Wedding Announced: కాపురం కళ కళ్యాణ మప్పుడే తెలుస్తుందని పెద్దలంటారు. కానీ ఇదేం విడ్డూరమోగాని 35 సంవత్సరాలు వచ్చినా కూడా ఈ ముదురు అమ్మడికి పెళ్లి కాలేదు. మంచి రంగు, దానికి తగ్గట్టుగా శరీర సౌష్టవం ఉన్నప్పటికీ సరైనోడు దొరకలేదు. అందుకే ఇప్పటి వరకు ఒంటికాయ శొంఠి కొమ్ములాగా మిగిలిపోయింది. అసలే వయసులో ఉంది. శరీరమేమో ఒక తోడు కోరుతోంది.. అందుకే చేసేదేం లేక ఒక వినూత్న ఆఫర్ ఇచ్చింది.
. ఆ అమ్మాయి పేరు టిల్లే కౌల్సన్. వయసు 35 సంవత్సరాలు.. ఎత్తు, దానికి తగ్గట్టు పాలమీగడ లాంటి రంగు, మాంచి శరీర సౌష్టవం ఈ అమ్మడి సొంతం. ఉండేదేమో అమెరికాలో. ఎందువల్లో తెలియదు కాని ఈ అమ్మడికి ఇంకా పెళ్లి కాలేదు. ఇకముందు అవుతుందో లేదో కూడా తెలియదు. ఒంటరిగా విరహవేదన అనుభవించి తట్టుకోలేక ఒక తోడు కోరుకుంది.. ఇందులో భాగంగానే డేటింగ్ యాప్స్ లో ప్రయత్నించింది. ఐదు సంవత్సరాల పాటు ఇదే పని చేసింది. కానీ ఎందుకనో ఆమెకు తగ్గ వరుడు దొరకలేదు. ఇక తన వల్ల కాదు అనుకుంది. అందుకే ఒక విచిత్రమైన ప్రకటన జారీ చేసింది.
నాలుగు లక్షలు ఇస్తాను
ఎన్నాళ్ళు వెతికినా సరైన జోడు దొరకకపోవడంతో కౌల్సన్ కు కోపం ఎక్కువైపోయింది. ఇదే సమయంలో ఆమెలో నైరాశ్యం కూడా అలముకుంది. సరైన వయసులో ఒక మగ తోడు లేకుంటే ఎంత ఇబ్బందో స్వయంగా తెలుసుకుంది. అందుకే తనకు ఒక జోడు కావాలని, తనకు తగిన విధంగా ఒక తోడును వెతికితే ఐదువేల డాలర్లు మన కరెన్సీలో చెప్పాలంటే నాలుగు లక్షలు పారితోషికం ఇస్తానని ప్రకటించింది.. అంతేకాదు ఒకవేళ సరైన జోడు దొరికితే అతడితో కేవలం 20 సంవత్సరాల పాటు మాత్రమే కలిసి జీవిస్తానని.. తర్వాత విడాకులు ఇస్తానని ప్రకటించింది. అమెరికాలో పెళ్లి చేసుకోవడం, విడాకులు తీసుకోవడం కామనే. కానీ యువతి పెళ్లికి ముందే విడాకుల విషయంలో ఒక క్లారిటీతో ఉంది.. మరి ఈ యువతీ క్లారిటీకి నచ్చి ఎవరు ముందుకు వస్తారో లేచి చూడాల్సి ఉంది. అన్నట్టు ఈ మహిళ ఇచ్చిన ఆఫర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కాగా ఈమె ప్రకటించిన ఆఫర్ కు నెటిజన్లు కూడా భారీగానే స్పందిస్తున్నారు. ” మీరు చూస్తే చాలా అందంగా ఉన్నారు. ఇప్పటివరకు మీరు పెళ్లి చేసుకోకపోవడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఇంత అందం పెట్టుకొని ఇ న్ని సంవత్సరాల పాటు అలా ఎలా ఉన్నారు? ఇది నమ్మే విషయమేనా?” అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మీకు సరైన వ్యక్తిని చూసే బాధ్యత మాది అంటూ మరి కొంతమంది భరోసా ఇస్తున్నారు.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Los angeles eve tilley coulson has announced that she is looking for a groom for the wedding
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com