spot_img
Homeఎంటర్టైన్మెంట్Akkineni Nagarjuna: సోలో సినిమాలు వద్దు..ముల్టీస్టార్ర్ర్ సినిమాలు ముద్దు అంటున్న అక్కినేని నాగార్జున

Akkineni Nagarjuna: సోలో సినిమాలు వద్దు..ముల్టీస్టార్ర్ర్ సినిమాలు ముద్దు అంటున్న అక్కినేని నాగార్జున

Akkineni Nagarjuna
Akkineni Nagarjuna

Akkineni Nagarjuna: గత కొంతకాలం నుండి వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో అభిమానులను తీవ్రమైన నిరాశకి గురి చేస్తున్న హీరో అక్కినేని నాగార్జున. ప్రయాగాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిల్చిన నాగార్జునకి ఒకప్పుడు ఆ ప్రయోగాలే ఆయనని స్టార్ హీరో గా నిలబెట్టాయి. కానీ ఇప్పుడు ఆ ప్రయోగాలే స్టార్ స్టేటస్ ని పొయ్యేలా చేసింది. మూడు దశాబ్దాల నుండి టాప్ 4 హీరోస్ లో ఒకరిగా కొనసాగిన నాగార్జున కి జీరో షేర్ వచ్చిన సినిమాలు కూడా ఈమధ్యనే తగిలాయి.

ఇది ఆయన ఇమేజిని మసకబారేలా చేసింది.రీసెంట్ గా విడుదలైన ‘ఘోస్ట్’ చిత్రం కూడా 10 కోట్ల రూపాయిల లోపే షేర్ వసూళ్లను రాబట్టింది. ఇది నాగార్జున సినీ ప్రస్థానం కి అవమానం లాంటిది.అభిమానులు దయచేసి ఇక ప్రయోగాలు ఆపు అంటూ నాగార్జున ని వేడుకుంటున్నారు.అభిమానుల ప్రార్థనలను మన్నించి ఇక నుండి నాగార్జున ప్రయాగాత్మక చిత్రాల దరిదాపుల్లోకి కూడా వెళ్ళడానికి ఇష్టపడడం లేదట.

అంతే కాకుండా ఆయన ఇక నుండి సోలో హీరో గా కంటే కూడా మల్టీస్టార్ర్ర్ సినిమాలు చెయ్యడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడు.ప్రస్తుతం ఆయన ‘ధమాకా’ రచయిత ప్రసన్న కుమార్ దర్శకత్వం లో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతున్న ఈ కమర్షియల్ మాస్ సినిమాలో, నాగార్జున తో పాటుగా అల్లరి నరేష్ కూడా నటించబోతున్నాడు. అల్లరి నరేష్ కి ఈ చిత్రం లో నాగార్జున తో సరిసమానమైన పాత్రని డిజైన్ చేసాడట డైరెక్టర్.త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లనుంది.

Akkineni Nagarjuna
Akkineni Nagarjuna

ఇక ఈ సినిమా పూర్తి అయిన వెంటనే తమిళ స్టార్ హీరో సూర్య తో కలిసి ఒక సినిమా చేయబోతున్నాడట నాగార్జున.ఒక కొత్త డైరెక్టర్ ఈ చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అవ్వబోతున్నాడు.ఇలా వరుసగా ఆయన మల్టీస్టార్ర్ర్ సబ్జక్ట్స్ చెయ్యడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడట, ఒక విధంగా చెప్పాలంటే నాగార్జున కి ఇది సరికొత్త ఇన్నింగ్స్.ఈ సరికోతే ఫేస్ లో అభిమానులను ఆయన ఎలా అలరించబోతున్నాడో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...
Lenin 2 Weeks Collections

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Jabardasth Naresh

Jabardasth Naresh: ఆ ఇద్దరు రహస్యాలు మొత్తం నాకు తెలుసు అంటూ పెద్ద బాంబు పేల్చిన జబర్దస్త్ నరేష్..

Jabardasth Naresh: 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు నరేష్. చూసేందుకు చాలా చిన్నపిల్లవాడు లాగా కనిపిస్తాడు కానీ , ఇతని వయస్సు పాతికేళ్ల...
Jana Nayagan

Jana Nayagan: ‘జన నాయగన్’ థియేటర్ లో గుండెలు పగిలేలా ఏడ్చిన మహిళ.. వీడియో వైరల్..

Jana Nayagan: కొన్ని సినిమాలు హిట్ / ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానుల హృదయాలను హత్తుకునే మధురమైన అనుభూతులు కలిగిస్తుంటాయి. వాటి నుండి మనం ఎప్పటికీ బయటకు రాలేము. ప్రతీ స్టార్...
Oktelugu Epaper