Thai Man: 17 సంవత్సరాల క్రితం వారిద్దరికీ వివాహం జరిగింది. వివాహం జరిగిన మరుసటి సంవత్సరానికి ఒక బాబు పుట్టాడు. ప్రస్తుతం ఆ బాలుడి వయసు 16 సంవత్సరాలు. స్థానికంగా ఉన్న పాఠశాలలో చదువుతున్నాడు. ఆ దంపతుల వైవాహిక జీవితం మొదట్లో బాగానే ఉండేది. ఆ తర్వాతే వారిద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. సంసారం రోడ్డున పడుతుందని.. కుమారుడు ఇబ్బంది పడతాడని భావించిన అతడు సర్దుకుపోయాడు. అయినప్పటికీ ఆ భార్య తన ప్రవర్తనను మార్చుకోలేదు. పైగా అంతకుమించి అనే స్థాయిలో రెచ్చిపోయింది. ఇటీవల కోర్టుకు వెళ్ళింది. విడాకులు తీసుకుంది.
Also Read: ఐదో టెస్టులో రిషబ్ పంత్ అనుమానమే.. అతని స్థానంలో ఆడేది ఎవరంటే?
ఇన్నాళ్లపాటు కలిసి ఉన్న భార్య విడాకులు తీసుకోవడంతో అతడు ఒక్కసారి మనోవేదనకు గురయ్యాడు. విడాకులు తీసుకున్న భార్య 16 సంవత్సరాల కుమారుడిని భర్త వద్ద వదిలేసి వెళ్లిపోయింది. భార్య వదిలి వెళ్ళిన నాటి నుంచి ఆ భర్త ఒక్కసారిగా నిరాశలో కూరుకు పోయాడు. విపరీతంగా బీర్లు తాగడం మొదలుపెట్టాడు. కనీసం ఆహారం కూడా తినలేకపోయే వాడు. దీంతో అతని ఆరోగ్యం దెబ్బతిన్నది. అంతర్గత అవయవాలు పనిచేయడం ఆగిపోయింది. అయినప్పటికీ అతడు బీర్లు తాగడం ఆపలేదు. చివరికి అతడి ఆరోగ్యం అత్యంత విషమంగా మారింది. తండ్రి పరిస్థితి చూడలేక ఆ కుమారుడు స్వచ్ఛంద సంస్థకు సమాచారం అందించాడు. దీంతో వారు ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నాలు చేశారు. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా అతడు కన్నుమూశాడు. అతని గదిలో మొత్తం ఖాళీ బీరు సీసాలు ఉన్నాయి. దాదాపు అవి 100 వరకు ఉంటాయని ఆ స్వచ్ఛంద సంస్థ బాధ్యులు చెబుతున్నారు.. అధికంగా బీర్ తాగడం వల్ల, మద్యం ప్రభావంతో అతడి శరీరంలో ఉన్న అంతర్గత అవయవాలు దెబ్బతిన్నాయని తెలుస్తోంది.
భర్త చనిపోయినప్పటికీ.. ఆ మహిళ చూసేందుకు కూడా రాలేదని తెలుస్తోంది. ఈ సంఘటన థాయిలాండ్ దేశంలో జరిగింది. చనిపోయిన ఆ వ్యక్తి పేరు థవీసక్. అతని వయసు 44 సంవత్సరాల వరకు ఉంటుంది.. భార్య వెళ్లిపోవడంతో అతడు తట్టుకోలేక ఈ పని చేశాడు. అటు తల్లి విడాకులు తీసుకోవడం… తండ్రి ఇలా చనిపోవడంతో ఆ 16 సంవత్సరాల బాలుడు ఒంటరైయిపోయాడు. ఆ బాలుడిని తల్లి తీసుకెళ్తుందా? ఒంటరిగానే వదిలేస్తుందా అనేది? తెలియాల్సి ఉండాలి థాయిలాండ్ మీడియా చెబుతోంది.”ఆ బాలుడు తండ్రిని తలుచుకొని బాధపడుతున్నాడు. కన్నీటి పర్యంతమవుతున్నాడు. ఇలాంటి క్రమంలో ఆ తల్లి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి. ఒకవేళ అతడిని అలాగే వదిలేసి వెళ్తే.. సమాజం నుంచి ఆమె తీవ్ర చీత్కరింపులను ఎదుర్కోవాల్సి ఉంటుందని” థాయిలాండ్ మీడియా పేర్కొన్నది.