది . విచారణకు మెటా అధినేత జూకర్ బర్గ్ హాజరయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఈ కేసులో గనుక మెటా కంపెనీ ఓడిపోతే 19 లక్షల కోట్ల వరకు పరిహారాన్ని చెల్లించాల్సి రావచ్చని అమెరికా మీడియాలో వార్తలు వస్తున్నాయి.