
KCR- Chamkila Angilesi Song: అచ్చమైనా నాటు పదాలతో చంద్రబోస్ రాసిన నాటు.. నాటు.. పాట ఆస్కార్ అందుకుని విశ్వవ్యాప్తంగా మరోమారు అందరితో నాటు స్టెప్పులు వేయిస్తోంది. ఆస్కార్ విన్నింగ్ సాంగ్ నాటు.. నాటు.. ఊపులో కూడా తెలంగాణ పదాలతో వచ్చిన మరో వచ్చిన ‘దసరా’ చిత్రంలో ‘చమ్కీల అంగీలేసి’ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వ్యక్తి ఆహార్యాన్ని వర్ణిస్తూ హీరోయిన్ పాడిన ఈ పాటలో డ్యాన్స్ కూడా సింపుల్ స్టెప్స్‌తో ఉంది. దీంతో అమ్మాయిలు తెగ రీల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ లిక్కర్ స్కాంలో కల్వకుంట్ల కవితను ఈడీ విచారణ.. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వివాదం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చుట్టుముట్టాయి. వరుస వివాదాలతో ఎట్లుండే కేసీఆర్ ఎల్లయిండు అన్నట్లు.. చమ్కీల అంగేసీ పాటను జోడించి నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న రీల్స్..
దసరా సినిమాలోని చమ్కీల అంగేసి పాట ఇప్పటికే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సింగర్ ధీ కూడా ఈ పాట రీల్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తర్వాత పాట, అందులోని పదాలు అందరి హృదయాలను హత్తుకేనేలా ఉండడంతో మహిళలు తమ భర్తను ఊహించుకుంటూ.. యువతులు తమ ప్రియుడిని ఇమాజినేషన్ చేసుకుంటూ రీల్స్ చేస్తున్నారు. కొంతమంది తమ పెర్ఫార్మెన్స్‌ను నెట్టింట్లో వైరల్ చేస్తున్నారు. దీంతో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ రీల్స్ చెక్కర్లు కొడుతున్నాయి.
కేసీఆర్‌పైనే ఫస్ట్ పొలిటికల్ రీల్..
ఇంతలా సోషల్ మీడియాను షేక్ చమ్కీల అంగేసి.. పాట ఇప్పుడు పొలిటికల్ రీల్‌కూ అచ్చంగా సరిపోతోంది. అదీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనే ఫస్ట్ పొలిటికల్ రీల్. మొన్నటి వరకు మోదీని గద్దె దించుతా.. బీజేపీని బంగాళాఖాతంలో కలుపుతా.. అబ్‌కీబార్ కిసాన్ సర్కార్ వంటి స్లోగన్స్‌తో మంచి ఫైర్ మీద ఉన్న కేసీఆర్.. లిక్కర్ స్కాంలో ఆయన కూతురు కవితను ఈడీ విచారణ చేయడం.. మరోవైపు టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ తెలంగాణ సర్కార్‌ను చుట్టుముట్టడం.. మరోవైపు లీకేజీకి విపక్షాలు కేసీఆర్ తనయుడు, ఐటీ మంత్రి కేటీఆర్‌ను టార్గెట్ చేయడంతో ఇప్పుడు కేసీఆర్ పూర్తిగా డీలా పడిపోయాడు అని అర్థమయ్యేలా చమ్కీల అంగీ.. పాటకు కేసీఆర్ మార్ఫింగ్ ఫొటోలు, వివిధ సందర్భాల్లో కేసీఆర్ హావ భావాలను జోడించి చేసిన ఈ రీల్ ఇప్పుడు నెటిజన్స్‌ను ఆకట్టుకుంటోంది. దీనిని తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇక కామెంట్స్ కూడా అంతే స్థాయిలో వస్తున్నాయి. ఎట్లుండే కాక ఎట్లయిండు అని కొందరు.. సూపర్ ఎడిటింగ్ అంటూ ఇంకొందరు.. లాఫింగ్ ఈమోజీతో అనేక మంది లైక్స్, షేర్స్ చేస్తున్నారు.