Homeక్రీడలుక్రికెట్‌Pakistan Defence Budget: మింగ మెతుకు లేకున్నా.. 90 వేల కోట్లు.. పాకిస్తాన్ మారదు గాక...

Pakistan Defence Budget: మింగ మెతుకు లేకున్నా.. 90 వేల కోట్లు.. పాకిస్తాన్ మారదు గాక మారదు

Pakistan Defence Budget: ఇండియా, పాకిస్తాన్ ఒకేసారి ఏర్పడ్డాయి. కానీ అభివృద్ధిలో, ఇతర విషయాలలో భారత్ ఎక్కడికో వెళ్ళిపోయింది. పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదులతో సహవాసం చేస్తూ, ఉగ్రవాద దేశంగా మారిపోయింది. సరైన రోడ్లు ఉండవు. వర్షం వస్తే.. కరువు ఇబ్బంది పెడితే.. భూకంపాలు నిండా మునిగేలా చేస్తే.. ఇలా ఏ ప్రకృతి విపత్తు వచ్చినప్పటికీ పాకిస్తాన్ జస్ట్ చేతులెత్తేయడమే. పౌరులకు భద్రత ఉండదు. ఆడవాళ్లకు రక్షణ ఉండదు. కనీసం తినడానికి తిండి గింజలు కూడా దొరకవు. ప్రజలే […]

Pakistan Defence Budget: ఇండియా, పాకిస్తాన్ ఒకేసారి ఏర్పడ్డాయి. కానీ అభివృద్ధిలో, ఇతర విషయాలలో భారత్ ఎక్కడికో వెళ్ళిపోయింది. పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదులతో సహవాసం చేస్తూ, ఉగ్రవాద దేశంగా మారిపోయింది. సరైన రోడ్లు ఉండవు. వర్షం వస్తే.. కరువు ఇబ్బంది పెడితే.. భూకంపాలు నిండా మునిగేలా చేస్తే.. ఇలా ఏ ప్రకృతి విపత్తు వచ్చినప్పటికీ పాకిస్తాన్ జస్ట్ చేతులెత్తేయడమే. పౌరులకు భద్రత ఉండదు. ఆడవాళ్లకు రక్షణ ఉండదు. కనీసం తినడానికి తిండి గింజలు కూడా దొరకవు. ప్రజలే తమ దరిద్రాన్ని తిట్టుకుంటూ జీవిస్తూ ఉంటారు.

మింగ మెతుకు లేకపోయినప్పటికీ మీసాలకు సంపెంగ నూనె అన్నట్టుగా.. పాకిస్తాన్ పరిస్థితి ఉంది. ఆ మధ్య భారత్ చేసిన దాడుల్లో ఉగ్రవాద శిబిరాలు నేల కూలిపోయాయి. అయితే వాటి మరమ్మతుల కోసం.. కొత్త వాటిని నిర్మించడానికి పాకిస్తాన్ ప్రభుత్వం ఏకంగా భారీగా సహాయం చేసింది. ప్రభుత్వ ఖజానా నుంచి ఉగ్రవాదులకు దండిగా డబ్బులు ఇచ్చింది. ప్రజల విషయంలో మాత్రం పాకిస్తాన్ ప్రభుత్వం ఎలాంటి ఉదారత చూపించదు.

పాకిస్తాన్ ప్రజల భద్రతను పక్కనపెట్టి.. మెరుగైన సౌకర్యాల కల్పన విషయాన్ని దూరం పెట్టి.. కేవలం రక్షణ శాఖకు మాత్రమే బడ్జెట్ కేటాయించుకుంటూ పోతుంది. తాజాగా కూడా 90 వేలకు పైగా కోట్లను రక్షణ శాఖకు కేటాయిస్తూ ప్రకటించింది. పైగా ఇందులో ఏమంటుంది అంటే.. భారత్ నుంచి ముప్పు ఉంది కాబట్టి.. సరిహద్దుల్లో రక్షణ కోసం ఖర్చు చేస్తున్నామని చెప్పుకొచ్చింది. కానీ ఇక్కడే పాకిస్తాన్ ఒక తప్పు చేస్తోంది. భారత్ కేటాయిస్తున్న కేటాయింపులు చూసి.. తను కూడా రక్షణ శాఖకు భారీగా వెచ్చిస్తున్నామని చెప్పుకొచ్చింది.

భారత రక్షణ శాఖ బడ్జెట్ ఇప్పటికే 7 లక్షల కోట్లకు చేరుకుంది. దానిని చేరుకోవాలని .. భారతదేశానికి మించి ఖర్చు పెట్టాలని ఎప్పటినుంచో పాకిస్తాన్ అనుకుంటున్నది. కానీ ఆ దేశానికి అంత సన్నివేశం లేదు. డిఫెన్స్ మాత్రమే కాదు.. అన్ని రంగాలలోనూ కేటాయింపులు చూసుకుంటే పాకిస్తాన్ ఇంకో వంద జన్మలు ఎత్తినా సరే భారతదేశానికి సాటి రాదు. పులి మాదిరిగా ఉండాలని నక్క వాతులు పెట్టుకుంటే.. కాలేది నక్క శరీరమే. పులికి ఏమీ కాదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper