Homeలైఫ్ స్టైల్Instagram Addiction: ఇన్ స్టాగ్రామ్ వ్యసనంగా మారిందా.. ఇలా చేసి చూడండి

Instagram Addiction: ఇన్ స్టాగ్రామ్ వ్యసనంగా మారిందా.. ఇలా చేసి చూడండి

Instagram Addiction: సోషల్ మీడియాను విపరీతంగా వాడుతున్న వారిలో ఎక్కువ శాతం ఇంస్టాగ్రామ్ ను చూస్తారు. గతంలో ఫేస్బుక్ ఉండేది.. ఇప్పుడు దాని స్థానాన్ని క్రమక్రమంగా ఇన్ స్టాగ్రామ్ అక్రమిస్తుంది.. ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ అనేవి విపరీతమైన ప్రాచుర్యం పొందాయి. అందువల్లే యూత్ నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ల వరకు ఇన్ స్టాగ్రామ్ విపరీతంగా చూస్తున్నారు. ఇన్ స్టా గ్రామ్ కు మొదట్లో ఈ స్థాయిలో పాపులారిటీ ఉండేది కాదు. ఫోటోలు షేర్ చేసే అవకాశం […]

Instagram Addiction: సోషల్ మీడియాను విపరీతంగా వాడుతున్న వారిలో ఎక్కువ శాతం ఇంస్టాగ్రామ్ ను చూస్తారు. గతంలో ఫేస్బుక్ ఉండేది.. ఇప్పుడు దాని స్థానాన్ని క్రమక్రమంగా ఇన్ స్టాగ్రామ్ అక్రమిస్తుంది.. ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ అనేవి విపరీతమైన ప్రాచుర్యం పొందాయి. అందువల్లే యూత్ నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ల వరకు ఇన్ స్టాగ్రామ్ విపరీతంగా చూస్తున్నారు.

ఇన్ స్టా గ్రామ్ కు మొదట్లో ఈ స్థాయిలో పాపులారిటీ ఉండేది కాదు. ఫోటోలు షేర్ చేసే అవకాశం మాత్రమే ఉండేది. క్రమక్రమంగా వీడియోలు.. రీల్స్ అందుబాటులోకి రావడంతో దీనికి ఇది విపరీతమైన పాపులారిటీ పెరిగిపోయింది. పైగా కేంద్రం టిక్ టాక్ యాప్ ను నిషేధించడంతో ఇన్స్టాగ్రామ్ తన రేంజ్ పెంచుకుంది. దేనినైనా సరే వాడకం ఒక స్థాయి వరకు ఉంటే బాగుంటుంది. అది స్థాయి దాటితే వ్యసనం లాగా మారుతుంది.

చాలామంది నేటి కాలంలో ఇన్ స్టాగ్రామ్ ను అదే పనిగా చూస్తున్నారు. దానివల్ల బానిసలుగా మారిపోతున్నారు. అదేపనిగా ఇన్స్టాగ్రామ్ లో తల దూర్చడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒక పరిమితి ప్రకారం ఇన్ స్టా గ్రామ్ వాడాలని సూచిస్తున్నారు. సాధ్యమైనంతవరకు ఇన్ స్టా గ్రామ్ కు దూరంగా ఉండడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.

ఇన్ స్టాగ్రామ్ లో ప్రొఫైల్ ఓపెన్ చేసిన తర్వాత.. కుడివైపున కల్పించే మూడు లైన్ల పై క్లిక్ చేయాలి. అందులో టైం మేనేజ్మెంట్ ఎంపిక చేసుకోవాలి. డైలీ లిమిట్ కూడా పెట్టుకోవాలి. ఆ తర్వాత సెట్టింగ్స్ లోకి వెళ్లాలి. నోటిఫికేషన్లను ఆఫ్ చేసుకోవాలి. హోమ్ స్క్రీన్ పై యాప్ అనేది కనిపించకుండా పేరు లేని ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేయాలి. అందులో దానిని సేవ్ చేసుకోవాలి. అవసరం లేదు అనుకుంటే యాప్ మొత్తాన్ని డిలీట్ చేయాలి. ప్రత్యామ్నాయంగా పుస్తకాలు చదవాలి. కొత్త స్కిల్స్ పెంపొందించుకోవడం పట్ల దృష్టి పెట్టాలి. దీనివల్ల ఇన్ స్టాగ్రామ్ వ్యసనానికి దూరంగా ఉండవచ్చు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper