Homeజాతీయ వార్తలుNarendra Modi: మోడీకే షాక్ ఇచ్చిన మెటా మాతృసంస్థ.. ప్రభుత్వం సీరియస్.. ఏం జరిగిందంటే

Narendra Modi: మోడీకే షాక్ ఇచ్చిన మెటా మాతృసంస్థ.. ప్రభుత్వం సీరియస్.. ఏం జరిగిందంటే

Narendra Modi: నరేంద్ర మోడీ.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ కు నాయకుడు. గడచిన 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా పనిచేస్తున్న సేవకుడు. ఓటమి అనేది లేకుండా.. ఎన్ని అవరోధాలు ఎదురైనా సరే ఎదుర్కొంటు సమర్థవంతంగా పరిపాలన సాగిస్తున్నారు. భారతదేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో ముందు వరసలో నిలబెడుతున్నారు. విద్య.. వైద్యం. మౌలిక వసతులు.. ఇలా అన్ని రంగాలలో భారతదేశంలో అగ్రస్థానంలో నిలపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

నరేంద్ర మోడీ ఇంతటి స్థాయిలో భారతదేశానికి గుర్తింపు తీసుకురావడం కొన్ని దేశాలకు నచ్చడం లేదు.. అందువల్లే తెర వెనుక కుట్రలకు పాల్పడుతున్నాయి. దేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి దుర్మార్గాలకు పాల్పడుతున్నాయి.. ఇటీవల కాలంలో మనదేశంలో జరిగిన ఘటనలు.. దాని వెనుక ఉన్న విదేశీ శక్తులను తెరపైకి తీసుకురావడానికి మన దేశంలో ఉన్న దర్యాప్తు సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి..

విదేశీ శక్తులకు కొంతమంది మనదేశంలో ఉన్నవారు వత్తాసు పలుకుతున్నారు. ఆ సంస్థల లక్ష్యాలకు తగ్గట్టుగా మనదేశంలో పనిచేస్తున్నారు. మనదేశంలో కుట్రలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ చీకటి శక్తుల అసలు రూపాలను బయటికి తీసుకురావడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. మనదేశ ప్రతిష్టను.. మన దేశ సామర్ధ్యాన్ని తక్కువ చేయడానికి విదేశీ సంస్థలు ఎన్నో రకాలుగా కుట్రలకు పాల్పడుతూనే ఉన్నాయి. తాజాగా నరేంద్ర మోడీ లక్ష్యంగా మెటా కంపెనీ చేసిన కుట్ర బయటికి వచ్చింది.

మెటా కంపెనీ ఫేస్బుక్ కు మాతృ సంస్థగా ఉంది. ఈ ఫేస్బుక్లో భారత ప్రధానికి వ్యక్తిగత ఖాతా ఉంది. ఈ ఖాతాను కోట్లాదిమంది అనుసరిస్తూ ఉంటారు. ఇటీవల ప్రధానమంత్రి జనజెడ్ తరాన్ని ఉద్దేశించి సెల్ఫీ వీడియోలను పోస్ట్ చేశారు. ఆ వీడియోలకు విశేషమైన స్పందన లభించింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పోస్ట్ చేసిన ఒక వీడియోను మెటా కంపెనీ బ్లాక్ చేసింది. ఆ తర్వాత వెంటనే రీ పోస్ట్ చేసింది. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. టెక్నికల్ సమస్య వల్ల ఇలా జరిగిందని మెటా కంపెనీ ప్రకటించింది. అయితే దీనిపై కేంద్రం సీరియస్ గా ఉంది. మెటా కంపెనీకి నోటీసులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా విశేషమైన ఆదరణ పొందిన రాజకీయ నాయకులలో నరేంద్ర మోడీ ముందు వరుసలో ఉంటారు. ఈయనకు ఫేస్బుక్లో కోట్లాదిమంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ స్థాయిలో విశేషమైన ప్రాచుర్యం పొందిన నరేంద్ర మోడీ స్థాయిని తగ్గించడానికి మెటా కంపెనీ కుట్ర చేసిందని బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు. అందువల్లే నరేంద్ర మోడీ వీడియోను బ్లాక్ లో పెట్టిందని.. ఆ తర్వాత మళ్లీ రీ స్టోర్ చేసిందని గుర్తు చేస్తున్నారు. మెటా కంపెనీ తీరు భారత ప్రధానమంత్రి గౌరవానికి భంగం కలిగించే విధంగా ఉందని.. ఇటువంటి చర్యలను ఉపేక్షించేది లేదని బిజెపి నేతలు అంటున్నారు. దీనిపై కేంద్రం నోటీసులు పంపించే ఆలోచన చేస్తుందని సమాచారం. దీనికి మెటా కంపెనీ ఏవిధంగా బదులిస్తుందో చూడాలి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper