Muhammad Ali Jinnah: భారత దేశాన్ని గిచ్చడమో.. గిల్లడమో చేయకపోతే పాకిస్తాన్‌కు నిద్ర పట్టదు.. ముద్ద దిగదు. తిన్నది అరగదు. ఏదో ఒకరకంగా భారత్‌ను కెలకాలి అనేది ఆ దేశానికి వ్యసనం. యుద్ధం చేయలేని ఉగ్రవాదాన్ని ఎగుమతి చేయడం కష్టమవుతోంది. భారత దేశంలో బాబు పేలుళ్లు నిర్వహించడం కష్టం అవుతోంది. అంతర్గతంగా సమస్యలు పెరుగుతున్నాయి. పాకిస్తాన్ చేయగలిగింది కేవలం ఒకే ఒక్క రంగంలో మనకన్నా పైచేయి సాధించగలిగేది సమాచార యుద్ధం మాత్రమే. దీనిలో మాత్రమే పాకిస్తాన్‌కన్నా మనం వెనుకబడి ఉన్నాం. తాజాగా దేశ ఇటీవల తన అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన నిషాన్–ఎ–ఇంతియాజ్‌ను ఇద్దరు భారతీయ పార్సీ వైద్యులకు మరణానంతరం ప్రదానం చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం 1946–47లో జరిగిన ఒక వైద్య రహస్యం చుట్టూ తిరుగుతోంది.
జిన్నా ఆరోగ్య సమస్య దాచి..
ముహమ్మద్ అలీ జిన్నా 1930ల నుంచే క్షయతో బాధపడుతున్నారు. అప్పటి వైద్య పరిజ్ఞానంతో ఇది నయం కాని వ్యాధి. 1946లో ముంబైకి చెందిన ఇద్దరు పార్సీ వైద్యులు డాక్టర్ జాల్ రతన్‌జీ పటేల్(ఫిజీషియన్), డా. ధాయ్‌భో–కూ(రేడియాలజిస్) జిన్నా ఎక్స్–రేలను పరిశీలించారు. వారి నిర్ధారణ ప్రకారం వ్యాధి చాలా అధునాతన దశలో ఉంది. ఆయనకు ఒకటి–రెండు సంవత్సరాలకు మించి ఆయుష్షు ఉండకపోవచ్చని అంచనా వేశారు. ఈ విషయాన్ని జిన్నాకు తెలిపారు. దీంతో జిన్నా ఈ విషయాన్ని పూర్తిగా రహస్యంగా ఉంచాలని వారిని కోరారు. వైద్యులు కూడా వృత్తి రహస్యం పాటించి, ఆ సమాచారాన్ని బయటకు పెట్టలేదు. ఈ రహస్యం జిన్నా సోదరి ఫాతిమా జిన్నా, కొద్దిమంది అంతరంగికులకు మాత్రమే తెలుసు.
విభజనపై ప్రభావం..
ఈ రహస్యం విభజనకు ఎలా సంబంధం కలిగి ఉందని చరిత్రకారులు చర్చిస్తారు. ఆ సమయంలో లార్డ్ మౌంట్‌బ్యాటన్, నెహ్రూ, గాంధీ వంటి నాయకులకు జిన్నా ఆరోగ్యం గురించి తెలిసి ఉంటే, విభజనకు సంబంధించిన చర్చలు వేరే దిశలో సాగి ఉండేవి కావచ్చని కొందరు అభిప్రాయపడతారు. మౌంట్‌బ్యాటన్ తర్వాత కాలంలో ఇలా అన్నట్లు కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఆయనకు జిన్నా తీవ్ర అనారోగ్యం తెలిసి ఉంటే దేశ విభజన కొన్ని నెలలు ఆలస్యం చేసి ఉండేవాడు. 1947 ఆగస్టు 14న పాకిస్తాన్, 15న భారత్ స్వాతంత్య్రం పొందాయి. జిన్నా 1948 సెప్టెంబర్ 11న మరణించారు. స్వాతంత్య్రం తర్వాత కేవలం 13 నెలలకే.
పాకిస్తాన్ ఇప్పుడు పురస్కారం ఎందుకు
2026 ఆగస్టు 14న పాకిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్లానింగ్ మంత్రి అహ్సాన్ ఇక్బాల్ ఈ నామినేషన్‌ను ప్రకటించారు. వైద్యులు ‘‘క్వయిద్–ఎ–ఆజం టెర్మినల్ ఇల్‌నెస్ రహస్యాన్ని నమ్మకంగా కాపాడారు’’ అని ఆయన పేర్కొన్నారు. ఇది ‘‘నిశ్శబ్దమైన కానీ అసాధారణ సేవ’’ అని అభివర్ణించారు. అవార్డు 2027 మార్చిలో అధికారికంగా ప్రదానం చేయబోతున్నారు. అయితే ఇద్దరు వైద్యులు చాలా కాలం క్రితమే మరణించారు. వారి వారసులు స్పష్టంగా లేకపోవడం వల్ల ఈ పురస్కారం ప్రధానంగా చారిత్రక గుర్తింపు స్వరూపం.
సమాచార యుద్ధం..
పాకిస్తాన్ ప్రస్తుతం అంతర్గత సవాళ్లు, ఆర్థిక ఒత్తిళ్లు, రాజకీయ అస్థిరతల మధ్య ఉంది. ఇటువంటి చారిత్రక అంశాలను తెరపైకి తీసుకురావడం ద్వారా దేశీయ దృష్టిని బయటికి మళ్లించడం, భారత్‌పై మానసిక ఒత్తిడి సృష్టించడం కోసమే అవార్డు ప్రకటించిది. అయితే వైద్యుల దృష్టికోణం నుంచి చూస్తే వారు రోగి గోప్యతను కాపాడారు. ఇది వైద్య నీతికి అనుగుణం. రాజకీయ పరిణామాలు వారి ఉద్దేశం కాదు.
ఈ సంఘటన రెండు పాఠాలు నేర్పుతుంది. మొదటిది వైద్య రహస్యం ప్రాముఖ్యత. రెండోది చరిత్రను ప్రస్తుత రాజకీయ అవసరాలకు అనుగుణంగా వ్యాఖ్యానించడం సాధారణం.