Mohan Babu and Manchu Vishnu : మంచు విష్ణు హిట్ కొట్టి దశాబ్దాలు అవుతుంది. ఆయన కెరీర్లో విజయం సాధించిన చిత్రాలు చాలా తక్కువ. విష్ణుతో మూవీ చేసేందుకు నిర్మాతలు ముందుకు రావడం లేదు. ఈ కారణంగా సొంత బ్యానర్ లో ఆయన సినిమాలు చేస్తున్నాడు. జిన్నా టైటిల్ తో మంచు విష్ణు ఒక చిత్రం చేశారు. 2022లో విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కమర్షియల్ గా మాత్రం డిజాస్టర్ అయ్యింది. సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటించారు. జిన్నా చిత్రానికి కథను నాగేశ్వరరెడ్డి అందించారు. ఇషాన్ సూర్య దర్శకత్వం వహించాడు.
జిన్నా కనీసం కోటి రూపాయల వసూళ్లు రాబట్టలేకపోయింది. కనీసం సన్నీ లియోన్ కి ఇచ్చిన రెమ్యూనరేషన్ కూడా రాలేదని యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. అయితే తమ చిత్రాల మీద కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్, ట్రోల్స్ చేయడం వలన జన్నా ఆడలేదని మంచు విష్ణు అభిప్రాయపడ్డాడు. అయితే జిన్నా ఫెయిల్యూర్ కి తండ్రి మోహన్ బాబు కారణం అయ్యాడని రచయిత కోనా వెంకట్ తాజాగా తెలియజేశాడు.
Also Read : మంచు ఫ్యామిలీ లో అంతర్యుద్ధం నడుస్తుందా..? విష్ణు పెట్టిన ఆడియో కి కౌంటర్ వేసిన మనోజ్…
ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మోహన్ బాబు చేసిన సన్ ఆఫ్ ఇండియా మూవీ ఎఫెక్ట్ జిన్నా పై పడింది అన్నారు. జిన్నా మంచి చిత్రం. ఆ చిత్రానికి రావాల్సినంత గౌరవం, గుర్తింపు దక్కలేదు. ఉన్న వనరుల్లో ఒక మంచి చిత్రం చేశాము. కానీ మోహన్ బాబు నటించిన సన్ ఆఫ్ ఇండియా.. జిన్నా ఫలితాన్ని దెబ్బ తీసింది. సన్ ఆఫ్ ఇండియా ప్లాప్ ఎఫెక్ట్ జిన్నా మీద కూడా పడింది. నేను మోహన్ బాబు అన్నయ్యకు చెప్పాను. సన్ ఆఫ్ ఇండియా మీరు చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్. ఐడియా లెవల్ నుండి ఆ ప్రాజెక్ట్ తేడా పడిందని చెప్పాను.
జిన్నా మాత్రం అలాంటి చిత్రం కాదు. క్వాలిటీ ఉన్న మూవీ. కానీ ఫలితం దక్కలేదు అన్నాడు. జిన్నా చిత్రానికి కోనా వెంకట్ మాటల రచయితగా పని చేశాడు. 2022 ఫిబ్రవరిలో సన్ ఆఫ్ ఇండియా విడుదలైంది. అదే ఏడాది అక్టోబర్ లో జిన్నా వచ్చింది. సన్ ఆఫ్ ఇండియా చిత్రానికి కనీసం పోస్టర్స్ ఖర్చు కూడా రాలేదు. మంచు హీరోల సినిమాలకు వెళ్లడం దండగ అని ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు. జిన్నాకు పాజిటివ్ టాక్ వచ్చినా ఆడియన్స్ పట్టించుకోలేదు.
Also Read : డ్యామేజ్ కంట్రోల్ కోసం మరింత దిగజారిపోయిన మంచు కుటుంబం.. వైరల్ గా మారిన మరో వీడియో