Homeఎంటర్టైన్మెంట్Irumudi USA Review: 'ఇరుముడి' యూఎస్ఏ రివ్యూ... టాక్ లీక్.. మాస్ రాజా పరిస్థితేంటంటే..?

Irumudi USA Review: ‘ఇరుముడి’ యూఎస్ఏ రివ్యూ… టాక్ లీక్.. మాస్ రాజా పరిస్థితేంటంటే..?

Irumudi USA Review: మెగాస్టార్ చిరంజీవి తర్వాత సోలోగా ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోగా మారిన నటుడు రవితేజ…ఈ మధ్యకాలంలో ఆయన చేస్తున్న సినిమాలు అతనికి ఏ మాత్రం హెల్ప్ అవ్వడం లేదు. వరుసగా డిజాస్టర్ టాక్ ను ముట్టకట్టుకుంటున్నాయి. అందుకే ఇప్పుడు సినిమాల విషయంలో ఆచితూచి ముందుకు అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఇరుముడి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీ ఇండియాలో రేపు రిలీజ్ అవ్వబోతుంది. ఇక […]

Irumudi USA Review: మెగాస్టార్ చిరంజీవి తర్వాత సోలోగా ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోగా మారిన నటుడు రవితేజ…ఈ మధ్యకాలంలో ఆయన చేస్తున్న సినిమాలు అతనికి ఏ మాత్రం హెల్ప్ అవ్వడం లేదు. వరుసగా డిజాస్టర్ టాక్ ను ముట్టకట్టుకుంటున్నాయి. అందుకే ఇప్పుడు సినిమాల విషయంలో ఆచితూచి ముందుకు అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఇరుముడి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీ ఇండియాలో రేపు రిలీజ్ అవ్వబోతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ ని యూఎస్ఏ లో అయితే స్టార్ట్ చేశారు. మరి దాన్ని బట్టి ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

ముందుగా ఈ మూవీ కథ విషానికి వస్తె కుటుంబాన్ని బాగా చూసుకోవాల్సిన రవితేజ తాగుతూ చిల్లర గొడవలకు దిగడం వాటన్నింటిని చూసిన భార్య తట్టుకోలేక అతని చేత అయ్యప్ప మాల వేయిస్తుంది. తను మాల వేసిన తర్వాత ఏం జరిగింది? తన కూతురు ఎలా మిస్సయింది? తనను ఎలా తిరిగి తీసుకువచ్చాడు అనేదే ఈ సినిమా కథగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాని చూసిన యూఎస్ఏ ప్రేక్షకులు చాలా హ్యాపీ గా ఫీలవుతున్నారు.

రవితేజ ఇంతకుముందు చేసిన సినిమాలకంటే ఈ మూవీ చాలా భిన్నంగా ఉందని ఒక రకంగా రవితేజ నటన ఈ సినిమాలో చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ కి ముందు వచ్చే కొన్ని సన్నివేశాలైతే ప్రేక్షకులను విశేషంగా అలరించాయట. ప్రేక్షకులకు సెకండాఫ్ కూడా బాగా నచ్చింది.

క్లైమాక్స్ విషయంలోనే దర్శకుడు ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేదనే విషయాలను చెబుతున్నప్పటికి ఓవరాల్ గా ఈ సినిమాకి యూఎస్ఏ లో హిట్ టాక్ వచ్చింది. మొత్తానికైతే ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్క యూఎస్ఏ ప్రేక్షకుడు చాలావరకు హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా రవితేజ ఈ సినిమాతో హిట్టు కొట్టేశాడు అంటూ కొంతమంది సినిమా ఇండియాలో రిలీజ్ అవ్వకముందే యూఎస్ఏ నుంచి వాళ్ళ టాక్ నైతే చెబుతున్నారు.

ఇక ఏది ఏమైనా రవితేజ ఈసారి మంచి కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు. కాబట్టి అతని అభిమానులు ఆనందపడే సమయం ఆసన్నమైందనే చెప్పాలి… ఇక ఇండియాలో ఈ మూవీ ఎలాంటి రెస్పాన్స్ ను రాబడుతుందనేది తెలియాలంటే మరికొద్ది గంటల పాటు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper