Homeఅంతర్జాతీయంLos Angeles Protests: అగ్రరాజ్యం మరీ.. లొల్లిలో సందట్లో సడేమియా.. దుకాణాలన్నీ లూటీ

Los Angeles Protests: అగ్రరాజ్యం మరీ.. లొల్లిలో సందట్లో సడేమియా.. దుకాణాలన్నీ లూటీ

Los Angeles Protests: పై ఉపోద్ఘాతం అగ్ర రాజ్యానికి అచ్చు గుద్దినట్టు వర్తిస్తుంది. ఎందుకంటే అగ్రరాజ్యంలోని లాస్ ఏంజెల్స్ ప్రాంతంలో ప్రస్తుతం గొడవలు జరుగుతున్నాయి. అక్కడ పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. ప్రజలు వీధుల్లోకి వచ్చి గొడవలు చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.. ఇప్పటి అక్కడ భారీ స్థాయిలో నష్టం చోటుచేసుకుంది. కార్యాలయాలు మూతపడ్డాయి. ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధించింది. పోలీసులు కర్ఫ్యూ విధిస్తున్నారు. అయినప్పటికీ నిరసనకారులు ఆగడం లేదు. ఇక కొన్నిచోట్ల నిరసనకారులు విధ్వంసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా షాపింగ్ మాల్స్ లో దొంగతనాలకు పాల్పడుతున్నారు. గుంపులుగా వెళ్లి లూటీలు చేస్తున్నారు. ఆ దారుణానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా శ్వేత దేశంలో స్థిరపడిన ఇతర దేశస్తులు ఈ వీడియోలను సోషల్ మీడియాలో ప్రముఖంగా ప్రచారం చేస్తున్నారు. మొత్తంగా చూస్తే అమెరికాలో కూడా అత్యంత అధ్వానమైన పరిస్థితులు ఉన్నాయని తెలుస్తోంది.

కోపం కట్టలు తెంచుకుంది

పిల్లిని ఒక గదిలో బంధిస్తే.. దానిపై దాడికి పాల్పడితే అది ఒక్కసారిగా ప్రతి దాడి చేసినట్టు.. లాస్ ఏంజిల్స్ లో కూడా పరిస్థితి అలానే ఉంది. అక్కడ ప్రజలు నిర్బంధించడంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైంది. పోలీసులపై దాడులు చేసే స్థాయికి దిగజారింది. అయితే కొంతమంది నిరసనకారులు సహనం కోల్పోయి అడ్డగోలుగా విధ్వంస కార్యక్రమాలు చేపడుతున్నారు. దుకాణాలలో లూటీలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం చేకూర్చుతున్నారు. అందువల్లే అక్కడ పోలీసులు కర్ఫ్యూ విధిస్తున్నారు.

షాపింగ్ మాల్స్ మూసివేసినప్పటికీ దొడ్డి దారిన వెళ్తున్న నిరసనకారులు వాటిలో ఉన్న సామాగ్రి.. డబ్బులు దొంగిలిస్తున్నారు. అయితే ఈ తరహా దారుణాలు గత రెండు రోజుల వ్యవధిలో పెరిగిపోయాయని గ్లోబల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రపంచానికి నాగరికత నేర్పామని గొప్పలు చెప్పే అమెరికాలో ఇటువంటి దారుణాలు చోటు చేసుకోవడం నిజంగా ఆశ్చర్యకరంగా ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అమెరికా కూడా ఒక సాధారణ దేశమేనని.. దానిని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదని వారు ఉటంకిస్తున్నారు. ” అమెరికాలో కూడా అంత గొప్పగా పరిస్థితి లేదు. ఇప్పటికే ట్రంప్ ఆధ్వర్యంలో అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు.. రోజురోజుకు ప్రజలలో ఆగ్రహం పెరుగుతోంది. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచ దేశాలలో అమెరికా పరపతిని తగ్గిస్తున్నాయి.. ఇది ఎక్కడదాకా వెళ్తుందో తెలియదు. ఇప్పటికైతే జరుగుతున్న దారుణాలు విపరీతమైన పరిణామాలకు కారణమవుతున్నాయి. ఇదంతా చూస్తుంటే బాధ కలుగుతుందని” నెటిజన్లు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ఈ సమస్య పరిష్కారానికి అమెరికా అధికార ప్రభుత్వం చొరవ తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular