Homeఅంతర్జాతీయంChina Secret Weapon: దోమ కంటే చిన్నది.. చైనా సీక్రెట్ వెపన్.. భారత్ లో గుబులు..

China Secret Weapon: దోమ కంటే చిన్నది.. చైనా సీక్రెట్ వెపన్.. భారత్ లో గుబులు..

China Secret Weapon: ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్ లో కొంత ప్రాంతాన్ని తమది అని చైనా చెబుతోంది.. ఈశాన్య రాష్ట్రాలలో నిత్యం ఏదో ఒక కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది.. పాకిస్తాన్ దేశంతో దోస్తీ చేస్తూ.. మన సరిహద్దుల్లో మంటలు పెడుతుంది. ఇక్కడితోనే ఆగిపోవడం లేదు.. అంతర్జాతీయ వేదికలలో కూడా మనమీద నిత్యం మట్టిపోస్తూనే ఉంది. మనం చేసే ప్రతి పనిలో అడ్డు తగులుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉంది. ఇక్కడితోనే చైనా ఆగిపోలేదు. దోమ కంటే […]

China Secret Weapon: ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్ లో కొంత ప్రాంతాన్ని తమది అని చైనా చెబుతోంది.. ఈశాన్య రాష్ట్రాలలో నిత్యం ఏదో ఒక కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది.. పాకిస్తాన్ దేశంతో దోస్తీ చేస్తూ.. మన సరిహద్దుల్లో మంటలు పెడుతుంది. ఇక్కడితోనే ఆగిపోవడం లేదు.. అంతర్జాతీయ వేదికలలో కూడా మనమీద నిత్యం మట్టిపోస్తూనే ఉంది. మనం చేసే ప్రతి పనిలో అడ్డు తగులుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉంది. ఇక్కడితోనే చైనా ఆగిపోలేదు.

దోమ కంటే చిన్న పరిమాణంలో..

నేటి ఆధునిక కాలంలో యుద్ధాలు మొత్తం కేవలం డ్రోన్ల ద్వారానే జరుగుతున్నాయి. మానవ రహితంగా.. అత్యంత ఆధునికమైన మిస్సయిల్స్.. డ్రోన్లను యుద్ధాలలో వాడుతున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ కూడా పాకిస్తాన్ మీద మిస్సైల్స్ ఉపయోగించింది. డ్రోన్లను వాడింది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం.. ఇటీవలి అమెరికా, ఇరాన్ యుద్ధంలో కూడా డ్రోన్లను ఉపయోగించారు.. ఆయా దేశాలు తమ సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా డ్రోన్లను రూపొందించాయి.

కొన్ని డ్రోన్లు రాడార్ పరిధిలో ఉండవు. వాటి వల్ల జరిగే నష్టం కూడా అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఆ డ్రోన్లను పడగొట్టడానికి అత్యంత శక్తివంతమైన మిసైల్స్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు మన కంటికి కనిపించిన పరిమాణంలో డ్రోన్ ఉండేది. అయితే ఇప్పుడు చైనా సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఏకంగా దోమ కంటే చిన్న పరిమాణంలో ఉన్న డ్రోన్ రూపొందించింది. ఇది 0.6 సెంటీమీటర్ పరిమాణంలో ఉంటుంది. ఈ డ్రోన్ ద్వారా శత్రు దేశాల కదలికలు.. కీలకమైన స్థావరాలు.. ఆదేశ భౌగోళిక వ్యవహారాలు మొత్తం చిత్రీకరించవచ్చు. యుద్ధం వంటి పరిణామం ఏర్పడినప్పుడు.. ఆ డ్రోన్ రూపొందించిన చిత్రాలను బేరిజు వేసుకుంటూ దాడులు చేయవచ్చు. కొన్ని సందర్భాలలో భౌగోళిక ఆక్రమణలకు కూడా పాల్పడవచ్చు.

చైనా దీనిని తయారు చేయడానికి ప్రధాన కారణం భారత్. ఎందుకంటే కొంతకాలంగా ఈశాన్య రాష్ట్రాలలో చైనా చేస్తున్న ఆకృత్యాలు మామూలుగా లేవు. అరుణాచల్ ప్రదేశ్ లో కొంత భాగం తమ భూభాగంలో ఉందంటూ చైనా వాదిస్తోంది. అంతేకాదు అరుణాచల్ ప్రదేశ్ లోని భూభాగం కలుపుకుంటూ ఒక మ్యాప్ కూడా రూపొందించింది.. దీనిపై భారతదేశ అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోవైపు తైవాన్ తో చైనా యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉంది. అందువల్లే ఈ తరహాలో డ్రోన్లు రూపొందించినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై చైనా అధికారికంగా ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయలేదు..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper