Partition Victims Tribute: కొద్దిరోజులుగా రాహుల్ గాంధీ మీడియాలో ప్రముఖంగా కనిపిస్తున్నారు. సోషల్ మీడియాలో విస్తృతంగా దర్శనమిస్తున్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని చేతిలో పెట్టుకొని.. అడ్డగోలుగా ఓటర్ల సంఖ్య పెంచి.. దొంగ ఓట్లతో గెలిచిందని కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ ఆరోపిస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే ఆధారాలు కూడా చూపిస్తున్నారు. దీంతో ఆయన గురించి మీడియాలో విపరీతంగా చర్చ నడుస్తోంది. సోషల్ మీడియాలో అతని పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే దీనిపై బిజెపి గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. ఎన్నికల సంఘం కూడా రాహుల్ గాంధీకి ఇటీవల నోటీసులు ఇచ్చింది. దీనిపై రాహుల్ గాంధీ ఎలా స్పందిస్తారు.. ఎన్నికల సంఘానికి రాహుల్ గాంధీ సమాధానం ఇస్తారనేది చూడాల్సి ఉంది.
Also Read: జగన్ కు ఘోర అవమానం.. పులివెందుల, ఒంటిమిట్ట టీడీపీ కైవసం!
రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిశ్శబ్దంగానే ఉన్నారు. అమిత్ షా, ఇంకా మిగతా కేంద్ర పెద్దలు కూడా నిశ్శబ్దాన్ని ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో నరేంద్ర మోడీ ఉన్నట్టుండి గురువారం ఒక కీలక ట్విట్ చేశారు. 1947లో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన విభజన నేపథ్యంలో జరిగిన విధ్వంసం పై నరేంద్ర మోడీ కీలక విషయాలను మరోసారి బయటపెట్టారు. ” ఇది మన దేశ చరిత్రలో అత్యంత విషాదకరమైన అధ్యాయం. విభజన సమయంలో చాలామంది ఈ దేశ ప్రజల ప్రాణాలు కోల్పోయారు. ఊహకు అందని నష్టాన్ని చవి చూశారు. వారి ధైర్యాలను.. సాహసాలను గౌరవించుకోవాలి. దేశాన్ని ఐక్యంగా ఉంచాల్సిన సందర్భం ఇది. సామరస్యంగా నడిపించాల్సిన సమయం ఇది. ఇవన్నీ కూడా మన బాధ్యతలు. ఈరోజు నాటి రోజులను మననం చేసుకోవాలి.#partitionHorrorsRemembranceDay అనే యాష్ ట్యాగ్ ను షేర్ చేశారు.
Also Read: కుప్పం లెక్కను పులివెందులలో సరిచేసిన బాబు!
దీనికంటే ముందు సోనియాగాంధీ గురించి ఒక కీలక విషయాన్ని బిజెపి సోషల్ మీడియా బయటపెట్టింది. ఇటలీ దేశస్తురాలైన సోనియాగాంధీకి మనదేశంలో ఓటు హక్కు ఎలా వచ్చింది అంటూ.. కీలక ప్రశ్నను బయటపెట్టింది. అంతేకాదు రాహుల్ గాంధీ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని.. ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసుకు ఇంతవరకు సమాధానం చెప్పలేకపోయారని.. అటువంటి వ్యక్తికి ప్రశ్నించే హక్కు లేదని.. ఆయన ప్రశ్నలో నిజాయితీ లేదని బిజెపి నాయకులు అంటున్నారు. ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసుకు రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని బిజెపి నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
भारत आज विभाजन विभीषिका स्मृति दिवस के माध्यम से देश के बंटवारे की त्रासदी को याद कर रहा है। यह हमारे इतिहास के उस दुखद अध्याय के दौरान असंख्य लोगों द्वारा झेले गए दुख और पीड़ा को स्मरण करने का दिन है। यह दिन उनके साहस और आत्मबल को सम्मान देने का भी अवसर है। इन्होंने अकल्पनीय…
— Narendra Modi (@narendramodi) August 14, 2025