spot_img
Homeక్రీడలుHardik Pandya: చెన్నైలో పాండ్యా "తీన్" మార్

Hardik Pandya: చెన్నైలో పాండ్యా “తీన్” మార్

Hardik Pandya
Hardik Pandya

Hardik Pandya: మూడు వన్డేల సిరీస్ లో భాగంగా చెరో మ్యాచ్ గెలిచిన ఆస్ట్రేలియా, ఇండియా చెన్నై వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ గెలిస్తే కప్ దక్కుతుంది కాబట్టి సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది.. స్మిత్ తమపై ఉంచిన నమ్మకాన్ని ఆస్ట్రేలియా ఓపెనర్లు నిలబెట్టుకున్నారు..మార్ష్(47 బంతుల్లో 47, 8 ఫోర్లు, ఒక సిక్స్), హెడ్(31 బంతుల్లో 33, 4 ఫోర్లు, 2 సిక్స్ లు) వీరవిహారం చేశారు. 10.4 ఓవర్లలోనే 60 పరుగులు చేశారు.

ప్రమాదకరంగా మారుతున్న వీరి జోడిని హార్దిక్ పాండ్యా విడదీశాడు. 10.5 ఓవర్లో హార్దిక్ వేసిన బంతిని భారీ షాట్ కొట్టిన హెడ్…లాంగ్ ఆన్ లో ఉన్న కుల దీప్ కు దొరికిపోయాడు. దీంతో భారత శిబిరంలో హర్షం వ్యక్తం అయింది. వన్ డౌన్ గా బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్ స్టీవ్ స్మిత్ హార్దిక్ బౌలింగ్ లోనే గోల్డెన్ డక్ గా వెను తిరిగాడు. 12.2 ఓవర్ లో ఆస్ట్రేలియా స్కోరు 74 పరుగులుగా ఉన్నప్పుడు.. హార్దిక్ వేసిన అద్భుతమైన ఇన్ స్వింగర్ ను ఆడబోయిన స్మిత్.. కీపర్ రాహుల్ కి దొరికిపోయాడు. ఇదే ఊపులో హాఫ్ సెంచరీ కి చేరువగా ఉన్న మార్ష్ వికెట్ ను కూడా హార్దిక్ తీశాడు.. 14.3 ఓవర్ లో ఆస్ట్రేలియా స్కోర్ 85 పరుగుల వద్ద ఉన్నప్పుడు మార్ష్ ఔట్ అయ్యాడు. పాండ్యా వేసిన బంతిని తప్పుగా అంచనా వేసిన మార్ష్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.. అప్పటికి అతడి స్కోర్ 47 పరుగులు.. దీంతో నిరాశగా మైదానం వీడాడు.

Hardik Pandya
Hardik Pandya

అంతకుముందు కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా ఓపెనర్లను విడదీసేందుకు మార్చి మార్చి బౌలింగ్ చేయించినా ఉపయోగం లేకుండా పోయింది.. సిరాజ్, షమీ, అక్షర్ పటేల్, జడేజా, కుల దీప్ యాదవ్ ను ప్రయోగించినా హెడ్, మార్ష్ స్వేచ్ఛగా పరుగులు తీశారు.. కానీ ఎప్పుడైతే హార్దిక్ పాండ్యా బంతి అందుకున్నాడో అప్పుడే మ్యాచ్ స్వరూపం మారిపోయింది.. 68 పరుగులతో పటిష్టంగా ఉన్న ఆస్ట్రేలియా 17 పరుగుల వ్యవధిలోనే ఇద్దరు ఓపెనర్లు, కెప్టెన్ వికెట్లు కోల్పోయింది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper