Los Angeles Tensions: లాస్ ఏంజెలెస్ లో అక్రమ వలసదారుల తరలింపు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. 44 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఆందోళనకారులు భగ్గుమన్నారు. నిరసన కు దిగారు. దీనిపై తీవ్రంగా స్పందించిన యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ 2వేల మంది నేషనల్ గార్డ్స్ ను అక్కడికి పంపాలని ఆదేశించారు. అక్రమ వలసదారులను ఉపేక్షించేది లేదని స్పష్టంచేశారు. అయితే ట్రంప్ ఉద్దేశం ఉద్రిక్తతలను రెచ్చగొట్టడమేనని కాలిఫోర్నియా గవర్నర్ మండిపడ్డారు.