Homeబిజినెస్WhatsApp New Feature : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. యూజర్ల ఇబ్బందులు తొలగిపోయినట్టే..

WhatsApp New Feature : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. యూజర్ల ఇబ్బందులు తొలగిపోయినట్టే..

WhatsApp New Feature : సందేశాలు పంపుకోవచ్చు. ఫోటోలు.. వీడియోలు.. ఫైల్స్ ఇలా ఒక్కటేమిటి సమస్తం పంపించుకోవచ్చు. ఇప్పటిదాకా వాట్సాప్ గురించి మనకు ఇది మాత్రమే తెలుసు. సరిగ్గా కొద్ది రోజుల క్రితం వాట్సాప్ ద్వారా చెల్లింపులు కూడా చేసుకోవచ్చని ఒక ఫీచర్ తీసుకొచ్చారు. ఇక్కడితోనే మెటా కంపెనీ ఆగిపోవడం లేదు.. ఎందుకంటే వాట్సప్ వినియోగం అంతకంతకు విస్తరిస్తున్న నేపథ్యంలో.. యూజర్లు ఇతర యాప్స్ వైపు వెళ్ళిపోకుండా ఉండడానికి మెటా కంపెనీ సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకువచ్చింది. […]

WhatsApp New Feature : సందేశాలు పంపుకోవచ్చు. ఫోటోలు.. వీడియోలు.. ఫైల్స్ ఇలా ఒక్కటేమిటి సమస్తం పంపించుకోవచ్చు. ఇప్పటిదాకా వాట్సాప్ గురించి మనకు ఇది మాత్రమే తెలుసు. సరిగ్గా కొద్ది రోజుల క్రితం వాట్సాప్ ద్వారా చెల్లింపులు కూడా చేసుకోవచ్చని ఒక ఫీచర్ తీసుకొచ్చారు.

ఇక్కడితోనే మెటా కంపెనీ ఆగిపోవడం లేదు.. ఎందుకంటే వాట్సప్ వినియోగం అంతకంతకు విస్తరిస్తున్న నేపథ్యంలో.. యూజర్లు ఇతర యాప్స్ వైపు వెళ్ళిపోకుండా ఉండడానికి మెటా కంపెనీ సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకువచ్చింది. భారత్ బిల్ పేమెంట్ సిస్టం భాగస్వామ్యంతో యూజర్లకు చెల్లింపు కష్టాలను దూరం చేసింది. ఇప్పటివరకు కరెంట్ బిల్లు కట్టాలంటే.. గ్యాస్ బుక్ చేసుకోవాలి అంటే.. డిటిహెచ్ పేమెంట్ చెల్లించాలి అంటే.. ఫాస్టాగ్.. ఇన్సూరెన్స్ వంటి బిల్లులను చెల్లించే సమయంలో రక రకాల యాప్స్ లోకి వెళ్లాల్సి వచ్చేది. ఇకపై ఈ కష్టాలకు మెటా యాజమాన్యం ఫుల్ స్టాప్ పెట్టింది.

భారత్ బిల్ పేమెంట్ సిస్టం ద్వారా కరెంట్.. గ్యాస్.. డిటిహెచ్.. ఫాస్టాగ్.. ఇన్సూరెన్స్ వంటి బిల్లులను చెల్లించే అవకాశాన్ని తీసుకొచ్చింది. అయితే దీనిని ఒకేసారి అందుబాటులోకి తీసుకురాకుండా.. దేశంలో ఉన్న ప్రధాన నగరాల వారీగా అందుబాటులోకి తీసుకొచ్చింది. వచ్చే రోజుల్లో ఐ ఓ ఎస్.. ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తామని మెటా యాజమాన్యం ప్రకటించింది.. దీనికోసం వాట్సాప్ లోకి వెళ్లి హోమ్ స్క్రీన్ మీద ₹ పై క్లిక్ చేసి పేమెంట్స్ చేయవచ్చు.

వాట్సప్ యాజమాన్యం తీసుకురావడం ద్వారా యూజర్ల సంఖ్యను పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే వాట్సాప్ ను ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల కొద్ది యూజర్లు వాడుతున్నారు. చాట్ మాత్రమే కాకుండా.. ఫోటోలు.. వీడియోలు.. ఇతర కీలకమైన సమాచారాన్ని బట్వాడా చేసుకోవచ్చు. అయితే యూజర్లు మరింత సౌలభ్యాలను అందిపుచ్చుకోవడానికి ఈ మార్పులు చేసినట్టు మెటా యాజమాన్యం ప్రకటించింది. అన్ని చెల్లింపులను ఒకే వేదిక కిందకి తీసుకురావడం ద్వారా యూజర్లు మెరుగైన సౌలభ్యాన్ని.. సౌకర్యాలను పొందడానికి ఆస్కారం ఉంటుందని మెటా యాజమాన్యం చెబుతోంది.

పేమెంట్స్ విషయంలో అత్యంత ఖచ్చితత్వాన్ని తీసుకురావడానికి మెటా యాజమాన్యం ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా యూజర్ల సమయం సేవ్ అవుతుంది. గంటల తరబడి ఆయా కార్యాలయాలలో క్యూలో ఉండాల్సిన అవసరం ఉండదు. దీనికి తోడు అదనంగా డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల యూజర్ల చెల్లింపులు కూడా సక్రమంగా జరుగుతాయి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper