Homeక్రీడలుక్రికెట్‌Hardik Pandya: హార్దిక్ పాండ్యా.. ఆ మోజు నుంచి బయటికి రా..

Hardik Pandya: హార్దిక్ పాండ్యా.. ఆ మోజు నుంచి బయటికి రా..

Hardik Pandya: టీమిండియాలో అత్యంత సమర్థవంతమైన ఆల్రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా ముందు వరుసలో ఉంటాడు. జట్టుకు అవసరమైన సందర్భంలో గట్టిగా నిలబడతాడు. బ్యాటింగ్ బాగా చేస్తాడు. బౌలింగ్ కూడా అదే స్థాయిలో వేస్తాడు. ఇక ఫీల్డింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హార్దిక్ పాండ్యా అతి స్వల్ప కాలంలోనే గుర్తింపు సాధించాడు. ఐపీఎల్ లో గుజరాత్ జట్టుకు ట్రోఫీ అందించాడు. మరోసారి ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. టీమిండియా 2024లో టి20 వరల్డ్ కప్ సాధించినప్పుడు […]

Hardik Pandya: టీమిండియాలో అత్యంత సమర్థవంతమైన ఆల్రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా ముందు వరుసలో ఉంటాడు. జట్టుకు అవసరమైన సందర్భంలో గట్టిగా నిలబడతాడు. బ్యాటింగ్ బాగా చేస్తాడు. బౌలింగ్ కూడా అదే స్థాయిలో వేస్తాడు. ఇక ఫీల్డింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

హార్దిక్ పాండ్యా అతి స్వల్ప కాలంలోనే గుర్తింపు సాధించాడు. ఐపీఎల్ లో గుజరాత్ జట్టుకు ట్రోఫీ అందించాడు. మరోసారి ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. టీమిండియా 2024లో టి20 వరల్డ్ కప్ సాధించినప్పుడు జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు. ఇంతటి స్థాయి ఉన్నప్పటికీ హార్దిక్ పాండ్యా ను బ్యాడ్ లక్ వెంటాడుతోంది. దీనంతటికీ ప్రధాన కారణం అతడు తీసుకుంటున్న నిర్ణయాలు. అందువల్లే అతడికి జట్టులో స్థిరమైన స్థానం లభించడం లేదు. గాయాలు.. వివాదాలు.. ఫామ్ కోల్పోవడం.. ఇలా అనేక దురదృష్టాలు హార్దిక్ పాండ్యాను వెంటాడుతున్నాయి.

కెరియర్ డోలాయమానంలో ఉన్నప్పటికీ హార్థిక్ పాండ్యా ఆ విషయం లో ఏమాత్రం తగ్గడం లేదు.. పైగా అతడు నటాషా తో విడాకులు తీసుకున్న తర్వాత.. స్వల్ప కాలంలోనే మహిక శర్మ తో రిలేషన్ మొదలు పెట్టాడు. ప్రస్తుతం తన ఆట తీరు మెరుగుపరచుకోవడానికి బెంగళూరులో బిసిసిఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో చేరాడు. బెంగళూరులో విలాసవంతమైన భవనాన్ని అద్దెకి తీసుకున్నాడు. త్వరలోనే అందులోకి అతడు ప్రవేశించబోతున్నాడు. ఆ తర్వాత మహికను పెళ్లి చేసుకుంటాడని వార్తలు వస్తున్నాయి. అయితే తన కెరియర్ మొత్తం ఇలా కావడానికి హార్దిక్ పాండ్యా అనే కారణం. 2024లో గుజరాత్ నుంచి ముంబై వచ్చిన తర్వాత హార్దిక్ పాండ్యా పరిస్థితి దారుణంగా మారిపోయింది.. 2024.. 2025.. 2026 ఇలా మూడు సీజన్లో అతని నాయకత్వంలో ముంబై జట్టు అంతగా ఆడలేకపోయింది. మేనేజ్మెంట్ కూడా అతని ఆట తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. స్పోర్ట్స్ వర్గాల నివేదిక ప్రకారం అతడు చెన్నై లేదా కోల్కతా లేదా గుజరాత్ జట్లకు సారధిగా వ్యవహరించే అవకాశం ఉంది. చెన్నై జట్టుకు గైక్వాడ్ సారధిగా ఉన్నాడు. గుజరాత్ జట్టుకు గిల్ నాయకుడిగా ఉన్నాడు. అతడిని సారధ్య బాధ్యతల నుంచి మేనేజ్మెంట్ తప్పించే అవకాశం లేదు. రహనే కోల్కతా జట్టుకు ఈ సీజన్ వరకు సారధిగా ఉన్నాడు. అతని ఆట తీరు మీద కోల్కతా యాజమాన్యానికి అంత గొప్ప అభిప్రాయం లేదు. ఈ ప్రకారం చూసుకుంటే హార్దిక్ పాండ్యా కోల్కతాకు వెళ్లే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో హార్దిక్ పాండ్యా తనను తాను నిరూపించుకోవాలి. సారధిగా మంచి మార్కులు సొంతం చేసుకోవాలి. ఇదంతా జరగాలంటే అతని ఆట తీరు పూర్తిగా మారాలి. అందువల్లే అతడు కోల్కతా జట్టులోకి వెళ్లి.. నాయకుడిగా తనను తాను నిరూపించుకోవాలని.. అప్పుడే హార్దిక్ పాండ్యా పోయిన పేరును తిరిగి సొంతం చేసుకుంటాడని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఈ విషయంలో హార్దిక్ పాండ్యా ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాల్సి ఉంది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper