spot_img
Homeఅంతర్జాతీయంChamoy thipyaso: జీవిత ఖైదు కాదు.. ఏకంగా 1,41,078 ఏళ్లు జైలు శిక్ష.. ఎవరికో తెలుసా?

Chamoy thipyaso: జీవిత ఖైదు కాదు.. ఏకంగా 1,41,078 ఏళ్లు జైలు శిక్ష.. ఎవరికో తెలుసా?

Chamoy thipyaso: మనిషి అన్నాక తప్పులు చేయడం సహజం. ఈ తప్పులకు కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఏవో చిన్న తప్పులకు అయితే పెద్దగా శిక్ష ఉండదు. కానీ పెద్ద తప్పులు చేస్తే మాత్రం ఏళ్లు లేదా జీవిత ఖైదు శిక్ష కూడా వేస్తుంటారు. ఎంతో మంది తప్పులు చేస్తూ.. జైలుకు వెళ్తుంటారు. అయితే వారి తప్పును బట్టి ఎన్ని ఏళ్లు జైలు శిక్ష వేయాలి? లేదా జరిమానా విధించాలని నిర్ణయించారు. ఎవరిది అయిన చిన్న తప్పు ఉంటే జరిమానాతో వదిలేస్తారు. కానీ సరిదిద్దుకోలేని తప్పు ఉంటే మాత్రం వారికి జీవితాంతం శిక్ష వేస్తుంటారు. ఇలా జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న వారు ఎంతో మంది ఈ ప్రపంచంలో ఉన్నారు. అయితే ఏదైనా తప్పు చేస్తే ఒకటి, రెండు, మూడు, జీవిత ఖైదు శిక్ష అనేది వేస్తుంటారు. కానీ ఓ మహిళ చేసిన తప్పుకు ఆమెకు 1,41,078 ఏళ్లు జైలు శిక్ష విధించారు. ఇంతకీ ఎవరీ ఆ మహిళ? అసలు ఆమె చేసిన తప్పు ఏంటి? ఎందుకు ఇన్నేళ్లు జైలు శిక్ష విధించారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

థాయ్‌లాండ్‌కి చెందిన ఓ మహిళలకు 1,41,078 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించారు. ఎందుకంటే ఆమె ఎందరో ప్రజలను మోసం చేసి డబ్బు లాక్కోంది. థాయ్‌లాండ్‌కు చెందిన చమోయ్ థిప్యాసో చిట్ ఫండ్ పథకం ప్రారంభించింది. చమోయ్ ఫండ్ అనే చిట్ ఫండ్ స్కీమ్‌ను స్టార్ట్ చేసి.. అందులో పెట్టుబడి పెట్టాలని ప్రజలను సూచించింది. ఇందులో డబ్బులు పెడితే రాబడి అధికంగా వస్తుందని షేర్లు చూపించి అందరిని నమ్మించింది. దీంతో దాదాపుగా 16000 మంది అందులో పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టారు. దాదాపుగా 200 నుంచి 300 మిలియన్ల డాలర్ల డబ్బును ప్రజల నుంచి సంపాదించింది. అయితే ఈ స్కీమ్ కేవలం థాయ్‌లాండ్‌లోనే కాకుండా బయట దేశాల్లో కూడా తీసుకొచ్చింది. ఇండియాలోని కేరళలో కూడా ఈ స్కీమ్ బాధితులు చాలా మంది ఉన్నారు.

ఇలా వేల మంది ప్రజలను మోసం చేసి భారీ మొత్తంలో డబ్బును సంపాదించుకుంది. చాలా మంది ప్రజలు డబ్బులు కట్టి మోసపోయారు. పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని ఆశ చూపించడంతో మధ్య తరగతి, పేద తరగతి వారు కూడా ఉన్నారు. వీరందరూ పెద్ద మొత్తంలో డబ్బును పొగోట్టుకున్నారు. ఇంత మోసం చేసినందుకు థాయ్‌లాండ్ ప్రభుత్వం ఆమెకు 1,41,078 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. చమోయ్ థిప్యాసో ప్రభుత్వ చమురు కంపెనీ అయిన థాయ్‌లాండ్‌లోని పెట్రోలియం అథారిటీలో ఉద్యోగిగా పనిచేసేది. వైమానిక దళంలో తన కనెక్షన్‌లను ఉపయోగించి ఈ స్కీమ్‌‌ను ప్రారంభించింది. ఇందులో కేవలం సామాన్య మనుషులే కాకుండా థాయిలాండ్ రాజ కుటుంబంతో పాటు అనేక మంది సైనిక వ్యక్తులు కూడా పెట్టుబడి పెట్టారు. ఇలా ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఈ పథకాన్ని ప్రారంభించి ప్రజలను మోసం చేసినందుకు ఆమెకు ఇన్నేళ్ల పాటు జైలు శిక్ష విధించారు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Kajal Aggarwal

Kajal Aggarwal: అతను ఎవ్వరూ లేని సమయం చూసి నా రూమ్ లోకి ప్రవేశించాడు అంటూ కాజల్ అగర్వాల్...

Kajal Aggarwal: సినీ ఇండస్ట్రీ లోకి రావాలని, సక్సెస్ అవ్వాలని ఎంతో మందికి ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఇండస్ట్రీ లోకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అమ్మాయిల తల్లిదండ్రులు...
Nara Rohith

Nara Rohith: ‘ఆదర్శ కుటుంబం’ నుండి నారా రోహిత్ లుక్ విడుదల.. ఈ రేంజ్ లో ఉన్నాడేంటి..

Nara Rohith: 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత , విక్టరీ వెంకటేష్ చేస్తున్న చిత్రం 'ఆదర్శ కుటుంబం'. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా...
Dhruv Vikram:

Dhruv Vikram: కోటి రూపాయిలు తీసుకొని మోసం చేసిన ధృవ్ విక్రమ్.. ఫిర్యాదు నమోదు.. పూర్తి వివరాలు మీకోసం..

Dhruv Vikram: గత కొద్దిరోజుల నుండి తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ పేరు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో మారుమోగిపోతుంది. గత కొంతకాలం నుండి...
Telangana ACB

Telangana ACB: తెలంగాణ ఏసీబీ: పాముల వేట ముగిసింది.. అనకొండల హంట్ మొదలవుతోంది..

Telangana ACB: పుట్టల నుంచి పాములు బయటికి వస్తున్నాయి. ఆ పాముల వేట కూడా కొద్ది రోజులుగా ఆటంకం అనేది లేకుండా సాగుతోంది. అయితే ఇప్పుడు పాముల గుట్టు తెలిసిపోయింది. పాములు...
Ravi Prakash

Ravi Prakash: టీవీ9ను కొట్టేసిన రవి ప్రకాష్..

Ravi Prakash: మెరుగైన సమాజం అనే ట్యాగ్ లైన్ తో సరిగా దశాబ్దాల క్రితం రవి ప్రకాష్ శ్రీ ని రాజుతో కలిసి టీవీ9 అనే మహా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు....
Oktelugu Epaper