Homeబిజినెస్old phone tricks: కొత్త ఫోన్ కొనకండి.. ఈ ట్రిక్స్ తో పాత ఫోన్.. కొత్తగా...

old phone tricks: కొత్త ఫోన్ కొనకండి.. ఈ ట్రిక్స్ తో పాత ఫోన్.. కొత్తగా మారుతుంది..

old phone tricks: కొత్త ఫోన్ కొనాలని చాలామందికి ఉంటుంది.. ప్రస్తుతం వాడుతున్న ఫోన్ నిదానంగా మారడం.. స్టోరేజ్ పెరిగిపోవడం.. బ్యాటరీ త్వరగా ఖాళీ అవ్వడం.. యాప్స్ ఓపెన్ అవడానికి టైం తీసుకోవడం వంటి సమస్యలు వస్తే వెంటనే చాలామంది కొత్త ఫోన్ కొనుగోలు చేయాలని అనుకుంటారు. ముఖ్యంగా బిగ్ బిలియన్ డేస్.. గ్రేట్ ఇండియా సేల్ వంటి ఆఫర్లను ప్రకటించిన సమయంలో చాలామంది కొత్త ఫోన్లను కొనుగోలు చేయాలని అనుకుంటారు. ఎందుకంటే ఆ సంస్థలు భారీగా డిస్కౌంట్లు […]

old phone tricks: కొత్త ఫోన్ కొనాలని చాలామందికి ఉంటుంది.. ప్రస్తుతం వాడుతున్న ఫోన్ నిదానంగా మారడం.. స్టోరేజ్ పెరిగిపోవడం.. బ్యాటరీ త్వరగా ఖాళీ అవ్వడం.. యాప్స్ ఓపెన్ అవడానికి టైం తీసుకోవడం వంటి సమస్యలు వస్తే వెంటనే చాలామంది కొత్త ఫోన్ కొనుగోలు చేయాలని అనుకుంటారు. ముఖ్యంగా బిగ్ బిలియన్ డేస్.. గ్రేట్ ఇండియా సేల్ వంటి ఆఫర్లను ప్రకటించిన సమయంలో చాలామంది కొత్త ఫోన్లను కొనుగోలు చేయాలని అనుకుంటారు. ఎందుకంటే ఆ సంస్థలు భారీగా డిస్కౌంట్లు ప్రకటిస్తాయి. ఆ సమయంలో పాత ఫోన్ మార్చేయాలి అనే ఆలోచన పెరుగుతుంది.

ఫోన్ కొనుగోలు చేయాలనే ఆలోచన మంచిదే అయినప్పటికీ.. కొన్ని సందర్భాలలో మన ఆర్థిక పరిస్థితి సహకరించదు. అలాంటి సమయంలో మన పాత ఫోన్ ను కొత్తగా మార్చవచ్చు. కొత్తగా ఉపయోగించవచ్చు. దానికోసం కొన్ని ట్రిక్స్ ఫాలో అయితే సరిపోతుంది. ఎటువంటి ట్రిక్స్ ఫాలో అయితే మన ఫోన్ కొత్తగా మారుతుందో ఈ కథనంలో చూద్దాం.

ఫోన్ స్లో అవ్వడానికి ప్రధాన కారణం స్టోరేజ్ నిండడం ప్రధానమైనది. ముందుగా వాట్స్అప్.. టెలిగ్రామ్.. ఇన్ స్టా గ్రామ్, ఫేస్బుక్ వంటి యాప్స్ ద్వారా ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు మనకు తెలియకుండానే వస్తాయి. దీనివల్ల విపరీతమైన స్టోరేజ్ ఆక్రమిస్తాయి. అలాంటి సమయంలో settings- storage లోకి వెళ్లి.. ఏ ఫైల్స్ ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తున్నాయో చూడాలి. అందులో అవసరం లేని వీడియోలను.. డౌన్లోడ్లను.. డూప్లికేట్ ఫోటోలను తొలగించాలి. అయితే ముఖ్యమైన ఫోటోలు.. డాక్యుమెంట్లను తొలగించినప్పుడు బ్యాకప్ అనే అంశాన్ని తీసుకోవాలి.

ఫోన్లో నిన్నటి తరబడి ఉపయోగించని యాప్స్ ఉంటే వాటిని తొలగించాలి. ఎందుకంటే కొన్ని యాప్స్ బ్యాగ్రౌండ్ లో రన్ అవుతూ రామ్, బ్యాటరీ, స్టోరేజ్ ని ఆక్రమిస్తాయి.. సెట్టింగ్స్లోకి వెళ్లి యాప్స్ లోకి ప్రవేశించి.. సి ఆల్ యాప్స్ లోకి వెళ్లి.. ఉపయోగం లేని యాప్స్ తొలగించాలి.

సెట్టింగ్స్లోకి వెళ్లి.. యాప్స్ ఐకాన్ క్లిక్ చేసి.. యాప్స్ ఇన్ఫో.. అందులో స్టోరేజీ, క్యాచి క్లిక్ చేసి.. అందులో ఉన్న క్యాచ్ డాటాను మొత్తం క్లియర్ చేయాలి. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి క్లియర్ క్యాచీ మరియు క్లియర్ స్టోరేజ్/ డాటా రెండు ఒకటి కాదు. స్టోరేజ్ క్లియర్ చేస్తే యాప్ లోని లాగిన్ లేదా స్థానిక డాటా తొలగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి తెలియకుండానే క్లియర్ స్టోరేజ్ అనే ఆప్షన్ నొక్కకూడదు.

హోం స్క్రీన్ లో ఎక్కువగా విడ్జెట్స్.. లైవ్ వాల్ పేపర్.. భారీ యానిమేషన్ గనుక ఉంటే అది ఫోన్ మీద అదనపు భారాన్ని కలగజేయవచ్చు.. అందువల్లే అదన విడ్జెట్స్ తొలగించాలి. సాధారణ వాల్ పేపర్స్ ఉపయోగించాలి. దీనివల్ల ఫోన్ మరింత రెస్పాన్సివ్ గా అవుతుంది

చాలామందికి యానిమేషన్ స్పీడ్ తగ్గించడం ఎలాగో తెలియదు. ఇది చాలామంది ఆండ్రాయిడ్ వినియోగదారులకు తెలియదు. డెవలపర్ ఆప్షన్స్ ను ఎనేబుల్ చేసిన తర్వాత.. విండో యానిమేషన్ స్కేల్.. ట్రాన్జక్షన్ యానిమేషన్ స్కేల్.. యానిమేటర్ డ్యూరేషన్ స్కేల్ వంటి సెటింగ్స్ కనిపిస్తాయి. వాటిని 0.5 ఎక్స్ కి తగ్గిస్తే యాప్.. మెనూ మధ్య మార్పులు కచ్చితంగా కనిపిస్తాయి. అయితే ఈ ఫోన్ అసలు ప్రాసెసర్.. పెర్ఫామెన్స్ ను పెంచదు. కాకపోతే ఫోన్ ఉపయోగిస్తున్నప్పుడు వేగంగా రెస్పాండ్ అవుతున్నట్టు అనిపిస్తుంది.

ఒకేసారి చాలా యాప్స్ బ్యాక్ గ్రౌండ్ నడుస్తుంటే రామ్, బ్యాటరీ వినియోగం పెరుగుతుంది. అవసరం లేని యాప్స్ కు బ్యాగ్రౌండ్ ఆక్టివిటీ లేదా బ్యాక్ గ్రౌండ్ డాటా పరిమితం చేయాలి. వాట్సప్.. బ్యాంకింగ్ యాప్స్.. ఈమెయిల్ వంటి ముఖ్యమైన యాప్స్ కు బ్యాగ్రౌండ్ పరిమితులను పెట్టే కంటే ముందు జాగ్రత్తగా ఉండాలి.. లేనిపక్షంలో నోటిఫికేషన్లు కాస్త ఆలస్యంగా రావచ్చు.

పాత ఫోన్ అని సాఫ్ట్వేర్ అప్డేట్ పూర్తిగా నిర్లక్ష్యం చేయకూడదు. కొన్ని అప్డేట్స్ లో బగ్ ఫిక్సస్.. సెక్యూరిటీ ఇంప్రూవ్మెంట్.. బ్యాటరీ ఆప్టిమైజేషన్ వంటి మార్పులు ఉండే ఆస్కారం ఉంది.

కొత్త ఫోన్ మాదిరిగా పాత ఫోన్ ఫాస్ట్ గా పని చేయాలంటే బ్యాటరీ కూడా అత్యంత కీలకమైనది. బ్యాటరీ చాలా పాత పడిపోయి ఉంటే ఫోన్ ఎక్కువసేపు నిలవకపోవచ్చు. చార్జింగ్ కూడా నెమ్మదిగా జరుగుతూ ఉండవచ్చు. అలాంటప్పుడు మీ ఫోన్ బ్యాటరీ హెల్త్ సమాచారం అందుబాటులో ఉంటే చెక్ చేసుకోండి. ఒకవేళ బ్యాటరీ అంతా దెబ్బతింటే కొత్త ఫోన్ కొనడం కంటే పాత బ్యాటరీ రీప్లేస్మెంట్ చౌకైన పరిష్కారం కావచ్చు.

ఇక రోజు ఫోన్ రీస్టార్ట్ చేయాల్సిన అవసరం అందరికీ ఉండదు. కానీ చాలా రోజులుగా రీస్టార్ట్ చేయకుండా ఉపయోగిస్తున్న ఫోన్లో ఒకసారి రీస్టార్ట్ చేయడం ద్వారా తాత్కాలిక బ్యాక్ గ్రౌండ్ ప్రాసెస్ మొత్తం క్లియర్ కావచ్చు. ఫోన్ స్లోగా అనిపించినప్పుడు.. ఇది చాలా సింపుల్గా ప్రయత్నించగలిగే పరిష్కారం.

అన్ని ట్రిక్స్ చేసిన ఫోన్ నిదానంగా ఉంటే ఫ్యాక్టరీ రీసెట్ చివరి మార్గంగా ఉపయోగపడుతుంది. దీనిని చేసే ముందు ఫొటోస్ బ్యాక్అప్.. కాంటాక్ట్స్ బ్యాకప్.. వాట్సప్ బ్యాకప్.. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ బ్యాకప్.. గూగుల్ డాక్యుమెంట్ వివరాలు అన్ని సురక్షితంగా ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఫ్యాక్టరీ రీసెట్ తర్వాత ఫోన్లోని వ్యక్తిగత సమాచారం పూర్తిగా తొలగిపోతుంది.

ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్, అమెజాన్ గ్రేట్ ఇండియా సెల్ వంటి వాటిల్లో కొత్త ఫోన్ పై మంచి డీల్ కనిపించినా.. కేవలం ఫోన్ కొంచెం స్లోగా ఉందని కారణంతో వెంటనే మార్చాల్సిన అవసరం లేదు.

ముందుగా మీ పాత ఫోన్ లో స్టోరేజ్ క్లీనప్.. ఆన్ యూజ్డ్ యాప్స్ రిమూవల్.. క్యాచి క్లీనప్.. సాఫ్ట్వేర్ అప్డేట్.. బ్యాటరీ చెక్ వంటి పనులు ముందుగా చేయాలి. అయినప్పటికీ ఫోన్లో ఇంకా తీవ్రమైన పెర్ఫార్మన్స్ సమస్యలు కనుక ఉంటే.. బ్యాటరీ రీప్లేస్మెంట్ ఖర్చు ఎక్కువగా ఉంటే.. లేదా మీకు కొత్త ఫోన్ లో అవసరమైన కెమెరా.. ప్రాసెసర్.. 5జి, డిస్ ప్లే వంటి ఫీచర్లు పాత ఫోను లేకపోతే.. అప్పుడు కొత్త దాని గురించి ఆలోచించండి.

ఒకసారి ఫోన్ కొనే ముందు పాత ఫోన్ రిఫ్రెష్ చేసి చూడండి. కొన్ని సందర్భాలలో మీ చేతిలో ఉన్న ఫోనే మరోసారి అత్యంత కొత్తగా కనిపించే అవకాశం ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper